For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి ఎక్కువగా ఫీలవుతున్నారా? అల్జీమర్స్ అయ్యుండచ్చు

By Super
|

ప్రసిద్ధ నమ్మకంలా కాకుండా, అల్జీమర్ ఏ వయసులోనైన రావచ్చు. చాలామంది వయసు మళ్ళిన వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ వ్యాధి మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది. వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ ఆల్జీమర్స్‌ వ్యాధికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆసక్తిలేకపోయినా మతి మరుపు రావచ్చు.

అల్జీమర్స్ .... ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి ఇది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. ఈవేళ ప్రపంచంలో ఎందోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్ కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనిషి ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో విషయగ్రహణ చర్యను అడ్డుకునే అల్లోప్రెగ్ననోలోన్ అనే స్టెరాయిడ్స్ స్థాయులు అధికమవుతున్నాయట. ఇది దీర్ఘకాలం కొనసాగితే అల్జీమర్స్ వ్యాధి వచ్చే ముప్పు అధికమవుతుందని స్వీడన్ లోని ఓ విశ్వ విద్యాలయం వారు జరిపిన పరిశోధనల్లో తేలింది. అల్జీమర్స్ వ్యాధిలో మెదడు కణాలు దెబ్బతింటాయి. అందుకని ఒత్తిడిని బాగా తగ్గించుకోవాలని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. అల్జీమర్ వ్యాధికి చెందిన 10 హెచ్చరిక సంకేతాలను తెల్సుకోవడానికి చదవండి.

పేర్లు మరచిపోవడం

పేర్లు మరచిపోవడం

పేర్లు మరచిపోవడం, వస్తువులు పోగొట్టుకోవడం, వెళ్ళవలసినసమయం మర్చిపోవడం, పదాలను వెతకడం కష్టమవడం, వస్తువులు గుర్తుపెట్టుకోవడం, నేర్చుకోవడం వంటి వాటితో సమస్యలు వంటివి నిరంతర లక్షణం. దీర్ఘకాలిక, స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పూర్తిగా కోల్పోవటం వలన తీవ్రమైన చిత్తవైకల్యం ఏర్పడుతుంది; మీ ప్రియమైన వారు, బంధువులు లేదా స్నేహితులను గుర్తుపట్టడం కష్టమౌతుంది.

ఆలోచన, తార్కికంలో ఇబ్బంది.

ఆలోచన, తార్కికంలో ఇబ్బంది.

అక్షరాలూ, అంకెలు గుర్తుపట్టడంలో ఇబ్బంది, లెక్కలు చేయడం కష్టమవడం. మీ స్వంత ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

సమన్వయం, మోటార్ పనులలో ఇబ్బంది

సమన్వయం, మోటార్ పనులలో ఇబ్బంది

మీరు బద్దకంగా మారిపోయి, పడిపోతుండే ధోరణికి అలవాటు పడటం వలన వంట చేయడం, బండి నడపడం, ఇంటిపనులు చేయడం కష్టమౌతుంది. చిత్తవైకల్యం ఎక్కువైనప్పుడు, మీకు ప్రతి రోజు చేసే స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, తయారవడం, తినడం, ఎవరి సాయం లేకుండా టాయిలెట్ ను వాడటం వంటివి చేయడం అసాధ్యమౌతుంది.

సరిగా అంచనా వేయలేకపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం

సరిగా అంచనా వేయలేకపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం

ఆలోచించడానికి మీరు ఆసక్తులుగా మారుతారు. రెండు విషయాల మధ్య నిర్ణయం తీసుకోలేకపోవడం జరగవచ్చు. ఉదాహరణకు, అది వేసవి అయితే, తేలికపాటి నూలు దుస్తుల బదులుగా మీరు శీతాకాలపు జాకెట్ ను ధరించవచ్చు.

సమయం, తేది, స్థానం ల దిశలను తెల్సుకోలేకపోవడం

సమయం, తేది, స్థానం ల దిశలను తెల్సుకోలేకపోవడం

మీరు ప్రస్తుత సమయం, తేది, రోజులను మర్చిపోవడమే కాక, ప్రజలను, స్థలాలను కూడా గుర్తుపట్టక పోవచ్చు. మీరు మీ ఇంటి చిరునామా మర్చిపోవచ్చు; మీరు ఉండే చోటు లేదా పనిచేసే చోటు లేదా ఎక్కడికి వెళ్తున్నారో కూడా మర్చిపోవచ్చు.

సమాచార ప్రసారంలో సమస్యలు

సమాచార ప్రసారంలో సమస్యలు

మీరు భాషను సరిగ్గా ఉపయోగించలేకపోవచ్చు, పదాలలో సరిగ్గా చెప్పలేకపోవచ్చు లేదా మాట్లాడిన, రాసిన పదాలను అర్ధం చేసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.

వ్యక్తిత్వ౦లో మార్పులు

వ్యక్తిత్వ౦లో మార్పులు

కారణం లేకుండానే మితిమీరిన కోపం, ఆత్రుత లేదా అనుమానాస్పద౦గా మీరు మారవచ్చు. అందరిలో కలిసే మనస్తత్వం ఉన్నప్పటికీ, మీరు ముడుచుకుపోయి, దూరంగా, నిశ్శబ్దంగా ఉంటారు.

ప్రవర్తనలో మార్పులు

ప్రవర్తనలో మార్పులు

మీ ప్రవర్తన మారుతుంది, మీ ఆలోచనలు హఠాత్తుగా మారిపోవడం, కొద్దిసమయం పాటు సరైన కారణం లేకుండా కోపం రావడం. సరికాని ప్రవర్తన ప్రకారం మీరు నడుచుకోవచ్చు; మీకు కోపం వచ్చి, చెడుగా ప్రవర్తించవచ్చు.

భ్రాంతులు, భ్రమలు

భ్రాంతులు, భ్రమలు

అక్కడ లేని ప్రజల, జంతువులను చూడటం, వినడం మొదలైనవి జరగవచ్చు. భ్రమలు, భ్రాంతులను కల్గించవచ్చు. ఉదాహరణకు చనిపోయిన మీ నాన్నగారిని చూడటం లేదా ఆయన చనిపోయినప్పటికి బతికే ఉన్నారని నమ్మడం వంటివి

మానసిక రుగ్మత

మానసిక రుగ్మత

మీరు ఇతరుల ఉద్దేశ్యాలకు నిరాధారమైన లేదా అధిక అనుమానం ఏర్పరచుకుంటారు. మానసిక రుగ్మత, అధిక ఆత్రుత, భయం వలన కలుగుతుంది. భ్రమ కూడా నెమ్మదిగా కనబడుతుంది. మీరు మృదువుగా, అనుమానాస్పద౦గా, చికాకుపెట్టేవిధంగా, అంతర్ముఖునిగా, అణగారినట్టుగా, పట్టువదలని, అసూయ, స్వార్థ౦, సమాజానికి వ్యతిరేకంగా, కఠిన౦గా మారతారు.

మీ మెదడును నిమగ్నం చేయండి

మీ మెదడును నిమగ్నం చేయండి

చదువు, శక్తివంతమైన మానసిక కార్యకలాపాలు, ఉత్తేజపరిచే భాష --- ఇవ్వన్ని చికాగో రష్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ కు చెందిన డా. డేవిడ్ బెన్నెట్ చెప్పిన జ్ఞాననిల్వలను మీ మెదడులో సృష్టించడానికి సాయపడతాయి. కార్పర్ వాదించినట్టు " జీవిత అనుభూతుల ఒక గొప్ప సంపద", ఇదే జ్ఞాన నిల్వలను సృష్టిస్తుంది. అందువలన నిరంతరం చదవండి! ఎక్కువ కాలం జీవించండి. అల్జీమర్ ను నిరోధించండి.

ఇంటర్నెట్ ను వెతకండి

ఇంటర్నెట్ ను వెతకండి

యుసిఎల్ఏ కు చెందిన గ్యారీ స్మాల్ చెప్పినట్టుగా కార్పర్ తెలపడం ఏమిటంటే ఆన్ లైన్ లో ప్రతి రోజు ఒక గంట పాటు ఏదో ఒకటి వెతకడం అనేది " వయసు పై బడుతున్న మీ మెదడును ఒక పుస్తకం చదవడం కంటే ఎక్కువగా ఉత్తేజపరుస్తుంది." బాగా చదవడం లేదా గూగుల్ వాడటం చేసే వాడిగా నేను వీటిని నమ్మనప్పటికి ఇది సరైనదే. మీరు గూగుల్, బింగ్ లేదా ఏదైనా వేరే సెర్చ్ ఇంజను వాడుతుంటే దీనిలో మీరు ముందుకు సాగండి! ఇది మీ మెదడుకు మేతనిచ్చి, అల్జీమర్ ను దూరంగా ఉంచుతుంది.

కొత్త మెదడు కణాలు వృద్ది చేసి, వాటిని సజీవంగా ఉంచండి

కొత్త మెదడు కణాలు వృద్ది చేసి, వాటిని సజీవంగా ఉంచండి

కొత్త మెదడు కణాలను వృద్ది చేయడం నిజంగా సాధ్యమా అనిపిస్తుంది, కార్పర్ ప్రకారమైతే --- ప్రతిరోజు వేలకొద్ది. ఆమె 100 తేలిక మార్గాలలో ఒక మార్గం మీ శరీరం, మనసు కు కూడా వ్యాయామం అల్జీమర్ ను నిరోధిస్తుందని తెలుపుతుంది.

ధ్యానం

ధ్యానం

ధ్యానం, జీవితంలోని గొప్ప రహస్యాలలో ఒకటి. మీరు ధ్యానం చేసే వారిలో ఒకరు కాకపోతే, మీకు మీరే ఒక బహుమతి ఇచ్చినట్టు, ఇది ఎలాగో నేర్చుకోండి. మీరు ఒత్తిడి నుండి విశ్రాంతి పొందుతారు, బాగా చదవగలరు, ఇన్నాళ్ళు ఇవి లేకుండా ఎలా ఉన్నానా అని ఆశ్చర్యపోతారు.

కాఫీ తాగండి

కాఫీ తాగండి

యూరప్ లోని ఒక అధ్యయనం ప్రకారం నడి వయసులో మీరు రోజుకు మూడు, ఐదు కప్పుల కాఫీ తాగితే, ఇది జీవితం తర్వాతి కాలంలో మిమ్మల్ని అల్జీమర్ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని 65% తగ్గిస్తుంది.

ఏపిల్ జ్యూస్ తాగండి

ఏపిల్ జ్యూస్ తాగండి

కాఫీ ఇష్టం లేకపోతే, ఏపిల్ జ్యూస్ ఇష్టమై ఉండవచ్చు. ఏపిల్ జ్యూస్ "జ్ఞాపక రసాయనం" అసిటిల్కోలిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందువలన ఇది అల్జీమర్ మందు అరిసెప్ట్ లానే పనిచేస్తుంది.

జీవిత ప్రాధమిక దశలలో

జీవిత ప్రాధమిక దశలలో

జీవిత ప్రాధమిక దశలలో తలకు దెబ్బతగిలిన వారిలో వయసు మళ్ళిన వారి కంటే అల్జీమర్ వ్యాధి నాల్గు రెట్లు ఎక్కువగా వస్తుంది. వయసు మళ్ళిన తర్వాత తలకు దెబ్బ తగిలితే, కేవలం ఐదు ఏళ్ళ తర్వాత అల్జీమర్ రావచ్చు.ఇవన్ని అందమైన నమ్మశక్యం కాని వార్తలు. ఇంకా నమ్మశక్యం కానిదేమిటంటే మాజీ ఫుట్బాల్ ఆటగాళ్ళుకు మాములుగా ఉండే వారిలో కంటే 19 సార్లు ఎక్కువగా జ్ఞాపక-సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందువలన మీ తలను కాపాడుకోండి.

అంటువ్యాధులకు దూరంగా ఉండండి

అంటువ్యాధులకు దూరంగా ఉండండి

జలుబు పుళ్ళు, జీర్ణాశయ పూతలు, లైమ్ వ్యాధి, న్యుమోనియా, ఫ్లూ వ్యాధి అల్జీమర్ కు దారితీయవచ్చు. చిగుళ్ళ వ్యాధి కూడా హానిచేసే బాక్టీరియాను మెదడుకు చేర్చుతుంది. అందువల్ల మీ పళ్ళను గార పట్టకుండా చూసుకోండి, ఎటువంటి అంటువ్యాధులను రానివ్వకండి. ఒకవేళ వస్తే, సాధ్యమైనంత త్వరగా వాటిని అదుపులోనికి తెండి.

విటమిన్ డి తీసుకోండి

విటమిన్ డి తీసుకోండి

విటమిన్ డి లోపం ఎక్కువగా ఉండటం కూడా జ్ఞాపక శక్తి కోల్పోవడానికి ఆశ్చర్య పరిచే విధంగా 394% ఎక్కువగా దోహదం చేస్తుంది. "హెర్రింగ్, మాకేరెల్, సాల్మన్, సార్డీన్ వంటి కొన్ని రకాల చేపలు, గుడ్డు పచ్చసొనలలో విటమిన్ డి ఉంది. పాలు, విటమిన్ డి తో నిండి ఉన్నాయి. కొన్ని జ్యూస్ ఉత్పత్తులు, ఉపాహార తృణధాన్యాలు, ఇతర ఆహారాలు కూడా విటమిన్ డి తో బలోపేతమై ఉన్నాయి."

English summary

20 Signs Of Alzheimer's To Watch Out For


 
 Unlike popular belief, Alzheimer's could strike you at any age. A phenomenon common amongst the older lot of people, it is a disease which can turn your life upside down.
Desktop Bottom Promotion