For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులలో వచ్చే మెనోపాజ్ (రజో నివృత్తి)!

By B N Sharma
|
4 Symptoms Of Male Menopause
మీ భర్తలో వచ్చే కొన్ని మార్పులను పరిశీలించారా? సోమరిగా వుండటం, వింతగా ప్రవర్తించడం వంటివి చేస్తున్నాడా? బహుశ అతనికి మెనోపాజ్ వస్తూవుండవచ్చు. గతంలో మెనోపాజ్ దశ మహిళలకు మాత్రమే 40 ఏళ్ళ వయసు పైన శరీరంలోని హార్మోన్ల మార్పు కారణంగా వస్తుందనుకునేవారు. మెనోపాజ్ దశ అంటే మహిళలకు ఇక సంతానోత్పత్తి వుండదు. పురుషులకు కూడా ఈ హార్మోన్ల మార్పు వస్తుంది. అయితే వీరు మహిళలవలే పూర్తిగా నిస్సత్తువ కారు. హార్మోన్ల స్ధాయి తగ్గుతుంది. 40 సంవత్సరాల పైబడిన పురుషులతై, మెననోపాజ్ వచ్చినట్లే.

మెనోపాజ్ లక్షణాలు ఎలా వుంటాయి?
శారీరక మార్పులు - పురుషుడు బరువు పెరుగుతాడు. కండలు బలహీనపడి పటుత్వం తగ్గుతాయి. వెంట్రుకలు పలచబడతాయి, అంగస్తంభన సమస్య, మనోవేదన వంటివి ఈ మెనోపాజ్ లో వుంటాయి. కీల్ళ నొప్పులు ప్రత్యేకించి మోకాలు, మోచేతులు సాధారణంగా వచ్చేస్తాయి. ఊబకాయం కూడా మెనోపాజ్ లక్షణమే. కనుక వీరు తప్పక ప్రతిరోజూ జాగ్ లేదా నడక వంటి వ్యాయామాలు చేస్తూ శారీరక పటుత్వం పొందాలి.

మనో భావనల మార్పు - హార్మోన్ల మార్పులో మూడ్ స్వింగ్స్ సాధారణం. స్త్రీ అయిన పురుషుడైనా ఇవి వుంటాయి. ఒక నిమిషంలో నవ్వటం మరో నిమిషంలో కోపంగా వుంటాయి. కోపం మెనోపాజ్ ప్రధాన లక్షణం. కొంతమంది పురుషులు ఆందోళన, మరికొందరు సోమరితనం పొందుతారు. వ్యక్తికి వ్యక్తికి లక్షణాలు మారతాయి.

రాత్రి చెమటలు - అర్ధరాత్రి లేచి కూర్చుంటారు. చెమట పట్టేస్తుంది. శరీరం చల్లబడుతుంది. లేదా నిద్ర లేని రాత్రులు గడుపుతారు. ఇవన్ని మెనోపాజ్ లక్షణాలే.

లైంగిక నిస్సత్తువ - టెస్టోస్టిరోన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంగస్తంభన తగ్గుతుంది. అయితే, అందరు పురుషులకు ఇది వుండదు. వీరు లైంగికంగా పూర్తి నిస్సత్తువ పొందరు గాని, ఉత్సాహం తగ్గుతుంది.

పురుషుల మెనోపాజ్ కు ఇవి కొన్ని లక్షణాలు. అయితే, ఇదేమీ తీవ్రమైనది లేదా ప్రమాదకరమైన దశ కాదు. ఆరోగ్యకర ఆహారం తింటూ కొద్దిపాటి వర్కవుట్లు చేస్తూ శరీరాన్ని పటిష్టంగా వుంచుకుంటే పురుషుడు ఎప్పటికి బలవంతుడే.

English summary

4 Symptoms Of Male Menopause | అంగస్తంభన అదృశ్యమవుతోందా?

These are few symptoms of male menopause. It is nothing serious or dangerous. Follow a healthy diet. Include healthy foods and workout for a fit and active body! Lack of libido: Due to the decrease of testosterone production, few men lack the ability to hold the erection. However, it is not common for all men. As mentioned earlier, menopause doesn't make men infertile but can decrease the drive.
Story first published:Tuesday, May 1, 2012, 9:43 [IST]
Desktop Bottom Promotion