For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే ఆహారాలు!

By B N Sharma
|

Foods Which Can Lead To Infertility In Women
నేటి రోజుల్లో మహిళలకు పిల్లలు పుట్టకపోవడమనేది అధికమవుతోంది. దీనినే వంధ్యత్వం లేదా గొడ్రాలితనం అని కూడా అంటారు. ఈ వంధ్యత్వానికి కారణం హార్మోన్ల లోపం కావచ్చు. లేదా జననాంగాలు సరిగా పనిచేయకపోవటం వలన కావచ్చు. అయితే దీనిని అరికట్టాలంటే మహిళలు కొన్ని ఆహార పదార్ధాలను తినటం మానేయాలి. అటువంటి ఆహారాలేమిటో పరిశీలిద్దాం!

1. రీసెర్చర్ల మేరకు సోయా అధికంగా వున్న ఆహారం మహిళలలో వంధ్యత్వానికి దారితీస్తుంది. సోయా అధికంగా తీసుకుంటే కొన్ని కేసుల్లో గర్భంలో రక్తస్రావం అధింగా అయినట్లు తేలింది. కనుక మహిళలు తమకు పిల్లలు పుట్టాలంటే, సోయా అధికంగా వుండే సోయా బీన్స్, సోయా మిల్క్, సోయా గింజలు, సోయా పిండి, సోయా నూనె మొదలైనవి తినరాదు.

2. షుగర్ స్ధాయి అధికంగా వుండే ఆహార పదార్ధాలు కూడా వంధ్యత్వానికి దోవతీస్తాయి. ఉదాహరణకు తెల్లటి బియ్యం, ఫ్రెంచి ఫ్రైలు, ఉడికించిన బంగాళ దుంపలు, రైస్ కేకులు, గుమ్మడి, కార్న్ ఫ్లేక్స్ మొదలైనవి మహిళలలో పిల్లలు పుట్టకుండా వుండేటందుకు అధిక అవకాశమిస్తాయి.

3. కేఫైన్ ఉత్పత్తులు, ప్రత్యేకించి కాఫీ మహిళలలో వంధ్యత్వాన్ని కలిగిస్తుంది. రోజుకు 300 గ్రాములకంటే అధికంగా కాఫీ తాగితే వంధ్యత్వానికి అవకాశాలెక్కువ. కనుక గర్భం దాల్చాలనుకునే మహిళ కాఫీ తాగరాదు.

4. పచ్చి లేదా వండని మాంసం, గుడ్లు కూడా వదిలేయండి. ఈ తిండి పదార్ధాలు సల్మోనెల్లతో కలుషితమై వంధ్యత్వాన్ని కలిగిస్తాయి.

5. వెన్నతీయని పాలతో చేసిన జున్ను తినరాదు. దీనిలో లిస్టేరియా అనే బాక్టీరియా గర్భ సంచిని నష్టపరిచే అవకాశం వుంటుంది.

6. శాచ్చ్యురేటెడ్ ఫ్యాట్ వున్న ఆహార పదార్ధాలు మహిళల్లో వంధ్యత్వాన్ని కలిగిస్తాయి. డార్క్ చాక్లెట్, ఎండు కొబ్బరి, వెన్న, జున్ను, హైడ్రోజనేటెడ్ నూనెలైన పామ్ లేదా కొబ్బరి నూనె మొదలైనవి కూడా శాచ్యురేటెడ్ ఫ్యాట్ వున్న ఆహారాలే.

7. అధికంగా కొవ్వు వున్న ఆహార పదార్ధాలు, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్జ్ ఫుడ్, ఫ్రోజెన్ లేదా బేక్డ్ ఫుడ్ లు గర్భం దాల్చాలనుకునే మహిళలకు తినదగినవి కావు.

8. నికోటిన్ వంధ్యత్వానికి దోవతీస్తుంది కనుక స్మాకింగ్ పూర్తిగా వదిలేయాలి.

9. రిఫైన్డ్ షుగర్ లేదా సాల్ట్ వున్న ఆహారాలు కూడా మహిళలలో వంధ్యత్వాన్ని కలిగిస్తాయి.

10. ఆల్కహాలు కూడా పిల్లలు పుట్టే అవకాశాలను తగ్గిస్తుంది కనుక మహిళలు దానిని తీసుకోరాదు.

English summary

Foods Which Can Lead To Infertility In Women | మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే ఆహారాలు!

Infertility among women is a rising problem. Since many years few women face problems in conceiving and therefore they fail to ovulate. The reasons behind infertility can be hormonal or poor functioning of the reproductive organs. However, to prevent infertility among women, avoid few foods which can fail the woman to ovulate.
Story first published:Tuesday, October 4, 2011, 8:09 [IST]
Desktop Bottom Promotion