For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐశ్వర్యా రాయ్ అంత అందంగా కనపడండి!

By B N Sharma
|

Aishwarya Rai
కొంచెం మేకప్......రెగ్యులర్ గా చర్మ సంరక్షణలు చాలవు మీరు ఎప్పటికి చిన్నవారుగా కనపడటానికి. ఎప్పటికి చిన్నగా కనపడటానికి పరిష్కారం ఏమీ లేనప్పటికి ఆరోగ్యవంతంగా, వయసుకు తగినట్లుండటానికి మార్గాలున్నాయి. మీరు రోజూ తీసుకునే పోషకాహారం మీకు ఈ మేజిక్ చేసి పెడుతుంది. వయసు బయటకు చూపని ఆహారం....పోషక విలువల జాబితా ఒకసారి పరిశీలించండి.

నిమ్మ - నిమ్మ రసం శరీరంలోని భాగాలను శుభ్రపరుస్తుంది. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్లు కావాలంటే దీనికి మించింది లేదు. కొవ్వు విడకొడుతుంది. కేలరీలు ఖర్చు చేస్తుంది. మలినాల్ని శరీరంనుండి తొలగించి చక్కటి చర్మ కాంతినిస్తుంది. వేడి నీరులో కొద్దిపాటి నిమ్మరసం వేసుకుని రోజుకు రెండు సార్లు తాగండి. ఇక చిన్న వారుగా కనపడుతూంటారు.

పచ్చని ఆకు కూరలు - కేరట్స్, దోస లాంటి పచ్చటి కూరలు గుండె, శ్వాస కోశ, జీర్ణ కోశాలకు అద్భుతంగా పని చేస్తాయి. విటమిన్లు అధికంగా కల ఈ కూరలు శరీరంలో తగిన తేమనుంచి చర్మానికి కాంతినిస్తాయి. కళ్ళల్లో కాంతి, ఒత్తిడినేలి జీవనం కావాలంటే కేరట్లు తినండి. బెర్రీలు, పుచ్చ, ఆపిల్స్, అవకాడోలు మొదలైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని పోషించటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.
వాల్ నట్స్, ఆల్మండ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి ఎండు ఫలాలు శరీరంలో తేమనిస్తాయి. చర్మ కణాలకు నూనెను అందిస్తాయి. విత్తనాలలో వుండే విటమిన్ ఇ కాంతినిస్తుంది. శరీరం నాజూకుగా వుంటుంది.

గ్రీన్ టీ - తాగితో మంచి ఎనర్జీ వస్తుంది. చెడు కొవ్వు కరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా వుంటుంది. ఆయుష్షు పెరగటానికి, ఆరోగ్యకర జీవనానికి చాలా మంచిది.

నీరు - శరీరానికి లోపల బయట కూడా నీరు లబ్ది చేకూరుస్తుంది. రోజుకు 6 నుండి 8 గ్లాసుల నీరు తాగితే శరీరం లోపలి భాగాలు శుబ్రపడి ఎప్పటికి ఆరోగ్యంగా వుంటారు.

వేయించిన, వండిన, ఆహార పదార్ధాలు ఎంత అధికంగా తింటే అంత వయసు మళ్ళిన వారిలా కనపడతారు. సైంటిఫిక్ గా రుజువైన ఈ అంశాలు పాటిస్తే ఎప్పటికి ఆరోగ్యంగాను, చిన్న వయసు వారిగానూ కనపడతారనటంలో సందేహం లేదు.

English summary

Super 6 Anti Aging Food To look Younger & Live Longer | దీర్ఘాయుష్మాన్ భవ!

Green Tea – Another antioxidant gives energy, refreshes mind and burns bad fat. It is great anti aging food for longevity and healthy living. Water – Water is a part of the anti aging diet for good internal and external well being.
Story first published:Wednesday, September 21, 2011, 10:09 [IST]
Desktop Bottom Promotion