Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
సంపూర్ణ ఆరోగ్యానికి కేరాఫ్ ‘విటమిన్ ఇ’ఆహారాలు..!
సాధారణంగా శరీరంలో విటమిన్ల పాత్ర కీలకమైనది. శరీరానికి కావల్సిన విటమిన్లలో(ఎ,బి, సి,డి,ఇ, బి12,బి11....మొదలగునవి) ఏ ఒక్క విటమిన్ లోపించినా అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. విటమిన్లలో ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ గా విటమిన్ ‘ఇ' అని చెప్పవచ్చు. ఎందుకంటే మహిళల్లో గర్భాధారణ విషయంలో విటమిన్ ఇ ఎంతో అవసరం అవుతుంది. అలాగే పురుషుల్లో వంధ్యత్వం నివారించడానికి విటమిన్ ఇ అవసరం అవుతుంది. హానికరమైన ఫ్రీరాడికల్ అణువును తొలగించడానికి మంచి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఈ విటమిన్ ఇ లో అధికంగా ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో చర్మసౌందర్యాన్ని ఇదే ఇనుమడింపజేస్తుంది. మరి ఇన్ని ఉపయోగాలున్న ‘విటమిన్ ఇ' వల్ల కలిగే ప్రయోజనాలు, విటమిన్ ఇ లోపం వల్ల కలిగే నష్టాలు, విటమిన్ ఇ ఎందులో పుష్కలంగా లభిస్తుందో తెలుసుకొని ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకుందాం...
విటమిన్ ఇ ఏం చేస్తుంది:
ఇది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్: మనం ఆహారం తీన్న తర్వాత జీవక్రియల కోసం అది శక్తిగా మారుతుంది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు కొన్ని అణువులు ఏర్పడుతాయి వీటినే ఫ్రీరాడికల్స్ అంటారు. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయి. ఇవి అల్ట్రా వయొలెట్ కిరణాల్లో, సిగరెట్ పొగలో, వాయు కాలుష్యంలో కూడా ఉంటాయి. ఇటువంటి హానికరమైన ఫ్రీరాడికల్స్ అణువులను యాంటీ ఆక్సిడెంట్స్ హరిస్తాయి. కాబట్టి శరీరంలో వెలువడే హానికరమైన ఫ్రీరాడిక్లస్ ను నాశనం చేసే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు విటమిన్ ఇ లో ఉండటం వల్ల అవి జీవక్రియల్లో వెలువడి హాని చేసే పదార్థాలను తొలగిస్తాయని చెప్పవచ్చు.
శరీరంలో జీవక్రియ సక్రంమగా: మన శరీరంలో జరిగి అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సరిగా జరగడానికి ఇ విటమిన్ దోహదపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి: మనలో వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. అంతే కాదు ఈ విటమిన్ ఇ క్యాన్సర్ తో పోరాడే శక్తి కలిగి ఉంటుంది. డయాబెటిస్ ను అడ్డుకుంటుంది. గుండెకు అండగా ఉండి కార్డియో వాస్కులార్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది.
జన్యు పదార్థాల తయారీలో: జన్యు పదార్థాలు అనగా మన స్వభావాలు, పోలికలు ఒక తరం నుండి మరో తరానికి చేరడానికి విటమిన్ ఇ దోహదం చేస్తుంది.
అరోగ్య పరంగాను, అందానికి గాను ఇన్ని మంచి గుణాలనందించే ఈ విటమిన్ ఇ ఎక్కడు దొరుకుతుంది?మార్కెట్లో ..!అవును ఖచ్చితంగా ఇది కరెక్టే ఎందుకంటే మార్కెట్లో దొరికే(గ్రీన్ వెజిటేబుల్స్, బ్రొకోలి, ఆకుకూరలు, పండ్లు,నట్స్, పిస్తా) ఆహారాల్లోనే విటమిన్ ఇ అధికంగా లభ్యం అవుతుంది. వాటిని కనుక మన డైయట్ లో చేర్చుకొన్నట్లైతే ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం చేసుకోవచ్చు.
విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్ సి, మరియు ఫైబర్ మరియు అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. ఈ న్యూట్రీషియన్స్ అన్నీ కూడా మధుమేహగ్రస్తులకు చాలా బాగా ఉపయోగపడుతాయి.

ఆలివ్/ ఆలివ్ ఆయిల్: ఆలివ్ విత్తనాల నుండి ఆలివ్ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

డ్రైయిడ్ హెర్బ్స్: హెర్బస్ (మూలికలు)ఆరోగ్యానికి ఉపయోగపడే మూలికలు తులసి, ఓరిగానో వంటివి విటమిన్ ఇ ని అధికంగా కలిగి ఉంటాయి. వీటిని ఇటాలియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకా సలాడ్స్, సూపుల్లో వేసి మరింత టేస్టీగా ఉండేలా తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

వేరుశెనక్కాయలు: ఈ చిన్న నట్స్, ఆకలిని తీర్చడంతో పాటు, బరువును తగ్గించి బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ ఇ యాంటీఆక్సిడెంట్ మ్యూకస్ గ్లాండ్స్ ను క్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది.

బాదాం: బాదం ‘విటమిన్ ఇ' చాలా ఫేమస్. ప్రతి యొక్క బాదాం గింజ నుండి 70-80mg కాల్షియం లభిస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు బాదాం పప్పులను తినడం వల్ల మీకు కావల్సిన కాల్షియం అందిన

మస్టర్డ్ గ్రీన్స్(ఆవ ఆకులు): ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో అత్యధిక శాతంలో విటమిన్ ఇ ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి పలు రకాలుగా సహాయపడుతుంది. దీన్ని హాఫ్ బాయిల్ చేసి లేదా పచ్చిగా అలాగే తినవచ్చు.

బ్రొకోలి: ఇది క్యాలీఫ్లవర్ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్ ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.

రెడ్ బెల్ పెప్పర్: రెడ్ వెజిటేబుల్స్ ముఖ్యంగా రెడ్ బెల్ పెప్పర్ లో అత్యధికంగా విటమిన్ ఇ మరియు విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

పిస్తా: నట్స్ లో చాలా మంచి టేస్ట్ కలది, ఇష్టమైన స్నాక్ పిస్తా. కాబట్టి ఈ పిస్తాను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోకండి. ముఖ్యంగా ఉప్పు లేనటువంటి. లేదా ఫ్రై చేయనటువంటి పిస్తాలను తీసుకోవాలి. ఇందులో న్యూట్రీషియన్స్, మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి.

రెడ్ చిల్లీ పెప్పర్: రెడ్ చిల్లీలో ఉన్న క్యాప్సియాసిన్, శరీరంలో కొన్ని ఉత్పత్తి అయ్యే రసాయనాల వల్ల కలిగే నొప్పిని ఆపుతుంది. జాయిట్(కీళ్ళ)నొప్పులను పోగొట్టడానికి ఇందులో ఉన్న పెప్పరైన్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications











