For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆహారంను ఎలాతింటే, ఎక్కువ ఆరోగ్యం, ఎక్కువ లాభం!?

By Super
|

అందరికీ అందమైన వయసు, శక్తి, వివిధ కాలానుగుణ అనారోగ్యాలను తట్టుకునే శక్తి, ఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించుకోవాలనే కోరిక ఉంటుంది.

ఇలాంటి కోరిక మీ అత్యంత 10 రకాల కోరికల జాబితాలో ఎక్కడోక్కడ అందంగా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎలుక పరుగు ప్రపంచంలో కొన్ని ఆహార పదార్ధాలు చూసినపుడు లేదా కడుపులో ఆకలి పెరిగినపుడు మాత్రమే తినడానికి మొగ్గు చూపుతాము.

మీ ప్రస్తుత ఆహారాన్ని విశ్లేషించుకోండి

మీ ప్రస్తుత ఆహారాన్ని విశ్లేషించుకోండి

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకునే ముందు, మొదట మీ ప్రస్తుత ఆహార అలవాట్లను గమనించండి. ఆహార పుస్తక సహాయంతో మీరు ఏమి తినాలో గమనించండి. ఈ పద్ధతి మీరు ప్రస్తుత౦ తీసుకునే ఆహరం ఆరోగ్యకరమైనదా కాదా అనే విషయాన్నీ తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

మీ ఆహారంలో క్రమంగా మార్పు తెచ్చుకోండి

మీ ఆహారంలో క్రమంగా మార్పు తెచ్చుకోండి

కొద్ది రోజులలో ఆరోగ్యకర ఆహార మార్పులు తెచ్చుకోడం చాలా కష్టం. క్రమంగా కొత్త ఆహార ప్రణాలికను అలవాటుచేసుకోండి, నిదానంగా వాటిని తొలగించి తప్పించుకోండి. ప్రారంభ దశలో వారంలో కనీసం ఒకసారి శాకాహారాన్ని ఎంచుకొని, తరువాత మీరు ఈ మార్పులను అలవాటుచేసుకుని వీటిని రోజుకొకసారి తీసుకోవడానికి ప్రయత్నించమని ఆమె సూచించారు.

మధ్యధరాప్రాంతానికి చెందిన ఆహరం ప్రయత్నించడం

మధ్యధరాప్రాంతానికి చెందిన ఆహరం ప్రయత్నించడం

మధ్యధరా ప్రాంతానికి చెందిన ఆహరం అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహరం లో ఒకటి. ఈ ఆహరం వల్ల మంచి రుచి, మంచి ఆరోగ్యం మనచేతిలో ఉంటాయి. మధ్యధరా ఆహరంలో రిఫైండ్ చెయ్యని ధాన్యాలు, అపరాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల వినియోగం ఎక్కువగా ఉంటుంది.

మీకు అవసరమైన కెలోరీలను ఖచ్చితంగా తెలుసుకోండి

మీకు అవసరమైన కెలోరీలను ఖచ్చితంగా తెలుసుకోండి

మీ రోజువారీ కార్యక్రమాలకు ఎన్ని కేలరీలు అవసరమో అర్ధంచేసుకుని, పరిసీలించుకోండి. మనిషికి అవసరమైన కేలరీలు శారీరిక కార్యక్రమాల పరిధి, జీవక్రియపై ఆధారపడి వ్యక్తీ కి వ్యక్తీ కి మధ్య వేరుగా ఉంటాయి. కండరాల బలం కూడా కేలోరీ అవసరంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది; లేకపోతే మీ శరీర కండర కణజాలం, శక్తి తగ్గి విభజన ప్రారంభమౌతుంది.

అల్పాహారం చాలా ముఖ్యమైనది

అల్పాహారం చాలా ముఖ్యమైనది

ఒక్క విషయాన్నీ మీరు ప్రతిరోజూ ధార్మికంగా అనుసరించి నిర్ణయించుకోండి, అది ఇదే - ప్రతిరోజూ ఉదయం ఆరోగ్యకర అల్పాహారం తినండి. మీరు నిద్రలేచాక ముందుగా చేయవలసినది మీ రోజును ఆరోగ్యకర అల్పహరంతో వెంటనే ప్రారంభించడం మీకు అవసరం.

ఆరోగ్యాన్ని ఎంచుకోండి

ఆరోగ్యాన్ని ఎంచుకోండి

ఆరోగ్యకరమైనవి తినాలి అనే లక్ష్యా౦తో మీరు ప్రారంభిస్తే, కేలరీలు లెక్కించడానికి, ఆహార పరిమాణాన్ని తూయడానికి ఎప్పుడూ వెనుకాడరు. అంతేకాకుండా, మీ ఆహారానికి ఎక్కువ రంగులు, వైవిధ్యాలు, ఎంతో తాజావి జతచేయడానికి ఆలోచించండి. ఈ పద్ధతి మీరు ఆరోగ్యకరమైనవి ఎన్నుకోవడానికి సహాయపడుతుంది.

కార్బోనేటేడ్ నీటిని వదిలేయండి

కార్బోనేటేడ్ నీటిని వదిలేయండి

కృత్రిమ తీపితో తమకుతాము పెట్టుకున్న లేబుళ్లతో ఉన్న కార్బోనేటేడ్ నీరు లేదా ఏ ఇతర గాలిచొరబడే పానీయాలు మీ ఆరోగ్యకర ఆహారాన్ని నాశనం చేసి, తద్వారా మీ ప్రయాణాన్ని చెడగొడతాయి. ప్రతిరోజూ ఈ పానీయాలు తాగేవారిలో మీరు కూడా ఉంటే మీ ఆరోగ్యం పాడైపోతుంది.

తినుబండారాల కింద పండ్లు తినండి

తినుబండారాల కింద పండ్లు తినండి

మీకు సాయంత్రం తినుబండారాలుగా జంక్ ఫుడ్ ఇష్టమైతే, క్రమంగా దాన్ని ఒక గిన్నెడు తాజా పండ్లతో మార్చుకోండి. మీకు ఆకలిగా అనిపిస్తే, పండులో ఒక ముక్కను తినండి. ఈ పద్ధతి మీకు అద్భుతాలను చేస్తుంది, మీ శరీరం కావలసిన౦త విటమిన్లు, పోషకాలతో నిండి ఉంటుంది.

పనిచేసే సమయంలో ఇంట్లో తయారుచేసిన భోజనం తీసుకోండి

పనిచేసే సమయంలో ఇంట్లో తయారుచేసిన భోజనం తీసుకోండి

మీరు ఆరోగ్యంగా జీవించడానికి ఇంట్లో వండిన భోజనాన్ని తీసుకోండి. ఏమీ ఆలోచించ కుండా మీరు పంచదార, ఉప్పు, కృత్రిమ పదార్ధాలు తీసుకున్నప్పుడు పగలు ఒత్తిడి లేకుండా ఉంటుంది.

పండ్లు, కూరగాయలు ఎప్పుడూ సరైన ఎంపిక

పండ్లు, కూరగాయలు ఎప్పుడూ సరైన ఎంపిక

మీరు రోజుకు వివిధ రకాల పండ్లు, కూరగాయల ఐదు రకాలను జోడించాలని నిర్ధారించుకోండి.

మీరు తినే ఆహార పరిమాణాన్ని తగ్గించండి

మీరు తినే ఆహార పరిమాణాన్ని తగ్గించండి

మనం బల్ల మీద మంచి ఆహరం చూసినప్పుడు, ఎక్కువ మొత్తం ఆహారంతో మన కంచాన్ని నింపుకోవాలని అనుకుంటాము. మీ కంచం మొత్తం నింపుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. చిన్న కంచాలలో ఆహారాన్ని పెట్టుకోవడం ప్రారంభించండి.

లేబుల్ చదవడం ప్రారంభించండి

లేబుల్ చదవడం ప్రారంభించండి

ఏదైనా ఆహార ఉత్పత్తులను కొనేటపుడు, బాక్స్ తీసి ఆహార పదార్ధాలను చదవండి. దానిలో ఉన్న వివిధ పదార్ధాలు, కృత్రిమ ఉత్పత్తుల ద్వారా వెళ్ళడం చాలా ముఖ్యం.

ఎక్కువ నీరు తాగండి

ఎక్కువ నీరు తాగండి

ప్రతిరోజూ ఉదయం కనీసం ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాలి. ఇది ఆక్సిజన్, నీటిని అందించడం ద్వారా కణాలన్నిటికీ శక్తినిచ్చి సహాయపడుతుంది.

మెల్లిగా తినండి :

మెల్లిగా తినండి :

మీ ఆహారాన్ని ఆస్వాదించడానికి, తక్కువ తినడానికి ఉత్తమ మార్గం మెల్లిగా తినడం. మీ ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా నమలండి, దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగౌతుంది, కడుపు కూడా నిండుతుంది.

పర్ఫెక్షన్ అంత ముఖ్యం కాదు

పర్ఫెక్షన్ అంత ముఖ్యం కాదు

ఆరోగ్యకరమైన ఆహార౦ వైపు మీరు చేసే ప్రయాణంలో మీరు చేసుకునే ప్రతీ మార్పు చాలా ముఖ్యమైనదే. కానీ పర్ఫెక్షన్ కోసం పాకులాడి మీకు బాగా నచ్చే పదార్ధాలు తినడం పూర్తిగా మానివేయకండి.

కొనే బదులు వండుకోండి

కొనే బదులు వండుకోండి

ఏ పదార్ధమైనా రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవాలనే ఆలోచన మానేయండి. దాని బదులు ఇంటి దగ్గర వండుకోండి. పిజ్జాల నుంచి బర్గర్ల దాకా ఏదైనా మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు, నిజానికి మీరు నిపుణులు గనుక దాన్ని మరింత ఆరోగ్యకరంగా చేసుకోవచ్చు.

ఆహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి.

ఆహారంలో మాంసకృత్తులు ఉండేలా చూసుకోండి.

మీ దైనందిన పనులు చేసుకోవడానికి మీకు శక్తి కావాలి. ఈ శక్తిని నింపుకోడానికి పల్చటి మాంసం, గుడ్లు, పప్పు దినుసులు, పాలు, వెన్న లాంటి మాంసకృత్తులు ఎక్కువగా వున్న పదార్ధాలు చేర్చుకోండి. బలమైన ఎముకలు పళ్ళు కలిగి ఉండాలంటే మీగడ, సోయా బీన్స్, గింజ ధాన్యాలు కలుపుకోండి.

సరైన విరామాల్లో తినండి.

సరైన విరామాల్లో తినండి.

ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటూ వుండండి, అంటే రోజుకి మూడు సార్లు భోజనం, రెండు సార్లు చిరుతిళ్ళు అన్నమాట. ఎక్కువగా తినకుండా ఉండాలంటే సరైన విరామాల్లో ఎక్కువ సార్లు తినండి.

ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు చాలా ముఖ్యం

ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు చాలా ముఖ్యం

కార్బోహైడ్రేట్లు, పీచు పదార్ధం ఎక్కువగా వుండే ఆరోగ్యకరమైన పదార్ధాలు ఎంచుకోండి, ముఖ్యంగా పప్పు ధాన్యాల వల్ల ఎక్కువ సేపు శక్తి వుంటుంది. పప్పు ధాన్యాల్లో ఫైటో కెమికల్స్, యాంటి ఆక్సిడెంట్లు వుంటాయి, ఇవి గుండె జబ్బులను, కొన్ని కాన్సర్లను, మధుమేహాన్ని ఎదుర్కోవడానికి కూడా ఇవి పనికి వస్తాయి.

అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాల కన్నా మంచి కొవ్వులను ఎంచుకోండి.

అనారోగ్యకరమైన కొవ్వు పదార్ధాల కన్నా మంచి కొవ్వులను ఎంచుకోండి.

మీ మెదడును, గుండె, కణాలు, జుట్టు, చర్మం, గోళ్ళకు పోషణ కావాలంటే మంచి కొవ్వు పదార్ధాలకు మంచి వనరు. ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ వుండే ఆహార పదార్ధాలు చాల ముఖ్యమైనవి, ఇవి గుండె జబ్బు ప్రమాదాన్ని తగ్గించి, మీ మూడ్ ను తాజా గా వుంచి, మతిమరపును కూడా నివారిస్తుంది.

English summary

20 best ways healthy eating habits

All of us desire to age gracefully, be fit, immune to various seasonal illness, and maintain a healthy body.
Desktop Bottom Promotion