For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు నిద్రలేచిన వెంటనే టీ త్రాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్ఛితంగా తెలుసుకోవాల్సిందే..

మీరు నిద్రలేచిన వెంటనే టీ త్రాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్ఛితంగా తెలుసుకోవాల్సిందే..

|

మీకు ఉదయం నిద్రలేవగానే టీ తాగడం అలవాటు ఉందా? ఉదయాన్నే టీ తాగడం చాలా మందికి ఒక ఆచారం లాంటిది, ఎందుకంటే చాలామంది తమ రోజును ఒక కప్పు వేడి వేడి టీతో ప్రారంభించడానికే ఇష్టపడతారు. అలాగే, ఉదయం తప్పనిసరిగా టీ తాగేవారు చాలా మంది ఉన్నారు. వారు ఉదయం ఒక కప్పు టీ తాగకుండా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించరు.

10 Things That Happen When You Drink Tea On An Empty Stomach,

ఒకరకంగా చెప్పాలంటే టీలో మరియు బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు లేదా కాటెచిన్స్ వంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి టీ త్రాగే వారిలో రోగనిరోధక శక్తిని మరియు జీవక్రియను పెంచడానికి సహాయపడుతాయి. అయితే వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మీరు ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు?

బెడ్ కాఫీ (ఎ) టీ

బెడ్ కాఫీ (ఎ) టీ

బెడ్ కాఫీ లేదా టీ ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే ఇందులో కెఫిన్ అంశం అధికంగా ఉంటుంది, ఇది కడుపులో ఆమ్లాలను ప్రేరేపిస్తుంది మరియు మీరు త్రాగినప్పుడు మీ జీర్ణవ్యవస్థను నాశనం చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి, మీరు ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు మీ ఆరోగ్యంపై ఇలా ప్రభావం చూపుతుంది. మరిత తెలుసుకోండి...

జీవప్రక్రియ

జీవప్రక్రియ

ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులోని ఆమ్ల మరియు ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది, మీ జీవక్రియ వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. ఇది శరీరంలోని సాధారణ జీవక్రియ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది మరియు ఎక్కువ శారీరక సమస్యలను కలిగిస్తుంది.

దంతాలపై ఎనామిల్ దెబ్బతీస్తుంది:

దంతాలపై ఎనామిల్ దెబ్బతీస్తుంది:

ఉదయాన్నే టీ త్రాగడం వల్ల మీ దంతాలపై ఎనామెల్ దెబ్బతింటుంది. నోటిలోని బ్యాక్టీరియా చక్కెరను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి, ఇది నోటిలోని ఆమ్ల పదార్థాల పెరుగుదలకు దారితీస్తుంది, ఇది చివరికి మీ దంతాలలో పంటి కోతకు కారణమవుతుంది.

 శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది:

శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది:

టీ డ్యూరియాటిక్ నేచర్ ను కలిగి ఉంటుంది. ఇది మీ శరీరం నుండి నీటిని తొలగిస్తుంది. మీరు ఉదయం నిద్రలేవడానికి ముందు సుమారు ఎనిమిది గంటలు నీరు లేకుండా నిద్రపోతున్నప్పుడు, మీ శరీరం ఇప్పటికే నిర్జలీకరణానికి గురవుతుంది. దానికి తోడు నిద్రలేవగానే టీ తాగినప్పుడు, ఇది అధిక నిర్జలీకరణాని(డీహైడ్రేషన్ )కి కారణమవుతుంది మరియు కండరాల తిమ్మిరికి దారితీస్తుంది.

కడుపు ఉబ్బరం

కడుపు ఉబ్బరం

చాలా మంది పాలతో తయారుచేసి టీ తాగినప్పుడు కడుపు ఉబ్బరంగా మారుతుందని భావిస్తారు. అందుకు కారణం పాలలో లాక్టోస్ అధికంగా ఉండటం వల్ల అది కడుపులోని ఖాళీ ప్రేగులను ప్రభావితం చేస్తుంది. ఇది మలబద్ధకం మరియు కడుపుబ్బరానికి దారితీస్తుంది.

వికారం కలిగిస్తుంది

వికారం కలిగిస్తుంది

రాత్రి మరియు ఉదయం మధ్య మీ కడుపు ఖాళీగా ఉంటుంది. ఈ పరిస్థితిలో ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపున టీ తాగడం వల్ల మీ కడుపులోని పిత్త రసం చర్యను ప్రభావితం చేస్తుంది. ఇది వికారం మరియు ఉద్రిక్తతకు కారణమవుతుంది.

మిల్క్ టీ అంత మంచిది కాదు

మిల్క్ టీ అంత మంచిది కాదు

చాలామంది మిల్క్ టీ తాగడానికి ఇష్టపడతారు; అయితే, మిల్క్ టీ తాగడం వల్ల మీరు ఉదయం అలసిపోతారని మీకు తెలియకపోవచ్చు. అవును ఉదయం మిల్క్ టీ తాగడం వల్ల మీకు ఆందోళన, బద్దకాన్ని కలిగిస్తుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

ఉదయం బ్లాక్ టీ తాగడం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుందని మీరు అనుకుంటే, మీరు పప్పులో కాలేసినట్లే! బ్లాక్ టీ మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, కాని ఉదయం పరకడుపున బ్లాక్ టీ తాగడం వల్ల ఉబ్బరం ఏర్పడుతుంది మరియు ఉదయం మీ ఆకలి తగ్గుతుంది.

కెఫిన్ ప్రభావం

కెఫిన్ ప్రభావం

బ్లాక్ టీ, కాఫీలో ఉండే కెఫిన్ మీ శక్తిని పెంచడంలో సహాయపడుతుందని భావిస్తారు. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, మైకము మరియు అసహ్యకరమైన అనుభూతులు ఉంటాయి.

ఆందోళన

ఆందోళన

ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఈ ప్రభావాలు ఆందోళన మరియు నిద్రకు సంబంధించిన ఇతర సమస్యలకు దారితీస్తాయి. మీరు ఉదయం టీ తాగాలని ఆలోచిస్తుంటే మీరు అల్పాహారం తీసుకున్న తర్వాత త్రాగండి.

ఇనుము శోషణకు అంతరాయం కలిగిస్తుంది

ఇనుము శోషణకు అంతరాయం కలిగిస్తుంది

గ్రీన్ టీ సహజంగా ఇనుమును పీల్చుకునే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు కేవలం పర కడుపుతో టీ తాగకూడదు, ఎందుకంటే ఇది ఇతర ఆహార వనరుల నుండి శరీరంలో ఇనుము శోషణ రేటును తగ్గిస్తుంది.

English summary

10 Things That Happen When You Drink Tea On An Empty Stomach

Are you in the habit of drinking bed tea in the morning? Drinking tea in the morning is like a ritual for many people, as many love to start the day with a cup of hot piping tea. Also, there are many compulsive tea drinkers who can't do without drinking a cup of tea in the morning.
Desktop Bottom Promotion