For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రి సమయంలో నిద్రా భంగం కలిగించే నొప్పులు?

By B N Sharma
|
Night Time Pains Disturbing Sleep?
ప్రతి ఒక్కరికి రాత్రి నిద్ర ఎంతో అవసరం. రాత్రి వేళ సరైన నిద్ర లేకుంటే, మరుసటి రోజు చాలా డల్ గా వుంటుంది. చేయాలనుకున్న పనులు సమర్ధవంతంగా చేయలేకపోతాము. అయితే, రాత్రి వేళ శారీక నొప్పులు మోకాలు లేదా మెడ వంటి శరీర భాగాలు నొప్పి పెట్టి నిద్ర సరిగా పట్టకపోతే ఎంతో అసౌకర్యంగా వుంటుంది. మనలో చాలామంది ఈ రకమైన సమస్య తలెత్తుతూంటుంది. మరి ఈ రకమైన నొప్పులు మనకు నిద్రా భంగం కలిగిస్తూంటే ఏం చేయాలనేదానికి కొన్ని చిట్కాలు చూడండి.

రాత్రి వేళ నొప్పులకు కారణాలేమిటి? వాటిని ఎలా అధిగమించాలి. ముందుగా నొప్పులకు మూల కారణాలు పరిశీలించండి.

1. అలసిన కండరాలు - మీ కండరాలలో అలసట మీకు నిద్ర కలిగిస్తుంది అదే సమయంలో మీకు మెళుకువకూడా తెప్పిస్తుంది. రోజుల తరబడి సరైన నిద్ర పోకపోతే కండరాల నొప్పులు వస్తాయి. నిద్ర సమయంలో కండరాలకు పునరుద్ధరణకు సమయం లేకుంటే, ఈ రకమైన అలసట కలిగి నొప్పులు వస్తాయి. దీనికి పరిష్కారంగా రాత్రివేళ పూర్తిగా 8 గంటల సమయం పడుకోవాలి. ఈ నిద్ర ప్రతిరోజూ 8 గంటలుగా వుండాలి.

2. కాఫీ, టీ పానీయాలు - శరీరాన్ని ఉత్తేజ పరచేటందుకు పగటిపూట మనం కాఫీ, టీ వంటివి తాగుతాము. అందులోను అవి రాత్రి వేళ తలనొప్పి లేదా ఇతర కారణాలుగా తాగినప్పటికి అది తాత్కాలిక ప్రభావం చూపినప్పటికి మీరు రాత్రి మెళుకువ వుండేలా చేస్తుంది. మరి మెళుకువ నొప్పి బాగా తెలిసేలా చేస్తుంది. కనుక రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కాఫీ లేదా టీ వంటి పానీయాలు తాగకండి.

3. ఆహారం - సరిగ్గా ఆహారాన్ని తింటున్నారా? ఆహారం సరిగ్గా తినటం అంటే ఆరోగ్యకర ఆహారం కూడా తినాలని అర్ధం. రాత్రి భోజనంలో మసాలాలు, లేక అధిక ఎనర్జీ ఇచ్చే షుగర్ ఆహారాలు తినకండి. బంగాళదుంప లేదా వేపుడు వంటివి రాత్రులందు నిద్రాభంగం చేస్తాయి. నొప్పులు తెలిసేలా చేస్తాయి. కనుక మీ ఇంద్రియాలను ప్రశాంతంగా వుంచే ఆహారాలు రాత్రులందు తినండి.

4. రాత్రులలో కాలి నొప్పి - రాత్రులలో కాలినొప్పి అనేక రకాల కారణాలకు వస్తుంది. పగలంతా సరైన పాదరక్షలు ధరించకపోవటం, మీ కాళ్ళ కండరాలకు శ్రమ ఇవ్వటం జరుగుతుంది. కాలి నొప్పి అంటే మరో కారణం వెరికోస్ వీన్స్ గా కూడా చెప్పాలి. శరీర బరువు అధికం అయితే, దానిని మోయలేక కాలినొప్పులు వస్తాయి. రక్తం మీ పిక్కల్లో నిలువ వుంటుంది. మీకు కావలసింది వ్యాయామం కాని విశ్రాంతి కాదని తెలియజేస్తాయి.

5. ఒత్తిడి - ఒత్తిడితో నిద్రిస్తే అది విశ్రాంతి అయిన నిద్ర కాదు. ఒత్తిడి కలిగించే హార్మోన్లు మీరు నిద్రకు ప్రయత్నిస్తున్నప్పటికి మీ శరీరమంతా వ్యాపించివుంటాయి. మండిన కళ్ళు, విశ్రాంతి లేని నిద్రతో మరుసటి ఉదయం మీరు లేస్తారు. హాయి భావనలను పొందలేరు. రాత్రి నొప్పులను నివారించటానికి గాఢ నిద్రను మించినది లేదని తెలుసుకోండి.

నిద్ర సమస్యలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి వున్నాయి. కనుక రాత్రి నొప్పులు దీనిలో భాగమైతే, ముందుగా మీ నొప్పులకు పరిష్కారం చూడండి.

English summary

Night Time Pains Disturbing Sleep? | నొప్పులకు పరిష్కారం ...గాఢ నిద్ర!

Stressful Sleep Is Not Restful Sleep: If your stress hormones are rolling all over your body then even if you manage to fall asleep, it will not be a restful sleep. Usually your eyes shut due to fatigue but sleep will be intermittent. You will wake tired with puffy eyes the next morning. There is no replacement for deep sleep to cure night time pains.
Story first published:Monday, April 9, 2012, 10:09 [IST]
Desktop Bottom Promotion