For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆలివ్ నూనె vs కొబ్బరి నూనె : గుండెకు ఏది మంచిది?

తక్కువ సంతృప్త కొవ్వు మరియు అధిక మొత్తంలో మోనో అన్ ‌శాచురేటెడ్, పాలీ అన్ ‌శాచురేటెడ్ కొవ్వు కలిగిన నూనెలకు మారాలని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది. వీటిని ఆరోగ్యకరమైన లేదా 'మంచి' కొవ్వులు అని కూడా పిలుస్తార

|

మీరు మీ గుండె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే లేదా గుండె జబ్బుతో బాధపడుతున్న వారి కోసం శ్రద్ధ వహిస్తున్నట్లయితే, హృదయానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ వంట నూనెలను ఎంచుకునేటప్పుడు కూడా, మీరు కొన్ని నూనెలలో ఉండే హానికరమైన భాగాల గురించి బాగా తెలుసుకోవాలి.

olive oil vs coconut oil which is better for heart health in Telugu

తక్కువ సంతృప్త కొవ్వు మరియు అధిక మొత్తంలో మోనో అన్ ‌శాచురేటెడ్, పాలీ అన్ ‌శాచురేటెడ్ కొవ్వు కలిగిన నూనెలకు మారాలని అమెరికన్ హెల్త్ అసోసియేషన్ (AHA) సిఫార్సు చేస్తోంది. వీటిని ఆరోగ్యకరమైన లేదా 'మంచి' కొవ్వులు అని కూడా పిలుస్తారు.

ఆరోగ్యకరమైన కొవ్వుల పాత్ర

ఆరోగ్యకరమైన కొవ్వుల పాత్ర

అమెరికన్ హెల్త్ అసోసియేషన్ - AHA ప్రకారం, ఆహారంలో నాలుగు ప్రధాన ఆహార కొవ్వులు ఉంటాయి. సంతృప్త మరియు ట్రాన్స్ ఫ్యాట్‌లను కలిగి ఉండే 'చెడు కొవ్వులు' గది ఉష్ణోగ్రత వద్ద (వెన్న వంటివి) మరింత దృఢంగా ఉంటాయి. అయితే మోనో అన్ ‌శాచురేటెడ్ మరియు బహుళ అసంతృప్త కొవ్వులు ఎక్కువ ద్రవంగా(కనోలా ఆయిల్ వంటివి) ఉంటాయి. అనారోగ్యకరమైన సంతృప్త కొవ్వులు కాకుండా మంచి కొవ్వులు శరీరంలో రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బులతో సంబంధం ఉన్న ట్రైగ్లిజరైడ్స్ ‌ను కూడా తగ్గిస్తుంది. ఇలాంటివి వాపుతో కూడా పోరాడుతాయి. 'మంచి' మోనోశాచురేటెడ్ కొవ్వు యొక్క కొన్ని మంచి మూలాలు: ఆలివ్, కనోలా, వేరుశెనగ మరియు నువ్వుల నూనెలు.

ఆలివ్ ఆయిల్ ఎంత ఆరోగ్యకరమైనది?

ఆలివ్ ఆయిల్ ఎంత ఆరోగ్యకరమైనది?

ఆలివ్ నూనె చాలా ఆరోగ్యకరమైన వంట నూనె. ఇది సంతృప్త కొవ్వులో చాలా తక్కువగా ఉంటుంది మరియు ఇతర ముఖ్యమైన పోషకాలను కలిగి ఉండగా మంచి కొవ్వులు (మోనోశాచురేటెడ్ కొవ్వులు) చాలా సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యకరమైన వంట నూనెలో సంతృప్త నూనె-14%, పాలీశాచురేటెడ్-11%, ఒమేగా-6 మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మరియు 73% మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఆలివ్ నూనెలో ఉండే ప్రధానమైన కొవ్వు ఆమ్లాన్ని ఒలీక్ యాసిడ్ అంటారు. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా ఆలివ్ ఆయిల్‌ లో పెద్ద మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుండెకు మంచిది

గుండెకు మంచిది

ఆలివ్ ఆయిల్ గుండె వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది రక్త ప్రసరణలో సహాయం చేయడం ద్వారా ధమనుల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్త నాళాలలో కొవ్వులు పేరుకుపోకుండా నిరోధిస్తుంది. స్ట్రోక్‌ల సంభావ్యతను మరియు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

క్యాన్సర్ ను నివారిస్తుంది

క్యాన్సర్ ను నివారిస్తుంది

ఆలివ్ నూనె శరీరంలో క్యాన్సర్ పెరుగుదలను తగ్గిస్తుంది. ముఖ్యంగా పెద్ద ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్‌ కారకాలను ఎదుర్కొంటుంది.

మధుమేహాన్ని తగ్గిస్తుంది

మధుమేహాన్ని తగ్గిస్తుంది

చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఆలివ్ నూనె సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో ఆలివ్ ఆయిల్ వాడకం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్:

యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్:

ఆలివ్ ఆయిల్ అనేక ఫంగల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఆలివ్ ఆయిల్ ఫినోలిక్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ కు బదులు కొబ్బరి నూనె వాడొచ్చా?

ఆలివ్ ఆయిల్ కు బదులు కొబ్బరి నూనె వాడొచ్చా?

ఆలివ్ నుండి ఆలివ్ నూనె ఎలా తీయబడుతుందో, కొబ్బరి నూనెను కొబ్బరి నుండి తీయడం జరుగుతుంది. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఉష్ణ మండల నూనె. యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉండటం నుండి కొవ్వును కాల్చే ప్రక్రియను కట్టడి చేయడం వరకు, కొబ్బరి నూనె ఒక వ్యక్తి ముందు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఆరోగ్య పరంగా, పోషణ పరంగా.. ఆలివ్ నూనె ముందు కొబ్బరి నూనె తూగలేదు. కొబ్బరి నూనె సంతృప్త కొవ్వుగా వర్గీకరించబడుతుంది. ఇందులో అనారోగ్య కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది 80 నుండి 90 శాతం సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. అంటే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో ఆలివ్ ఆయిల్ కంటే ఆరు రెట్లు ఎక్కువ శాచురేటెడ్ కొవ్వు ఉంటుంది.

పొత్తికడుపు కొవ్వును తగ్గిస్తుంది:

పొత్తికడుపు కొవ్వును తగ్గిస్తుంది:

కొబ్బరి నూనే పొత్తి కడుపు కొవ్వును తగ్గిస్తుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది కూడా. ఈ రెండూ కలిసి మీ శరీరంలోని కొవ్వును కాల్చడానికి ఒక శక్తివంతమైన సాధనంగా మారతాయి.

రోగనిరోధక శక్తి పెంచుతుంది:

రోగనిరోధక శక్తి పెంచుతుంది:

కొబ్బరి నూనె కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన రోగనిరోధక శక్తి బూస్టర్‌గా కూడా పిలువబడుతుంది.

రెండింటిలో ఏది గుండెకు మంచిది?

రెండింటిలో ఏది గుండెకు మంచిది?

గుండె-ఆరోగ్యకరమైన వంట నూనె విషయానికి వస్తే, కొబ్బరి నూనె మరియు వంటలో ఉపయోగించే అనేక ఇతర నూనెల కంటే ఆలివ్ నూనె చాలా మంచిది. ఆలివ్ నూనె.. LDL (చెడు) కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలా కాకుండా, అధిక శాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆలివ్ నూనె కూడా మెడిటరేనియన్ డైట్ వంటి సమతుల్య ఆహారంలో భాగమే. ఇది టైప్ 2 డయాబెటిస్ మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

English summary

olive oil vs coconut oil which is better for heart health in Telugu

read on to know olive oil vs coconut oil which is better for heart health in Telugu
Story first published:Monday, July 25, 2022, 14:02 [IST]
Desktop Bottom Promotion