For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టమోటాల వల్ల కలిగే 9 ఆరోగ్యకర ప్రయోజనాలు

By Super
|

టమోటాలు! ఇవి తియాగా, జ్యూసీగా, రుచిగా ఉంటాయి. అవి మనకు మంచిదని అందరికీ తెలుసు, అవునా? ఉహ్, యే, ఖచ్చితంగా. ప్రత్యేకంగా టమోటాలు ఆరోగ్యకరమైన ఆహరం ఎందుకో ప్రతివక్కరికీ తెలుసా? మ్.... అది విటమిన్ C ని కలిగి ఉంటుందనా? కాలరీలు తక్కువగా ఉంటాయనా? కొవ్వు-లేనివనా? అవును, అవును, అవును, కానీ మొత్తం ఇవే కాదు!
టమోటా అద్భుతమైన ఆరోగ్యకర ఎంపికగా ఎందుకు తయారయిందో చూద్దాం.

ఒక కప్పు ఎర్రని, పండిన, పచ్చి టమోటాలు (ఒక కప్పు లేదా 150 గ్రాములు) A, C, K విటమిన్లు, ఫోలేట్, పొటాషియం ని కలిగి ఉంటాయి. టమోటాలు సహజంగా సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్, కాలరీలను తక్కువగా కలిగి ఉంటాయి. టమోటాలు మంచి ఆరోగ్యానికి అవసరమైన థయామిన్, నియాసిన్, విటమిన్ B6, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్ ని కూడా అందిస్తాయి.

దీనికి అదనంగా, ఒక కప్పు టమోటాలు ప్రతిరోజూ సిఫార్సుచేయబడిన 7% ఫైబర్ లో 2 గ్రాముల ఫైబర్ ని మీకు అందిస్తుంది. టమోటాలు సాపేక్షంగా ఆహరం నింపడానికి ఏర్పడే అధిక నీటిని కూడా కలిగిఉంటుంది. సాధారణంగా మనం తినే అనేకరకాల పండ్లు, కూరగాయలు, టమోటాలతో సహా అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్ట్రోక్ లు, గుండె జబ్బుల నివారణకు రక్షణను సూచిస్తుంది.

ఒక టమోటా ఒక శక్తివంతమైన పోషణను అందిస్తుంది, కానీ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి!

ఆరోగ్యవంతమైన చర్మం

ఆరోగ్యవంతమైన చర్మం

టమోటాలు మీ చర్మం చక్కగా కనిపించేటట్టు చేస్తుంది. కారెట్, స్వీట్ పొటాటో లో కనిపించే బీటా-కెరోటిన్ కూడా సూర్యుని పగుళ్ళ నుండి మీ చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. టమోటాలలోని లైకోపెన్ కూడా గీతలు, ముడతలకు కారణమైన UV కాంతి హానినుండి చర్మ౦ తట్టుకునేట్టు తయారుచేస్తుంది.

గట్టి ఎముకలు

గట్టి ఎముకలు

టమోటాలు ఎముకలను గట్టిగా చేస్తాయి. టమోటాలలో ఉండే విటమిన్ K, కాల్షియం ఎముకలను సరిచేయడానికి, బలంగా చేయడానికి ఇవి రెండూ బాగా పనిచేస్తాయి.

లైకోపెన్ కూడా ఆస్టియోపొరోసిస్ నివారణకు మంచి మార్గమైన బోన్ మాస్ ని మెరుగుపరుస్తుంది.

కాన్సర్ పై పోరాడుతుంది

కాన్సర్ పై పోరాడుతుంది

టమోటాలు సహజ కాన్సర్ ఫైటర్. లైకోపెన్ (మరలా) ప్రోస్టేట్, సెర్వికల్, మౌత్, ఫారింక్స్, గొంతు, ఎసోఫాగాస్, పొట్ట, కొలోన్, రెక్తల్, ప్రోస్టేట్, ఓవరియన్ కాన్సర్ వంటి అనేకరకాల కాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది. టమోటాల లోని యాంటీ-ఆక్సిడెంట్లు (విటమిన్ A, C) కణాల హానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ పై పోరాడతాయి.

బ్లడ్ షుగర్

బ్లడ్ షుగర్

టమోటాలు మీ బ్లడ్ షుగర్ ని సమతుల్యంలో ఉంచుతాయి. బ్లడ్ షుగర్ నియంత్రణకు సహాయపడే క్రోమియమ్ కు టమోటాలు మంచి మూల౦.

దృష్టి

దృష్టి

టమోటాలు మీ దృష్టిని కూడా మెరుగుపరుస్తాయి. టమోటాల లో ఉండే విటమిన్ A దృష్టిని మెరుగుపరిచి, రేచీకటి నివారణకు కూడా సహాయపడుతుంది. టమోటాలు తీసుకోవడం వల్ల తీవ్రమైన, తిరిగి తీసుకురాలేని క౦టి స్థితిని, దృష్టి లోపాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని ఇటీవలి పరిశోధనలో తెలిసింది.

జుట్టు

జుట్టు

టమోటాలు మీ జుట్టుని కూడా చక్కగా కనిపించేటట్టు చేస్తాయి. టమోటాలలో ఉండే విటమిన్ A మీ జుట్టు గట్టిగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. (సారీ, టమోటాలు జుట్టు సన్నబడడానికి ఎక్కువగా సహాయపడవు - జుట్టు బాగా కనిపించేటట్టు చేస్తాయి!)

టమోటాలు

టమోటాలు

మూత్రపిండాల్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళను అడ్డుకుంటాయి

టమోటాలు మూత్రపిండాల్లో రాళ్ళు, పిత్తాశయంలో రాళ్ళను నివారించడానికి సహాయపడతాయి. మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ళు గింజలులేని టమోటాలు తినే వారిలో చాలా తక్కువగా ఏర్పడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

దీర్ఘకాలిక నొప్పి

దీర్ఘకాలిక నొప్పి

టమోటాలు దీర్ఘకాలిక నొప్పులను తగ్గిస్తాయి. తక్కువ నుంచి ఒకమోస్తరు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే (వెన్నునొప్పి లేదా కీళ్ళనొప్పుల వంటి) మిలియన్ల మందిలో మీరూ ఒకరైతే, టమోటాలు నొప్పులను దూరంచేస్తాయి. టమోటాలు బాధనివారక కారకాలుగా చెప్పబడే బయో ఫ్లావనాయిడ్లు, కేరోటినాయిడ్లను అధికంగా కలిగిఉంటాయి.

దీర్ఘకాలిక నొప్పి తరచుగా దీర్ఘకాలిక శోధనను కలిగిఉంటుంది, అందువల్ల ఆ దీర్ఘకాలిక నొప్పిపై పోరాడడానికి శోధనపై దాడిచేయడ౦ మంచి మార్గం. (నొప్పిపై పోరాడే అనేక వాణిజ్య మందులు నిజానికి బాధనివారక మందులు.)

బరువు తగ్గడం

బరువు తగ్గడం

టమోటాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు తేలికైన ఆహరం, వ్యాయామ ప్రణాళికలో ఉంటే, మీ రోజువారీ ఆహారంలో టమోటాలను ఎక్కువగా తీసుకోండి. ఇవి సలాడ్లు, కాసేరోల్స్, సాండ్ విచ్, ఇతర పదార్ధాలలో "ఎక్కువ మోతాదులో" ఉపయోగించే, మంచి స్నాక్ గా తయారవుతుంది. టమోటాలు నీరు, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వల్ల వెయిట్ వాచర్లు వీటిని "ఫిల్లింగ్ ఫుడ్" అని పిలుస్తారు, ఎక్కువ కాలరీలు, కొవ్వులేకుండా వేగంగా పొట్టనింపే ఆహారాలలో ఇది ఒకటి.

English summary

9 Surprising Health Benefits of Tomatoes

Tomatoes! They’re sweet, juicy, and delicious. Everyone knows they are good for you, right? Uh, yeah, sure. Does everyone know specifically why tomatoes are a healthful food? Ummm… They have vitamin C? They’re low in calories? They’re fat-free? Yes, yes, and yes, but that’s not all!
Desktop Bottom Promotion