బార్లీ వాటర్ తో 11 తీవ్ర దుష్ప్ర‌భావాలు

Written By: sujeeth kumar
Subscribe to Boldsky

అధిక పోష‌క విలువ‌లు క‌లిగి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చే ధాన్యాల్లో బార్లీ గింజ‌లు ఒక రకం. ఈ గింజ‌ల‌తో త‌యారైన బార్లీ నీళ్ల‌తో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలున్నాయి. ఈ నీళ్ల‌ను త్రాగితే ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌టు మాయ‌మ‌వుతాయని కొన్ని అధ్య‌య‌నాల్లో తేలింది.

అయితే అదే స‌మ‌యంలో బార్లీ నీళ్ల వ‌ల్ల కొన్ని ర‌కాల స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. దీని వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాలేంటో ఈ కింద వివ‌రించాం.

1. అపాన వాయువులు(గ్యాస్)

1. అపాన వాయువులు(గ్యాస్)

బార్లీలో పీచు ప‌దార్థాలు అధికంగా ఉండ‌టం వ‌ల్ల శ‌రీరంలో అపాన వాయువులు ఏర్ప‌డ‌టానికి దోహ‌దం చేస్తుంది. బార్లీని తీసుకున్న‌ప్పుడు మ‌న విస‌ర్జ‌క వ్య‌వ‌స్థ‌లోని బ్యాక్టీరియా జీర్ణం కాని పీచు ప‌దార్థాల‌తో చ‌ర్య‌నొంది అపాన వాయువుల‌ను ఏర్ప‌రుస్తాయి. కాబట్టి ఈ ఇబ్బందుల‌ను నివారించేందుకు బార్లీ నీళ్ల‌ను ప‌రిమితంగా తీసుకోవ‌డం మంచిది.

2. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు

2. ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు

బార్లీ నీళ్ల‌ను అధికంగా తీసుకోవ‌డంతో పాటు, ఇత‌ర ఔష‌ధాల‌తో వీటి చ‌ర్య కార‌ణంగా ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు వస్తాయి. పై రెండు సంద‌ర్భాల వ‌ల్ల క‌డుపులో నొప్పి, వికారం, ఉబ్బ‌రం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి.

3. మ‌ల‌బ‌ద్ధ‌కం

3. మ‌ల‌బ‌ద్ధ‌కం

బార్లీ నీళ్లు అధికంగా త్రాగడం వ‌ల్ల తీవ్ర‌మైన మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌స్య ఒక వారానికి మించి ఉంటే వైద్యుడిని సంప్ర‌దించ‌డం మేలు.

4. పాయువులో రక్తస్రావం

4. పాయువులో రక్తస్రావం

బార్లీ నీళ్ల‌తో త‌లెత్తిన మ‌ల‌బద్ధ‌కం స‌మ‌స్య‌లు ఒక్కోసారి మ‌న విస‌ర్జ‌క వ్య‌వ‌స్థ‌లోని పాయువు(రెక్టాల్) లో నొప్పితో కూడిన ర‌క్త‌స్రావానికి దారి తీయవ‌చ్చు. కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు బార్లీ నీళ్ల‌ను అధికంగా తీసుకోవ‌డం ఆపివేయాలి.

5. ఫంగ‌ల్ కాలుష్యం

5. ఫంగ‌ల్ కాలుష్యం

బార్లీ నీళ్లను త్రాగడం ద్వారా మ‌న శ‌రీరంలో ఫంగ‌ల్ కాలుష్యం పెరుగుతుందని కొన్ని అధ్య‌య‌నాల‌లో తేలింది. బార్లీ మాల్ట్‌లో ట్రైకోథేసియ‌మ్ రోసియ‌మ్‌, ఒకార్టాక్సిన్ ఏ వంటి కలుషిత ప‌దార్థాలు మ‌న ఎముక‌ల‌పై ప్ర‌భావం చూపుతాయి.

6. అలెర్జీలు

6. అలెర్జీలు

బార్లీ నీళ్ల సేవ‌నం ద్వారా అలెర్జీలు రావ‌డం సాధార‌ణం. గ‌త కొద్ది కాలంగా మీరు హైప‌ర్ సెన్స్‌టివిటీ లేదా అలెర్జీల‌తో

బాధ ప‌డుతున్న‌ట్ల‌యితే రోజు వారీగా తాగే బార్లీ నీళ్ల ప‌రిమాణాన్ని నియంత్రించండి. లేకుంటే ద‌ద్దుర్లు, మంట‌లు, చికాకు ప‌డటం వంటి ల‌క్ష‌ణాల‌తో పాటు క‌ళ్లు, ముక్కు, చేతులు, కాళ్లు వాచిపోవ‌డం వంటి అలెర్జీ ల‌క్షణాలను ఎదుర్కొంటారు.

7. బేక‌ర్స్‌ అస్థ‌మా

7. బేక‌ర్స్‌ అస్థ‌మా

బార్లీ ధాన్యం బేక‌రీల‌లో ప‌ని చేసే వారికి తీవ్ర శ్వాస ప‌ర‌మైన ఇబ్బందుల‌ను సృష్టిస్తుంది. దీన్నే బేక‌ర్స్ ఆస్థ‌మా అంటారు. కాబ‌ట్టి బార్లీ నీళ్ల తయారీ కోసం బార్లీ గింజ‌ల‌ను పొడిగా మార్చే క్ర‌మంలో మీకు కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి జాగ్ర‌త్త వ‌హించండి.

8. అన్నవాహిక సంబంధిత స‌మ‌స్య‌లు

8. అన్నవాహిక సంబంధిత స‌మ‌స్య‌లు

బార్లీ గింజ‌ల‌లో అధిక పీచు ప‌దార్థాల వ‌ల్ల ఒక్కోసారి అన్న వాహిక‌(ఆహార నాళంలో) మూసుకుపోవ‌డం లేదా ప‌గిలిపోవ‌టం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి బార్లీ నీళ్ల‌ను తయారు చేసేట‌ప్పుడు త‌గినంత ప‌రిమాణంలో నీళ్ల‌ను క‌ల‌పండి. లేకుంటే ఆహ‌ర ప‌దార్థాల‌ను మింగ‌టంలో ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు.

9. ఉద‌ర‌ కుహ‌ర వ్యాధి

9. ఉద‌ర‌ కుహ‌ర వ్యాధి

గ్లూటెన్ ప‌డ‌నివారికి సాధార‌ణంగా ఉద‌ర కుహార వ్యాధి సంభ‌విస్తుంటుంది. బార్లీ గింజ‌ల‌లో అధిక శాతం గ్లూటెన్ ఉంటుంది కాబ‌ట్టి బార్లీ నీళ్లు త్రాగిన‌ప్ప‌డు మీకు కూడా ఇలా జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

10. రక్తంలోని చక్కెర స్థాయుల‌ను త‌గ్గిస్తుంది

10. రక్తంలోని చక్కెర స్థాయుల‌ను త‌గ్గిస్తుంది

బార్లీ నీళ్ల‌ను అధికంగా త్రాగ‌డం ద్వారా ర‌క్తంలోని చ‌క్కెర స్థాయులు ఒక్కసారిగా ప‌డిపోయే అవ‌కాశం ఉంది. చ‌క్కెర స్థాయులు ఒక‌వేళ సాధార‌ణం కంటే కింద‌కి ప‌డిపోయిన‌ప్పుడు మీరు హైపో గ్లెసిమీయా ల‌క్ష‌ణాల‌ను ఎదుర్కొంటారు. కాబ‌ట్టి ప్ర‌తీ రోజూ బార్లీ నీళ్లు తాగేట‌ప్పుడు మీ చ‌క్కెర స్థాయుల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించండి.

11. శ‌స్త్ర చికిత్స‌లు స‌మ‌స్యాత్మ‌కం కావొచ్చు.

11. శ‌స్త్ర చికిత్స‌లు స‌మ‌స్యాత్మ‌కం కావొచ్చు.

బార్లీ నీళ్ల వ‌ల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఒక్క‌సారిగా త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. దీంతో శ‌స్త్ర చికిత్స‌లు చేయించుకోవాల‌నుకునే వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మేలు. కాబ‌ట్టి స‌ర్జ‌రీ చేయించుకోవాల‌నుకునే వారు 10 నుంచి 14 రోజుల ముందుగానే బార్లీ నీళ్ల‌ను తాగ‌డం ఆపేయాలి. దీని వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయులు నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చి స‌ర్జీ స‌మ‌యంలో ఇబ్బందులు ఏర్ప‌డ‌వు

ప్ర‌తీరోజూ బార్లీ నీళ్ల‌ను తాగ‌డం ద్వారా స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్ప‌లేం. కానీ నీళ్ల‌ను ప‌రిమితికి మించి తాగ‌క‌పోతేనే మంచిది. కాబ‌ట్టి పైన తెలిపిన స‌మ‌స్య‌లు మీకు ఎదుర‌యితే వైద్యుడిని సంప్ర‌దించ‌డం మేలు.

మీరు ప్ర‌తీ రోజూ బార్లీ నీళ్ల‌ను తాగుతున్నారా?, పైన తెలిపిన దుష్ప్ర‌భావాలు మీకూ ఎదుర‌య్యాయా? అయితే మీ అనుభ‌వాల‌ను మాతో పంచుకుని మీ అభిప్రాయాల‌ను తెలుప‌గ‌ల‌రు.

English summary

Serious Side Effects Of Barley Water

Barley is one of the healthiest grain crops with numerous medicinal benefits. The drink prepared by mixing barley flour with water is considered as a healthy choice. It can alleviate a number of health problems, while providing nourishment to our body.