For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఆరోగ్యంగా, స్మార్ట్ గా..యంగ్ గా జీవించాలంటే ఈ 14 అలవాట్లను అలవర్చుకోండి చాలు..

వరల్డ్ హెల్తీయస్ట్ పీపుల్: వీరు దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు ఈ 14 అలవాట్లే...

|

జీవితంలో ఆరోగ్యంగా జీవించాలంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలి. ఆరోగ్యంగా అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారు. ఆరోగ్యకరమైన జీవితం అంటే 50ఏళ్ళు బ్రతికేవాళ్ళు 80ఏళ్లు యాక్టివ్ గా బ్రతకవచ్చు.

14 Habits Of Worlds Healthiest People

అంతే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులైన హార్ట్ డిసీజెస్, టైప్ 2 డయాబెటిస్, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి ప్రమాదాలకు దాదాపు దూరంగా ఉండవచ్చు. అలా దూరంగా ఉండాలంటే అందుకు మంచి అలవాట్లును కలిగి ఉండాలి. ఇటువంటి పెద్ద పెద్ద అనారోగ్యాల జోలికి వెళ్ళకుండా జీవిత కాలం ఆరోగ్యంగా జీవించాలంటే కొంచె కష్టపడాల్సిందే. ఎలాగంటే ఈ ప్రపంచంలో కొంత మంది చాలా ఆరోగ్యంగా, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నారంటే వారి ఆహారపు అలవాట్లు, దినచర్యలోని కార్యక్రమాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. కేవలం తెలుసుకోవడం మాత్రమేకాదు, వీటిలో కొంతలో కొంత అలవర్చుకున్నట్లైతే మీరు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు. మరి అవేంటో చూసేద్దామా...

1. వాళ్ళు స్మోకింగ్ చేయరు:

1. వాళ్ళు స్మోకింగ్ చేయరు:

స్మోకింగ్ వల్ల సగం ఆయుష్షు తగ్గిపోతుంది. కాబట్టి, స్మోకింగ్ చేయనివారు దీర్ఘకాలం పాటు బ్రతికే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి. ఊపిరిత్తుల క్యాన్సర్స్ తో మరణించే వారి సంఖ్య కూడా ప్రతి సంత్సరం పెరుగుతోంది. అమెరిక్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం సెకండ హ్యాండ్ స్కోకింగ్ వల్ల కూడా 25 నుండి 30% మంది గుండె సంబంధిత వ్యాధుల భారీన పడుతున్నారు.

2. వారు ఆకుకూరలు-కూరగాయాలు ఎక్కువగా తీసుకుంటారు

2. వారు ఆకుకూరలు-కూరగాయాలు ఎక్కువగా తీసుకుంటారు

త్రుణధాన్యాలు, లెగ్యూమ్స్, విత్తనాలు, నట్స్ మరియు వెజిటేబుల్స్ రోజువారి ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉంటారు. జర్నల్ ఆఫ్ అమెరిక్ హార్ట్ అసోసియేషన్ నివేధిక ప్రకారం ఆకుకూరలు, కూరగాయాలు రెగ్యులర్ గా తినడం వల్ల కార్డియో వ్యాస్కులర్ రిస్క్ ను 16% వరకు తగ్గిస్తాయని దాంతో చిన్న వయస్సులో మరణాల రేటు 25%కు తగ్గుతుందని ప్రచురించింది.

3.వారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారు

3.వారు రెగ్యులర్ గా వ్యాయామం చేస్తారు

గుండె ఆరోగ్యంగా కొట్టుకోవాలన్నా, శరీరంలోని ఇతర అవయావాలు సక్రమంగా పనిచేయాల్ని శారీరక శ్రమ అవసరం. అందుకు వ్యాయామం చాలా సహాయపడుతుంది. అందుకు మేము మీకు జిమ్ కు వెళ్ళమని చెప్పము. కానీ నడకు, ఆటలు ఆడటం, బైక్ రైడ్, సైక్లింగ్, స్విమ్మింగ్, జంపింగ్, స్కిప్పింగ్ వంటి అతి చిన్న వ్యాయామాలు చేస్తే చాలు. ఇవన్నీ మీ శరీరంను యాక్టివ్ గా ఉంచుతాయి.

4.వారు చేపలు తింటారు

4.వారు చేపలు తింటారు

అకాడమీ ఆఫ్ న్యూట్రీషియన్ అండ్ డయాబెటిస్ ప్రకారం చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్లకంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలానికి అవసరమయ్యే ప్రయోజనాలను ఎక్కువగా అందిస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది. క్లీనికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెప్టాలజీ ప్రకారం చేపలు తినడం ద్వారా కోలన్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

5. వారు సమాజికంగా ఉంటారు

5. వారు సమాజికంగా ఉంటారు

వీరు కుటుంబం మరియు స్నేహితులతో ఎప్పుడు కలిసి, కలుస్తూనే ఉంటారు. ఇది ఒక్కటి చాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందడానికి. డ్యూక్-ఎన్ యు ఎస్ మెడికల్ స్కూల్ సింగపూర్ ప్రకారం , మనిషిలో సంతోషాలను నింపుతుంది తద్వారా మరణాల రేటు తగ్గుతుంది.

6. వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు.

6. వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు.

సంతోషంగా ఉండే వారు ఒత్తిడికి దూరంగా ఉంటారు. అందుకు వీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటారు. చాలా కాలంపాటు ఒత్తిడితో జీవించే వారిలో దీర్ఘకాలిక వ్యాధులైన హార్ట్ డిసీజ్, క్యాన్సర్, డయాబెటిస్, మెంటల్ ఇల్ నెస్ మరియు జీవితం కాలం క్రమంగా తగ్గుతుంది.

7. వారు ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తారు

7. వారు ఆరోగ్యకరమైన బరువును నిర్వహిస్తారు

నేషనల్ ఇన్సుట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం , ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం అత్యంత ప్రధానమైన ఆరోగ్యపు అలవాటు. అది మీ వయస్సును మరికొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి పెంచుతుంది. ఊబకాయగ్రస్తులు త్వరగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ మరియు కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు గురి అయ్యే ప్రమాదం ఉంది.

8.వారు ఓ పరిమితిలో మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటారు

8.వారు ఓ పరిమితిలో మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటారు

పరిమితంగా ఆల్కహాల్ తీసుకునే వారు ఆరోగ్యంగా ఉంటారు. పరిశోధనల ప్రకారం అధికంగా ఆల్కహాల్ తీసుకునే వారిలో హార్ట్ ఫెయిల్యూర్ , స్ట్రోక్, చిన్న వయస్సులోనే మరణాల రేటు పెరుగుతుంది.

 9. వీరు బయట ఎక్కువ సమయాన్ని గడుపుతారు

9. వీరు బయట ఎక్కువ సమయాన్ని గడుపుతారు

ఆరోగ్యవంతులైన వారు చాలా వరకు బయట ప్రకృతి మధ్యలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతారు. వాస్తవానికి, ప్రకృతి (ప్రకృతి చికిత్స) మధ్య సమయం గడపడం ఒక వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది మరియు హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది మరియు మీ మనస్సును చురుకుగా ఉంచుతుంది.

10. వారు ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతారు

10. వారు ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతారు

ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు కోసం కొంత నాణ్యమైన ఏకాంత సమయాన్ని గడపడం చాలా అవసరం. అందుకు పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, సోలో ట్రిప్‌కు వెళ్లడం వంటి కార్యకలాపాలు వాస్తవానికి మానసిక బలాన్ని పెంచుతాయి, ఉత్పాదకత మరియు సృజనాత్మకతను పెంచుతాయి. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ఇది ఉత్తమమైన మరియు సరళమైన మార్గాలలో ఒకటి.

11.రోజూ సమయానికి నిద్రపోతారు:

11.రోజూ సమయానికి నిద్రపోతారు:

ఒక అధ్యయనం ప్రకారం, రాత్రి ఎనిమిది గంటలు నిద్రపోవడం దీర్ఘాయువుని పెంచుతుంది మరియు అకాల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఏడు నుండి ఎనిమిది గంటల కన్నా తక్కువ నిద్రపోయే వ్యక్తులు అన్ని కారణాల వల్ల మరణించే ప్రమాదం ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

12. సోషియ మీడియాలో చాలా తక్కువ సమయాన్ని గడుపుతారు

12. సోషియ మీడియాలో చాలా తక్కువ సమయాన్ని గడుపుతారు

వారు సోషల్ మీడియాలో సమయాన్ని పరిమితం చేస్తారు తరచుగా సోషల్ మీడియాలో ఉండటం వల్ల ఒక వ్యక్తి దీర్ఘకాలంగా అసంతృప్తిగా మరియు ఒంటరిగా ఉంటాడు. ఫోటోలు, వీడియోలను చూడటం మరియు స్నేహితుల నుండి అప్ డేట్స్ ను చదవడం వలన మీకు తెలియకుండానే ఎక్కువ సమయం గడపడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో అనర్థాలకు కారణం అవ్వడమే కాకుండా మీ చెత్త స్వభావంతో వారి ఉత్తమ వ్యక్తులతో పోల్చాలనుకుంటున్నారు మరియు ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మీరు సోషల్ మీడియాలో తక్కువ సమయాన్ని వెచ్చిస్తే మీరు సంతోషంగా ఉంటారు.

13.వారు ఇతరులకు సహాయపడగలుగుతారు

13.వారు ఇతరులకు సహాయపడగలుగుతారు

ఆరోగ్యవంతులు రోజూ సేవలను అందించడానికి మరియు సహాయం చేయడానికి ఇతరుల కోసం కొంత సమయం తీసుకుంటారు. BMC పబ్లిక్ హెల్త్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం,ఆరోగ్యవంతులైన వ్యక్తులు స్వచ్ఛందంగా మరియు ఇతరులకు ఎక్కువ కాలం జీవించడానికి సహాయపడుతారు.

14. వారు ఆశావాదులు

14. వారు ఆశావాదులు

వీరు ఎల్లప్పుడూ ఆశాజనకంగా ఉండటం ఆరోగ్యకరమైన వ్యక్తుల యొక్క మరొక సాధారణ లక్షణం. ఆశావాదం ఒక వ్యక్తి వ్యాధిని ఎదుర్కోవటానికి, మానసిక అనారోగ్యానికి దూరంగా ఉండటానికి మరియు శస్త్రచికిత్స నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్య పనితీరుతో ఆశావాదం ముడిపడి ఉంది.

English summary

14 Habits Of World's Healthiest People

Living healthy should be a part of your lifestyle. Not only physical health, mental health is also an important aspect of good health. And good health is important to live a long and active life. Not leading a healthy lifestyle elevates the risk of heart disease, type 2 diabetes, stroke and cancer.
Story first published:Tuesday, October 29, 2019, 13:24 [IST]
Desktop Bottom Promotion