For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్రెషన్ కు గుడ్ బై చేప్పే 20 నేచురల్ పద్ధతులు..!

|

ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతున్నది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి. ఏదో తెలియని బాధ, నిరాశ, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిస్సత్తువ, నిద్రలేమి, ఆకలి మందగించటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. బరువు విపరీతంగా తగ్గిపోవటం లేదా విపరీతంగా బరువు పెరగటం. తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, చనిపోవాలనే ఆలోచనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, భవిష్యత్తులో ఏదో విపరీతమైన మార్పులు సంభవిస్తాయన్న భావన మొదలైనవి దీని లక్షణాలు. సకాలంలో దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవ చ్చు. దీని లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు ఉండవచ్చు.

ఇలా సంవత్సరాల పొడువున ఒత్తిడి మిమ్మల్ని వేదిస్తుంటే కనుక మీరు ఖచ్చితంగా కౌల్సింగ్ చేయించుకోవాలి. అయితే కౌన్సిలింగ్ ఒక్కటే సరిపోదు. కాబట్టి ఒత్తిడి బీట్ చేయడానికి కొన్ని సొంత పద్దతులను పాటించాలి. డిప్రెషన్ అనేది ఒక విధానంలో తగ్గేది కాదు. మానసిక వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు వారు మీకు కొన్ని మందులను తీసుకోమని సలహా ఇస్తుంటారు. అయితే మందులతో తగ్గిని కొన్ని వ్యాధులు సొంత పద్దతులను, నేచురల్ పద్దతులను ఉపయోగించడం వల్ల ఒత్తిడిని బీట్ చేయవచ్చు. ఇలా నేచురల్ పద్దతుల్లో డిప్రెషన్ ను డీకొట్టడానికి కొన్నిసులభ టిప్స్ ఉన్నాయి. వాటిని కనుక మీరు తప్పక పాటించినట్లైతే మీరు డిప్రెషన్ నుండి బయటడపడటంతో పాటు ఎమోషనల్ హెల్త్ ను మెరుగు పరుచుకోవచ్చు. దాంతో మీరు ఎల్లప్పుడూ పాజిటీవ్ వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోవచ్చు.

డిప్రెషన్ ను బీట్ చేయాలంటే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మరియు మీ మనస్సును పాజిటివ్ గా మార్చుకోవాలి. డిప్రెషన్ బీట్ చేయడానికి జీవన శైలిలో కొన్ని మార్పులు, కొన్ని అలవాట్లు ఖచ్చితంగా సహాయపడుతాయి. మీ నడుము చుట్టూ కొంత్త కొవ్వును తగ్గించుకోవడం వల్ల కూడా మీకు కొంత నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఏటువంటి మందులు ఉపయోగించకుండానే డిప్రెషన్ ను దూరం చేసే కొన్ని మంచి మార్గాలు మీకోసం...

మీరు ఒత్తిడికి గురిఅవుతున్నారనే విషయాన్ని ఒప్పుకోవాలి: మొదట మీరు మీ మానసిక ఆరోగ్య సమస్య ఉందని, ఒప్పుకోవడం చాలా అవసరం. ఈ నిర్ణయానికి రావడం అంత సులభం కాదు. అయితే ఒక్కసారి మీరు నిర్ణయించుకొన్న తర్వాత, తదుపచి చర్యలు చేపట్టడం చాలా సులభం అవుతుంది.

ఒక కౌన్సిలర్ (మానసిక వైద్యులను)సంప్రదించండి: మీరు మానసిక స్థితిని ఎదుర్కోవటానికి ఒక మానసిక వైద్యుడును సంప్రదించడం వల్ల వారి సహాయం మీ ఒత్తిడిని తగ్గించడాని బాగా ఉపయోగపడుతుంది. కేవలం మాత్రలు కోసం, ప్రిస్ర్కిప్షన్స్ పొందడానికి కౌన్సిలర్ల వద్దకు వెళితే ప్రయోజనం ఉండదు. ఇది మీరు ప్రస్తుతానికి ఒత్తిడి తగ్గించుకోవడానికి సహాయపడుతుంది అంతే.

బరువు తగ్గాలి: మీరు బరువు తగ్గడం వల్ల కూడా మీరు చాలా బెటర్ గా ఫీల్ అవుతారు.

స్నేహితులను కలవాలి: ఒత్తిడి తగ్గించుకోవడం కోసం మంచి స్నేహితులను తరచూ కలుస్తుండటం బెస్ట్ మెడిసిన్ వంటిది. మిమ్మల్ని ఎల్లప్పుడు సంతోషంగా మరియు సౌకర్యవంతంగా చూసుకొనే స్నేహితులను కలవడం మంచిది.

మంచి పుస్తకాలను చదవాలి: పుస్తకాల పఠనం ప్రామాణిక ఒత్తిడిన దూరంచేస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించినట్లయితే, మీరు ఎంత కోల్పోయారో ఆశ్చర్యపోతారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మంచి పుస్తకాలు చదవండి, జ్ఞానంతో, తాజా శక్తితో మిమ్మల్ని మీరు తెలుసుకోండి.

వెకేషన్స్: పని ఒత్తిడి భావించకుండా వుండాలంటే, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలసి వారాంతపు సెలవులలో విహారాలకు వెళ్ళండి. ప్రతిరోజూ బోర్ కొట్టేలా...ఇల్లు...ఆఫీస్ అంటూ తిరగక, కొద్దిపాటి మార్పుగా వారాంతపు సెలవలు ఇతర ప్రదేశాలలో ఆనందించండి. ప్రస్తుత ఒత్తిడి జీవితాలలో ప్రకృతి ప్రతివారికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఇతర ప్రదేశాలలో రిలాక్స్ అయితే, మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. కనీసం ఆ సమయంలో అయినా సరే మీ పని ఒత్తిడి మరచిపోతారు.

వ్యతిరేక స్వభావం కలిగిన వ్యక్తులకు దూరంగా: వ్యతిరేక స్వభావం కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండండి. మీ గురించి చెడుగా మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎప్పుడైతే మీరు ఒత్తిడికి గురి అవుతారో అప్పుడు మీ మాటల్నీ మరియు మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులకు దూరంగా ఉండండి.నిరంతరం ఇతరులను అణచివేయాలని అనుకునేవారి చుట్టూ ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. స్పష్టమైన ఆలోచనలు కలిగినవారు ప్రశా౦తమైన మనసుని, వివేకాన్ని సంరక్షించడానికి సహాయ పడతారు.

సాధు జంతువులను పెంచుకోండి: మీతో ఒక పెంపుడు జంతువు ఉండంట కూడా ఒక మంచి పద్దతి. మీరు పెంపుడు జంతువులను కలిగి ఉండటం వల్ల కొంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవచ్చు . ఎందుకంటే వాటి సంరక్షణలో మీరు బిజీగా ఉంటారు కాబట్టి.

రోజూ వ్యాయామం చేయ౦డి: ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం సరైన మార్గం. దీనివల్ల చక్కని శరీర సౌష్టవమే కాకుండా, శరీరంలో అనుకూలతని కూడా తీసుకువస్తు౦ది. వ్యాయామం వల్ల సేరోటోనిన్, టెస్టోస్టెరాన్ విడుదల అవడంవల్ల మనసు నిలకడగా ఉండడం, నిరుత్సాహపరిచే ఆలోచనలను పోగొట్టడం జరుగుతాయి.

తాగడం మానేయండి: ఒత్తిడి పెరగడానికి డ్రింక్ చేయడం కూడా ఒక కారణమే. కాబట్టి డిప్రెషన్ ను బీట్ చేయాలంటే కొన్ని డ్రింక్స్ కు గుడ్ బై చెప్పండి.

రాయడం: మీ ఒత్తిడిని దూరం చేయడానికి మరోమార్గం రాయడం. మీరు మీ వ్యక్తిగత డైరీ లేదా చిన్న కధలు రాసినట్లైతే, మీ మనసులోని ఆలోచనలను కాగితంపై పెడితే (లేదా కంప్యూటర్ లో) నిస్సందేహంగా ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి, మీ ఊహలను అమలు చేయడానికి సృజనాత్మకతను అందిస్తుంది. తేలిగ్గా, ప్రభావవంతంగా మీ రోజువారీ వత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు సరిపోయే ఉత్తమమైన అలవాటును ఎంచుకోండి.

వర్తమానంలో జీవించండి: గతంలో జరిగిన పొరపాట్ల గురించో లేక ఇతమిద్ధంగా తెలియని భవిష్యత్తు గురించో విచారించడం వృధా. మన అధీనంలో లేని పరిస్థితి మీద మన భావోద్వేగాలు ఉంచినా ఉపయోగం లేదు. ‘ఎప్పుడు', ‘ఎక్కడ' లేక ‘రేపు' అనే వాటికి బదులుగా ‘ఇప్పుడు', ‘ఇక్కడ' లేక ‘ఈరోజు' అని ఆలోచించండి.

సెల్ఫ్ పిటి: జాలి పడటం అనేది మిమ్మల్ని మీరే భావోద్వేగానికి గురిచేస్తుంది. కాబట్టి, మీమీద మీకు జాలిపడే లక్షణాలు కలిగినప్పుడు, వెంటనే ఆ ఆలోచనలను దూరం చేసుకోండి.

కలర్ థెరఫీ: మీరు నివసించే ప్రదేశంలో మీకు ఇష్టమైన బ్రైట్ అండ్ వార్మ్ కలర్స్ ను ఎంపిక చేసుకోండి. మీకు నచ్చిన కలర్స్ తో మీ గదికి పెయింట్ చేసుకోవడం, కలర్ ఫుల్ కుషన్స్ మీ మనస్సును ఆహ్లాదపరుస్తాయి.

పిల్స్ వాడకుండా మంచి నిద్రను పొందాలి: అనుకూల ఆలోచనలు తిరిగి మొదలు అవడానికి ప్రతివారికీ మంచినిద్ర అవసరం. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోయే వారిలో ఒత్తిడి సూచనలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల వల్ల తెలుస్తుంది.

లైంగిక సాన్నిహిత్యానికి దూరం కాకండి.: ఒత్తిడిలో వున్నప్పుడు శృంగారాన్ని ఆస్వాదించ లేక పోవచ్చు, కానీ శృంగారం ఒత్తిడిని దూరం చేసే గొప్ప సాధనం అని చాలా మంది తెలుసుకోరు. శృంగారం వల్ల జరిగే హార్మోన్ల విడుదల ఒత్తిడిని స్థిరీకరించి మానసిక ఆందోళనల నుంచి విముక్తిని కలిగిస్తుంది.

స్పా: మిమ్మల్ని మీరే మార్చుకోవడం, అందంగా అలంకరించుకోవడం వల్ల మీరు మంచి అనుభూతిని పొందడానికి సహాపడుతుంది. కాబట్టి, స్పా లేదా సెలూన్ల కు వెళ్ళి వివిధ రకాల బ్యూటీ ట్రీట్మెంట్లతో మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి .

తమాషా సినిమాలను చూడండి: ఒత్తిడిని తగ్గించుకోవడానికి నవ్వు అనేది బెస్ట్ నేచురల్ మెడిసిన్. మిమ్మల్ని బాగా నవ్వించగలిగే సినిమాలను చూసినప్పుడు, మీ ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించుకోవచ్చు.

కొత్త ఉద్యోగం: ప్రస్తుతం పనిచేస్తున్న చోట మీకు నచ్చకపోయినా లేదా అధిక ఒత్తిడికి గురిఅవుతున్నా వెంటనే ఆ జాబ్ ను వదిలి కొత్త జాబ్ లో చేరండి. అలా అని ఇంట్లో కూర్చోకండి. మీ అభిరుచికి తగ్గ ఉద్యోగాన్ని వెతుక్కోండి.

కాంపిటీటివ్ స్పోట్స్: డిప్రెషన్ దూరం చేసుకోవాలంటే కొన్ని కాంపిటీటివ్ స్పోట్స్ లో పాల్గొనాలి. ఫుట్ బాల్, వాలీ బాట్, బిలియార్డ్స్, లేదా బాస్కెట్ బాల్ వంటివి డిప్రెషన్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. ఒత్తిడి తగ్గాలంటే యోగా, ధ్యానం, అరబిక్ వ్యాయామాలు, జిమ్ లు, సల్సా డాన్సులు వంటివి ఆచరించాలి. అవి మిమ్మల్ని శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఆరోగ్యంగా వుంచుతాయి. మీకుగల పనిభారాన్ని తట్టుకునేలాకూడా చేస్తాయి.

English summary

20 Ways To Beat Depression Naturally

If you have been feeling low for a long period of time, its time to wake up. Clinical depression is becoming a very common problem in urban areas. If you are depressed then you need help. But just going to a counsellor will not help you. You need to find your own ways to beat depression.