For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు.!

|

ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఈ వ్యాధి గురించి మాట్లాడక తప్పటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్‌. ఈ క్యాన్సర్ పురుషుల్లోనూ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ... మహిళల్లో వచ్చే ఛాన్స్ వందశాతం ఎక్కువ. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలతోపాటు... చికిత్స, నివారణపై అవగాహన పెంచుకోవల్సిన అవసరం ఉంది.

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు: రొమ్ములోని కొంత భాగంలో లేదా మొత్తం భాగంలో వాపు. 2. చర్మంపై దురదలు 3. రొమ్ములో విపరీతమైన నొప్పి 4. పాలిండ్లలో నొప్పి, పాలిండ్లు లోపలికి వెళుతుండటం5. రొమ్ముపైగల చర్మం ఎరుపపెక్కడం, గట్టిపడటం. 6. చంకలలో ఉబ్బెత్తుగా గడ్డలు ఏర్పడటం

ఎలా గుర్తించాలి: కొన్ని సార్లు రొమ్ము క్యాన్సర్‌ని ప్రారంభంలో గుర్తించడం కష్టం. గడ్డలు ఏర్పడినా, ఏదానా అసాధారణమైన లక్షణాలు,లేదా పైన వివరించిన లక్షణాలలో ఏవైనా మీలో కనిపిస్తే వెంటనే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించండి.

కారణాలు: రొమ్ము క్యాన్సర్‌ ఎందుకు వస్తుందో అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.డాక్టర్ల అభిప్రాయం ప్రకారం రొమ్ములోని కొన్ని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వస్తుంది. ఈ కణాలు సాధారణ ఆరోగ్యకరమైన కణాల కన్నా వేగంగా వ్యాప్తిచెందుతాయి. ఇలా వ్యాప్తి చెందిన కణాలన్నీ సంఘటితమై ఒక గడ్డలా(ట్యూమర్‌) మారతాయి.ఈ గడ్డ మెలిమెల్లిగా రొమ్ములో వ్యాప్తి చెందుతూ శరీరంలోని ఇతర భాగాలకు పాకుతుంది. 'భారత్‌లో గర్భాశయ క్యాన్సర్‌ నేడు బాగా పెరిగింది. ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను అనుకరించడం వల్లనే రొమ్ము క్యాన్సర్‌ రేటు పెరిగింది. నగరీకరణ, వ్యాయామం లేమి, అధికంగా ఆహారం భుజించడం, జంక్‌ ఫుడ్లపై సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణాలు.

నివారణ:మెడిసిన్‌తో పాటు ఆహార పదార్థాలతో కూడా ఈ వ్యాధిని అదుపు వేయవచ్చు. సమతుల్య ఆహారం, వ్యాయామం వుంటే యువ తులు రొమ్ము క్యాన్సర్‌ బారినుండి తమకు తాము రక్షించుకుంటారు. ధూమపానం, మద్యపానం వల్ల. స్థూలకాయం వల్ల. పిల్లలకు పాలివ్వకపోయినా, బ్రెస్ట్ లావుగా ఉన్నవారిలో రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్‌ ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఎక్కువ. స్త్రీలలో బిఆర్‌సిఎ1/బిఆర్‌సిఎ2 మ్యూటేషన్లు ఉన్నా. దగ్గరి సంబంధీకుల్లో ఎవరైనా ఈ మహమ్మారినుంచీ ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే మొదటినుంచీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

వెల్లుల్లి: వెల్లుల్లి ముక్కలను పచ్చిగా, పొడిచేసుకుని తినండి. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకుని ఇది మంచి యాంటీ కాన్సర్‌ కారకంలా పని చేస్తుంది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

బ్రకోలి: బ్రకోలిని పచ్చిగా స్వీకరించాలి.ఇది ట్యూమర్‌ కణాలను హతమార్చగల శక్తివంతమైనది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

బీన్స్‌:రొమ్ము కాన్సర్‌ను సమర్థవంతంగా తట్టుకుని, వ్యాధిని నిర్మూలించడానికి బీన్స్‌ ఎంత చక్కగా పనిచేస్తాయి.సోయాబీన్స్‌లో ఉండే ఐసోఫ్లావోన్స్‌ ట్యూమర్‌ ఎదుగుదలను నిరోదించగలదు.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

గోదుమ పిండి: గోదుమ పిండితో తయారయిన పదార్థాలను ఆహరంగా ఎక్కువగా తీసుకోవాలి. ఎంత ఎక్కువగా గోదుమ పిండిని తింటే అంత తక్కువగా రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. అంతే కాకుండా గోదుమ పిండి గుండెకు కూడా మంచిది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

ద్రాక్ష: కాన్సర్‌ను సమర్థవంతంగా నిర్మూలించడంలో ద్రాక్ష ఎంతగానో ఉపకరిస్తుంది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

గ్రీన్‌ టీ: హర్బల్‌ గ్రీన్‌ టీ వల్ల తరచుగా సేవిండటం ఆంటీ ఇన్‌ఫ్లామెటరీ కారకంగా పని చేస్తుంది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

డ్రై ఫ్రూట్స్‌: కాజు, స్ట్రాబెర్రీలు, ఫ్లాక్స్‌ సీడ్స్‌, పొద్దుతిరుగుడు పువ్వు విత్తులు, పీనట్స్‌ వంటివి కాన్సర్‌ ప్రభావాన్ని మెల్లిమెలిగా తగ్గిస్తాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

దానిమ్మ: ఎర్రగా ఉండే ఈ దానిమ్మ ఆరోగ్యానికి మాత్రమే కాదు క్యాన్సర్ తో పోరాడుతుంది. ఇంకా గుండెకు కూడా మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే ఫోలిఫినాయిల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్: ఆకు కూరలు మరియు డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్ లో పుష్కలమైనటువంటి ఫొల్లెట్, విటమిన్ బి మరియు ఫైబర్ తో పాటు ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దాంతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను కూడా తగ్గిస్తాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

సాల్మన్: ఈ ఆరోగ్యకరమైన సాల్మన్ చేపల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొపర్టీస్ అధికంగా ఉంటాయి. సాల్మన్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ పెరుగుదలను తగ్గిస్తాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

మష్రుమ్: పుట్టగొడుగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం ఎల్ ఈస్ట్రోజెన్ ఇది క్యాన్సర్ బారీన పడకుండా మరియు క్యాన్సర్ శరీరంలో వ్యాప్తి చెందకుండా ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

బ్రొకోలీ మొలకలు: ఇది మరో బ్రెస్ట్ క్యాన్సర్ ఫైటింగ్ ఫుడ్. ఇందులో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇందులో ఉండే సల్ఫోరఫేన్ సెల్స్ క్యాన్సర్ సెల్స్ ను పారద్రోలతాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

ఆకు కూరలు: మహిళలు ప్రీమెన్యుట్రవల్ స్టేజ్ లో ఉన్నట్లైతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టిఆకుకూరల్లో ఉండే డైటరీ ఫైబర్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతుంది.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

డైరీ ప్రొడక్ట్స్: మహిళల డైట్ లో డైరీ ప్రొడక్ట్స్ చేర్చడం చాలా ముఖ్యం. ఇందులో క్యాల్షియం, ఐరన్ మరియు ఆరోగ్యానికి కావల్సిన ఎసెన్షియల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి . డైరీప్రొడక్ట్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడే అంశాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు బెస్ట్ టిప్స్..!

విటమిన్ ఇ పూరిత ఆహారాలు: చాలా మంది మహిళలకు రుతుక్రమ సమస్య నుండి రొమ్మల్లో వాపు మరియు నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అవొకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటంతో ఈ నొప్పులకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

15 Tips for Breast Cancer Prevention | ప్రాణాంతకమైన బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతాలు..తీసుకోవల్సిన జాగ్రత్తలు.!


 After hearing about Angelina Jolie and her health sufferings, we would like to talk about breast cancer, the second most highly diagnosed cancer among women. The rising health disease has been taking lives since many years.
Story first published: Thursday, May 16, 2013, 15:37 [IST]
Desktop Bottom Promotion