For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత బలాన్నిచ్చే 10 రకాల స్మూతీలు

|

దైనందిక జీవన విధానంలో, తీరికలేని కార్యాచరణల కారణంగా శరీరానికి సరైన పోషకాలను అందించలేకపోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులకు ఊరటగా తక్కువ శ్రమతోనే పూర్తయ్యే సలాడ్లు, స్మూతీస్ సహాయకంగా ఉంటాయి. క్రమంగా పండ్లు మరియు కూరగాయల ద్వారా మీ రోజువారీ శరీర అవసరాలకు తగిన మోతాదులో పోషకాలను అందించడానికి సులభమైన మరియు వేగవంతమైన మార్గంగా ఉండగలవు. బరువు తగ్గించడం మరియు శరీర నిర్మాణానికి ఉపయోగపడగల ప్రోటీన్ షేక్స్, ఎనర్జీ బూస్టింగ్ షేక్స్ వంటి వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా వివిధరకాల పోషకాలను స్మూతీస్ కలిగి ఉన్నాయనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈరోజు అటువంటి స్మూతీస్ గురించిన సమగ్ర సమాచారాన్ని ఈ వ్యాసంలో పొందుపరచడం జరిగింది. మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

అథ్లెట్స్, వారి పనితీరుని మెరుగుపరచుకోవడానికి మరియు శరీరం నీరసంగా ఉన్నట్లు అనిపించినప్పుడు శక్తిస్థాయిలు పెంచడానికి ఈ స్మూతీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అదేవిధంగా, వ్యాయామం తర్వాత మీ శరీరానికి ఎనర్జీని అందించేందుకు కూడా తోడ్పడుతాయి.

Smoothies

ఈ శక్తిని పెంచే స్మూతీస్ మీ పొట్టను నింపడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా మీ ఆహార కోరికలను నియంత్రించగలిగి, మీ వెయిట్ లాస్ ప్రణాళికకు ఎంతగానో తోడ్పాటును అందివ్వగలదు. ఈ స్మూతీస్, మీ శరీరానికి సరిపడే మోతాదులో ఖనిజాలు, విటమిన్లను కలిగి ఉంటాయి. క్రమంగా శరీర జీవక్రియలు మెరుగుపడి, హార్మోనుల క్రమబద్దీకరణకు కూడా సహాయం చేయగలదు.

తమ పనితీరును మెరుగుపర్చుకోడానికి ప్రణాళికలు చేసుకుంటున్న క్రీడాకారులు, లేదా వ్యక్తిగత ఆరోగ్యం గురించిన ఆలోచన ఉండేవారు తప్పనిసరిగా ఈ స్మూతీలను ప్రయత్నించవచ్చు.

1. అరటి మరియు బాదం మిల్క్ స్మూతీ :

1. అరటి మరియు బాదం మిల్క్ స్మూతీ :

అరటిపండు పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, వంటి అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలకు అద్భుతమైన వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఎటువంటి ఆహార ప్రణాళికలో అయినా జోడించుకోదగిన ఉత్తమ ఆహార పదార్ధంగా ఉంటుంది. శారీరిక శక్తిస్థాయిలను పెంపొందించడంలో అరటి పండు అత్యుత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడుతుంది.

తయారుచేయు విధానం : అరటిపండు, బాదం పాలు, కొద్దిగా దాల్చిన చెక్క పొడిని ఒక పాత్రలోకి తీసుకుని రెండు నిమిషాల పాటు బ్లెండ్ చేయాలి.

2. ఆరెంజ్, అరటి మరియు స్ట్రాబెర్రీ స్మూతీ

2. ఆరెంజ్, అరటి మరియు స్ట్రాబెర్రీ స్మూతీ

రోజువారీ శారీరిక అవసరాలలో భాగంగా ఉండే 43 కేలరీల డైల్యూటెడ్ ఫైబర్లో, 13 శాతం కంటే ఎక్కువగా కప్పు స్ట్రాబెర్రీలలో ఉంటుంది. ఈ డైటరీ ఫైబర్ జీర్ణక్రియలకు సహాయపడుతుంది మరియు ఆరోగ్యవంతమైన ప్రేగు క్రియలకు సహాయపడుతుంది. అంతేకాకుండా, రక్తపోటును తగ్గించడంలో మరియు అతిగా ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా నియంత్రించడంలో ఉత్తమంగా సహాయం చేస్తుంది. క్రమంగా మీ వెయిట్ లాస్ ప్రణాళికలో సహాయపడుతుంది. మీ వ్యాయామం సెషన్ తర్వాత ఈ స్మూతీని తీసుకున్న ఎడల, మీ శరీరానికి తగిన శక్తిస్థాయిలను అందివ్వడంలో తోడ్పాటునందిస్తుంది. మరియు మీరు తిరిగి కోలుకోవడానికి సహాయపడుతుంది.

తయారుచేయు విధానం : ఒక బ్లెండర్లో సోయా మిల్క్, స్ట్రాబెర్రీలు మరియు అరటిపండ్లను జోడించండి. దీనిని 1 నిమిషంపాటు బ్లెండ్ చేసి, దానికి నారింజ రసాన్ని జోడించండి.

3. కివి మరియు క్రాన్బెర్రీ స్మూతీ :

3. కివి మరియు క్రాన్బెర్రీ స్మూతీ :

కివీ పండులో విటమిన్లు మరియు ఖనిజ లవణాలు రెండూ సమృద్ధిగా ఉంటాయి, ఇవి నాడీ మరియు రక్తప్రసరణ వ్యవస్థల పనితీరును ప్రోత్సహించడానికి సహాయపడతాయి. కివీ పండులో విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ ఇ, మరియు పొటాషియం సమృద్దిగా ఉంటాయి. క్రాన్ బెర్రీస్ వాపు ప్రమాదాన్ని తగ్గించడంతోపాటు, రక్తపోటును కూడా తగ్గిస్తుందని చెప్పబడుతుంది. ఈ రెండు పండ్ల కలయిక మీ శరీరానికి ఉత్తమ శక్తిస్థాయిలను అందివ్వగలవు.

తయారుచేయు విధానం: బ్లెండర్లో కివి మరియు క్రాన్బెర్రీ రెండింటినీ తీసుకుని బ్లెండ్ చేయాలి. దీనిలో కొన్ని చుక్కలు లేదా అర టీస్పూన్ తేనెను కలపండి.

4. చాక్లెట్ స్మూతీ :

4. చాక్లెట్ స్మూతీ :

చాక్లెట్ సంతోషానికి కారణమయ్యే డోపమైన్, సెరటోనిన్ హార్మోనుల ఉత్పత్తికి ఎంతగానో దోహదపడుతుంది. ఎందుకంటే దీనిలో సహజసిద్దమైన హాపీ హార్మోన్ ఉత్ప్రేరితాలు ఉంటాయి. అంతేకాకుండా డార్క్ చాక్లెట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ గుండె సంబంధిత సమస్యలను నివారించడానికి అవసరమయ్యే శక్తిస్థాయిలను మీ శరీరానికి అందించగలవు. ఈ సూపర్ ఎనర్జీ స్మూతీని ప్రతిరోజూ తీసుకోవచ్చు.

తయారుచేయు విధానం : డార్క్ చాక్లెట్ బార్ను కరిగించి, దీనికి పాలు మరియు వెనిలా లేదా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ జోడించి, మిశ్రమంగా క్రీమీగా మారేవరకు కలపండి.

5. మల్బరీ, లావెండర్ మరియు కాలే స్మూతీ :

5. మల్బరీ, లావెండర్ మరియు కాలే స్మూతీ :

మల్బెర్రీస్ లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు పాలీఫినాల్స్ ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, రిబోఫ్లేవిన్, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం కూడా ఉంటాయి. మరోవైపు ఎండిన లావెండర్ పువ్వులు మంచి నిద్రను అందివ్వగలవు. క్రమంగా తలనొప్పి నుండి ఉపశమనం అందివ్వడమే కాకుండా, మానసిక స్థాయిలను మెరుగుపరచడానికి కూడా తోడ్పాటునందిస్తుంది. కాలేలో క్యాలరీలు, జీరో ఫ్యాట్ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఎనర్జీ స్మూతీస్ మీ శరీరానికి పరిపూర్ణ శక్తిస్థాయిలను అందివ్వడంలో సహాయకారిగా ఉండగలదు.

తయారుచేయు విధానం : అన్ని పదార్థాలను ఒక పాత్రలోకి తీసుకుని, బ్లెండ్ చేసి తీసుకోండి. ప్రతిరోజూ తీసుకోదగిన ఉత్తమ స్మూతీగా చెప్పబడుతుంది.

6. చాక్లెట్, చియా మరియు అరటి స్మూతీ :

6. చాక్లెట్, చియా మరియు అరటి స్మూతీ :

చియా విత్తనాలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలలో అధికంగా ఉంటాయి. అనామ్లజనకాలలో ఉత్తమంగా ఉన్న కకావో, మరియు వాసోలిడేటర్ అయిన థియోబ్రోమిన్, డైయూరిటిక్ లక్షణాలను కలిగి ఉండి, గుండె ఆరోగ్యానికి ఒక అద్భుతమైన మూలంగా చెప్పబడుతుంది. వ్యాయామం సెషన్ తర్వాత, లేదా సాయంత్రం స్నాక్ గా ఈ స్మూతీని తీసుకోవడం మూలంగా, మీ ఎనర్జీ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుందని చెప్పబడుతుంది.

తయారుచేయు విధానం : బ్లెండర్లో అన్నింటిని వేసి మిశ్రమం చేసి తీసుకోవాలి.

7. పియర్, లెమన్ గ్రాస్ మరియు అల్లం స్మూతీ :

7. పియర్, లెమన్ గ్రాస్ మరియు అల్లం స్మూతీ :

పియర్స్ అనేవి డైటరీ ఫైబర్ మరియు విటమిన్ సి యొక్క ఉత్తమ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా పియర్ లాక్సేటివ్ గుణాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే దీనిలో అధిక స్థాయిలో డైల్యూటెడ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి. మరియు ఇది శరీరం నుండి అన్ని రకాల విషాలను బయటకు పంపడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తుంది. మరోవైపు, అల్లం, రక్తంలోని అధిక చక్కెర స్థాయిలను నిర్వహించడానికి ప్రభావవంతంగా ఉంటుంది. మరియు ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.

తయారుచేయు విధానం : పియర్ ఫ్రూట్ సగం, కొంత లెమన్ గ్రాస్, 1 అంగుళం అల్లం ముక్క తీసుకుని బ్లెండ్ చేసి తీసుకోవాలి.

8. మామిడి, నారింజ మరియు తేనె స్మూతీ :

8. మామిడి, నారింజ మరియు తేనె స్మూతీ :

నారింజలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు కార్బోహైడ్రేట్లు అధిక మొత్తాలలో ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్, సోడియం, సంతృప్త కొవ్వులు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయి. మామిడి పండ్ల నిండా విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండు పదార్ధాలు మీ శరీరానికి సమపాళ్ళలో శక్తిని అందివ్వగలుగుతాయి.

తయారుచేయు విధానం : బ్లెండర్లో అన్ని పదార్థాలను తీసుకుని బ్లెండ్ చేయాలి. రుచికోసం కొంచెం తేనెను కలిపి తీసుకోవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

10 Best Super Energy Smoothies

Smoothies are really simple to make that will keep your body energized when you feel sluggish and lethargic. The super energy smoothies include green energy smoothie, banana and almond milk, orange, banana and strawberry, kiwi and cranberry, chocolate smoothie, kale, berry and acai berry, mango and orange smoothie.
Story first published:Monday, May 6, 2019, 10:53 [IST]
Desktop Bottom Promotion