For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల పప్పుధాన్యాలు-ఆరోగ్యప్రయోజనాలు

|

ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఏమైనా చేయగలడు. ఆరోగ్యం గా లేక పోతే ఏది సాధ్యంకాదు. దీనికి బలవర్ధకమైన ఆహారాన్ని తీసు కోవాలి. అయితే రోజు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం, ప్రతి రోజు ఉదయం లేచినప్పటినుంచి పడుకో బోయే వరకు తీసుకునే ఆహారం ఒకే రకంగా ఉం టే మనిషిలో ఎదుగు బొదుగు లేకుండా ఉంటా రని వైద్య శాస్త్ర పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనం తీసుకునే ఆహార పదార్థాల వినియోగంలో ఎప్పటికప్పుడు మార్పులు తీసుకుంటే ఆరోగ్యం సలక్షణంగా ఉంటుంది.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. తీసుకునే ఆహారంలో ఎటువంటి పోషకవిలువలు లేకపోతే బలాన్నిచ్చే సంగతి దేవుడెరుగు పైగా ఆరోగ్యానికి హానిని కలుగజేస్తాయి. ఇటువంటి ఆహారం తీసుకోవడం వల్ల రేయింభ వళ్లు శరీరం ఒత్తిడికి గురవడం, శరీరంలో ముడతలు ఏర్పడటం, శరీరం గిడసబారి శరీర కాంతులు లేకుం డా ముఖంపై ఎప్పుడు అయోమయ పరిస్థితులు కనబడుతుం టాయి. రోజు తీసుకునే ఆహారానికి భిన్నంగా అప్పుడప్పుడు ఇతర రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు.

సాధారణంగా మన రెగ్యులర్ ఆహారంలో పప్పుల ప్రాధాన్యత చాలా ఉంది. ముఖ్యంగా. పప్పుధాన్యాలను చాలా సాధారణంగా, విరివిగా మన ఇండియన్ కుషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటరు. మన ఇండియాలో ఏ ఇంట్లో అయినా పప్పు స్టాక్ లేకుండా ఇల్లు కనబెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అంతే మేలైన పోషకాహరం పప్పుధాన్యాలు. పప్పుధాన్యాలు బాదం, వేరుశనగ, తదితర పప్పు ధాన్యా లు శరీ రానికి అధిక శక్తినిస్తాయి. దీనివల్ల అధిక మొత్తంలో పోషకాలు లభించడమే కాక మనిషిలో బద్ధకాన్ని తగ్గిస్తాయి. శరీరానికి శక్తినిస్తాయి. అంతే కాదు ఈ పప్పు ధాన్యాలలో వివిధ రకాల న్యూట్రీషన్ విలువలున్నాయి. పప్పుధాన్యాలలోని హెల్త్ బెనిఫిట్స్ అనేకం ఉన్నాయి అంతే కాదు అధిక పోట్రీనులు కూడా ఉన్నాయి.

మన ఇండియాలో చాలా మంది వెజిటేరియన్స్ తో పాటు, నాన్ వెజిటేరియన్స్ కూడా పప్పుధాన్యాలను వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం జరుగుతుంది. అందుకే మన భారతీయుల ఇల్లలో వివిధ రకాల పప్పుధాన్యలను స్టాక్ గా ఉంచుకొని రోజుకో డిఫరెంట్ ఐటమ్స్ ను వండుతుంటారు. ఈ పప్పు ధాన్యాల వల్ల జనరల్ హెల్త్ బెనిఫిట్స్ అటుంచితే, ఒక్కో పప్పుధాన్యంలో ప్రత్యేకమైన పోషక విలువలు కలిగి ఉన్నాయి కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఈ పప్పు ధాన్యాల మిశ్రమాన్ని తప్పకుండా చేర్చుకోవాలని సలహా...

కొన్ని పప్పుధాన్యాలు ఇతర పప్పులతో పోల్చితే మరింత ఆరోగ్యకరం. ఉదా: ఉద్దిపప్పు మరియు పెసరపప్పులలో ఇతర పప్పులలో కంటే అత్యధిక పోషక విలువలున్నాయి. ఇతర పప్పు ధాన్యాలు కందిపప్పు కూడా ఆరోగ్యానికి మందే అయినా ఇందులో కొన్ని సైడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. ఉదా: మసుర్ దాల్ (ఎర్రకందిపప్పు)యూరిక్ యాసిడ్ లెవల్స్ ను పెంచుతుంది. కాబట్టి మితంగా తీసుకోవాలి. మీకు ఉపయోగపడే మంచి ఆరోగ్య ప్రయోజనాలను అంధించే కొన్ని పప్పు ధాన్యాలు క్రింద ఇవ్వబడ్డాయి.

1. పెసరపప్పు(మూగ్ దాల్):

1. పెసరపప్పు(మూగ్ దాల్):

పెసరపప్పు డైటర్స్ ఫ్రెండ్లీ దాల్ అంటారు. ఎందుకంటే, ఈ పప్పుధాన్యంలో మినిమల్ క్యాలరీలు కలిగి ఉన్నాయి. మరియు ఐరన్ అండ్ పొటాషియం ఎక్కువ. ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి అత్యధిక ప్రయోజనాలను అంధిస్తాయి.

2. శెనగపప్పు(బెంగాల్ గ్రామ్):

2. శెనగపప్పు(బెంగాల్ గ్రామ్):

శెనగపప్పు లేదా బెంగాల్ గ్రామ్ అత్యధిక డైటరీ ప్రోటీన్స్ కలిగినటువంటి ఒక వెజిటేరియస్ పప్పు ఇది. ఇందులో అనేక మినిరల్స్ అంటే, కాపర్, మెగ్నీషియం మొదలగునవి పుష్కలంగా ఉండి. ఈ పప్పును తరచూ తింటుంటే డయాబెటిస్ ను దూరంగా ఉంచవచ్చు.

 3. మసూర్ దాల్(ఎర్రకందిపప్పు):

3. మసూర్ దాల్(ఎర్రకందిపప్పు):

మసూర్ దాల్ బైల్ రిఫ్లెక్స్ తో బాధపడే వారికి చాలా ఆరోగ్యకరం. మరియు శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది.

4. కాబూలీ దాల్ :

4. కాబూలీ దాల్ :

ఇవి అలసందల వంటి పప్పు. ఇవి పప్పుల్లో చాలా వెరైటీ గా ఉంటాయి. ఇందులో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ పెంచడంలో సహాయపడుతుంది.

5. ఉద్దిపప్పు:

5. ఉద్దిపప్పు:

మీ ఆహారంలో పుష్కలమైన ప్రోటీనులు పొందాలంటే, ఉద్దిపప్పును తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే. ఇది ప్రోటీన్స్ మరియు విటమిన్ బి పుష్కలంగా కలిగిన ఒక అద్భుతమైన పప్పు ధాన్యం.

6. తూర్ దాల్:

6. తూర్ దాల్:

కందిపప్పు. పప్పుల్లో ఇది బాగా ప్రసిద్ది చెందిన పప్పు. ఇండియాలో వీటిని ఎక్కువగా తింటారు. ఇది కాంప్లెక్స్ డైటరీని పుష్కలంగా అంధిస్తుంది . మరియు బౌల్ మూమెంట్ క్రమబద్దం చేస్తుంది.

7. పెసుళ్ళు:

7. పెసుళ్ళు:

ఇవి గ్రీన్ కలర్ లో ఉండటం వల్ల వీటిని గ్రీన్ మూగ్ దాల్ అంటారు. ఈ పప్పులో పుష్కలమైన క్యాల్షియం మరియు తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఈ వెరైటీ పప్పు ఎముకలకు చాలా ఆరోగ్యకరం.

8. లోబియా దాల్:

8. లోబియా దాల్:

తెల్లని, చిన్నగా ఉండే అలసందలు. ఇందులో ప్రోటీనులు మరియు జింక్ అధికం.

9. గ్రీన్ స్ప్రాట్స్:

9. గ్రీన్ స్ప్రాట్స్:

స్ప్రాట్స్ ఏ ధాన్యంతో అయినా తయారుచేయవచ్చు. అన్ని రకాల ముడిధాన్యాలను నీళ్ళలో నానబెట్టి, మొలకకట్టించడమే స్ప్రాట్స్ అంటుంటారు. వీటిలో ఎంజైమ్స్ మరియు డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

 10. సోయా దాల్:

10. సోయా దాల్:

సోయా బీన్ దాల్ దాల్ లిస్ట్ లో చేర్చుకోవల్సిన ఒక ఆరోగ్యకరమైన పప్పు. ఇందులో అధికంగా ప్రోటీనులు మరియు విటమిన్ డి ఉండి, ఎముకలకు సహాయపడుతుంది.

English summary

10 Types Of Dals And Their Health Benefits

Dals are very commonly used in the Indian cuisine. It is hard to find an Indian household that does not stock up different types dals. As dals have to prepared on a daily basis, we need to have a lot of dals on board to maintain the variety.
Story first published: Monday, November 11, 2013, 18:37 [IST]
Desktop Bottom Promotion