For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విస్కీ సేవించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

|

గబ్బర్ సింగ్ లో మన పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్లు మందు ఎప్పుడో ఒకసారి తాగితే సంతోషం... అప్పుడప్పుడూ తాగితే వ్యసనం.... రోజూ తాగితే రోగం... అన్న విషయాన్ని గుర్తుంచుకొంటే... ఆల్కహాల్ అన్ని సందర్భాల్లోనూ అనారోగ్యం కాదు. ఆల్కహాల్ ను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కొన్ని రకాలైరటువంటి ఆల్కహాల్ అంటే వైన్ మరియు బ్రాండీ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని వింటుంటాం.. బహుషా అందుకేనేమో గర్భవతిగా ఉన్నప్పుడు గర్భిణీకి గ్రేప్ వైన్, ఆపిల్ వైన్ అని వారికి ఇస్తుంటారు. ఆల్కహాల్ కు సంబంధించిన విస్కీలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఆశ్చర్య కలగక మానదు. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం...

మంచి నిద్ర: కొన్ని రోజులుగా అంటే పది పదిహేను రోజులుగా ఎక్కువగా కష్టపడి, లేదా జర్నీ చేయడం వల్ల శరీరం ఎక్కువగా అలసినప్పుడు విస్కీలో ఐస్ చేర్చి ఒకటి లేదా రెండు పెగ్గులు తాగడం వల్ల నిద్ర బాగా పట్టి శరీరానికి విశ్రాంతినిస్తుంది. తాగడం కూడా హర్రీగా తీసుకోకుండా తక్కువ మోతాదులో కొద్దిగా కొద్దిగా తీసుకోవడం వల్ల బాగా పనిచేస్తుంది. తాగిన కొద్ది సేపటికే నిద్రలోకి జారుకొని, గాఢ నిద్రను పొందుతారు.

క్యాన్సర్: చాలా మంది ఆల్కహాల్ క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతుంటారు? అయితే అది నిజం కాదనే చెప్పాలి. ఎందుకంటే విస్కీలో ఉన్న ఎలాజిక్ యాసిడ్స్ క్యాన్సర్ ఉత్ప్రేరకాలను తగ్గిస్తుంది. విస్కీని తరచూ తీసుకోకుండా ఏదో ఒక సందర్భంలో తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలతో పోరాడే యాంటిఆక్సిడెంట్స్ ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఏప్పుడో ఒక సారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదు.

Whiskey

మధుమేహానికి: విస్కీ లో మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం వల్ల, ఇది శరీరంలోని రక్తనాలల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. విస్కీలో మంచి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారీన పడకుండా చేస్తుంది. మధుమేహగ్రస్తులు కూడా అతి తక్కువ మోతాదులో వారానికి ఒక సారి విస్కీని తీసుకోవడం వల్ల రక్త నాళాలు ఫ్రీ అవుతాయి.

ఒత్తిడిని దూరం చేసే విస్కీ: ఒత్తిడిని దూరం చేసే గుణం కూడా విస్కీలో ఉంది. ఎక్కువ రోజులగా ఏదైనా కారణం చేత ఎక్కువగా ఒత్తిడికి గురౌతున్నట్లైతే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అది ఫిజికల్ గా మెంటల్ గా అనారోగ్యం చేస్తుంది. కాబట్టి స్ట్రెస్ తో ఉన్నప్పుడు విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల మానసిక ప్రభావం నుండి బయటపడేలా చేస్తుంది. శరీరం కొంత విశ్రాంతి పొంది మునుపటి కంటే కొంచెం సౌకర్యంగా ఫీలవుతారు.

జలుబు - దగ్గు: బాగా కోల్డ్ చేసి, దాంతో పాటు దగ్గు ఉన్నప్పుడు హాట్ విస్కీని కొద్దిగా తీసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న విస్కీ, ప్రత్యేకంగా స్కాచ్, మరియు దీనికి కొద్దిగా హాట్ వాటర్, ఒక చెంచా తేనె, మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకోవడం వల్ల, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

ఇతర వ్యాధులు: విస్కీని నెలకోసారి లేదా రెండు సార్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచి, చిన్న చిన్న జబ్బులను రానివ్వకుండా చేస్తుంది.

English summary

Health Benefits Of Drinking Whiskey | తాగినోడు ఎవడూ చెడ్డోడు కాదు..

Alcohol is not always bad for health. There are many benefits of alcohol if taken in the right quantity. You must have heard the many benefits of alcohol like wine and brandy. But did you know that even whiskey could be healthy when consumed in the limited amounts. Here are a few benefits of whiskey.
Desktop Bottom Promotion