Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఈ చెడు అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా..!?
సాధారణంగా మనలో ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అవాట్లు, కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. కానీ, కొన్ని చెడు అలవాట్లకు మనం కావాలని అలవాటు పడం. కానీ మనకు తెలియకుండానే కొన్ని పనులుచేస్తూ అలవాట్లుగా మార్చుకుంటాం. అది మానవి సహజం ఉదాహరణకు: గోళ్ళు కొరకడం..ఒక్కోక్కో సందర్భంలో కొన్ని చెడు అవాట్లే ఆరోగ్యానికి మంచి చేస్తాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
మీ చెడు అలవాట్లును మానుకోమని ఎవరైనా మీతో చెప్పారా? ఖచ్చితంగా చెప్పేఉంటారు. మనకు కాకపోయినా, మన ఇంట్లో వారికో, స్నేహితుల వద్ద లేదా బంధువుల వద్ద ఈ విషయాన్ని వినేఉంటాం. అలాగే మీరు ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కొన్ని చెడు అలవాట్లు నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా అని ఆశ్చర్య పడుతారు. కాబట్టి, కొన్ని చెడు అవాట్లను మీరు మానుకోకుండా చేసే సమయం మీకు దొరికిందనుకోండి. కొన్ని చెడు అవాట్లును క్రింది లిస్ట్ చేయబడ్డాయి. అవి మీ జీవితంలో కొంత మార్పును తీసుకురావచ్చు లేదా వేరే రకంగా ఉపయోగపడవచ్చు.
మీ జీవితంలో అలవాటు పడ్డ కొన్ని బ్యాడ్ హాబిట్స్ ఒక కప్పు టీ తాగిన తర్వాత అదనంగా మరో కప్పు టీ తాగాలనుకోండం లేదా చాక్లెట్లు అధికంగా తినడం వంటి అలవాట్లు చాలా మందిలో ఉంటాయి. ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు అదనంగా మరో కప్పు కాఫీనీ తాగాలనిపిస్తుంది. అయితే ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు, ఆ ఒత్తిడిని హ్యాండిల్ చేయడానికి రెండు, మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ లేదా టీ తాగాలనిపించినప్పుడు అది బ్యాడ్ హాబిట్ అవుతుంది. అందుకు కారణం కాఫీ టీలలోని అదనపు కెఫిన్ మన శరీరంలో చేరడం అది మన శరీరానికి హాని కలిగిస్తుంది.
అందువల్ల, ఆరోగ్యానికి మంచిచేసే కొన్ని చెడు అలవాట్లు ఒక్కడ కొన్ని ఉన్నాయి, వాటిని పరిశీలించి, మనలో ఏఏ చెడు అలవాట్లు ఉన్నాయో గుర్తు చేసుకోండి. మీరు ఇప్పుడు, ఆ చెడ్డ అలవాట్ల కులుకు చేయవచ్చు. ఎందుకంటే అన్ని చెడు అలవాట్లు కాకపోవచ్చు. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
గోళ్ళు కొరకడం: మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా మనలో చాలా మంది ఈ చెడు అలవాటుకు అలవాటు పడి ఉంటారు. కానీ కొన్ని పరిశోదనల ప్రకారం, గోళ్ళుకొరకడం ఆరోగ్యానికి మంచివే అని చెబుతున్నాయి. ఎందుకో మీకు తెలుసా?గోర్లు కొరకడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెంచుతుందని విశ్వసిస్తారు. కనుక, మీరు ఈ చెడు అలవాటును సాధారణంగా చేస్తుంటే, ఇది సమర్థవంతంగా రోగనిరోధకత పెంచడంలో చిన్న మొత్తంలో బహిర్గతం అవుతుంది.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
గ్యాస్: కొంతమందికి అప్పుడప్పుడూ గ్యాస్ వెళుతుంటుంది. దాంతో వారి పక్కన ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంత మంది గ్యాస్ బయటకు వదలడానికి చాలా ఇబ్బంది కరంగా ఫీల్ అవుతారు. కానీ తప్పని సరి పరిస్థితుల్లో గ్యాస్ బయటకు వదలడానికి సిగ్గుగా భావించరు. ఈ చెడు అలవాటు ఆరోగ్యానికి ఒక రకంగా మంచే చేస్తుంది. ఎందుకంటే గ్యాస్ ను ఎప్పుడైతే బయటకు వదిలేస్తారో అప్పుడు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది. సమయానికి మీరు గ్యాస్ వదలకపోగా అలాగే కంట్రోల్ చేసుకోవడం వల్ల కడుపులోపల పెద్దప్రేగులు చాలా సున్నితంగా మారి, తర్వాత ఇది రెగ్యులర్ సమస్యగా మారుతుంది.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
నెటికలు తీయడం(నెటికలు ఇంచడం): కొన్ని, నెటికలు ఇంచడం చాలా చెడ్డ అలవాటుగా పరిగణిస్తారు. కానీ, ఈ చెడు అలవాటే మన ఆరోగ్యానికి మంచిది, ఎందుకంటే ఇలా చేయడం వల్ల మన శరీరంలోని, చేతుల్లోని కీళ్ళు చాలా ఫ్రీగా మరియు అనువైన అనుభూతిని చెందడానికి సహాయపడుతాయి. అయితే, కొంత మంది కీళ్ళు బలహీనపడుతాయని చెబుతుంటారు. అది ఎంత మాత్రం వాస్తవం కాదు.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
ఉమ్మడం: మన ఎదురుగా ఎవరైన ఉమ్ముతుంటే మనం చాలా ఇబ్బంది కరంగా అనుభూతి చెందుతాం. ఇది ఒక చెడు అలవాటుగా భావిస్తాం. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉమ్మడం వల్ల శ్వాసతీసుకోవడం చాలా తేలికఅవుతుంది. మన నోటికి ఎప్పుడైతే వ్యాయామం కల్పిస్తామో. గొంతులో సెలివా ఉత్పత్తి అవుతుంది దాన్ని ఉమ్మివేడయం వల్ల తేలికగా అనుభూతి చేంది, శ్వాస పీల్చుకోవడానికి బెటర్ గా ఫీల్ అవుతారు.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
ముక్కులో వేలు పెట్టడం: నిజానికి ఇది ఒక వరస్ట్, చెడ్డ అలవాటు కానీ, ఆరోగ్యానికి మేలుచేసే చెడ్డ అలవాట్లలలో ఇది ఒకటి. కొందరినికి ఇది ఆశ్చర్యం కలగవచ్చు! దీనికి కారణం, మీరు ముక్కులో వేలు పెట్టి కదులుట వలన అది మీ మెదడుకు వ్యాయామంలా పనిచేస్తుంది. కాబట్టి, ముక్కులో వేలు పెట్టడం కూడా ఒక మంచి అలవాటుగానే పరిగణించాలి.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
అధిక నిద్ర: సాధారణంగా చాలా ఇల్లలో, నిద్ర ఒక నిషిద్ధంగా పరిగణించబడుతుంది. కానీ, అధిక నిద్ర కూడా ఒక రంగా హెల్తీనే. వారంలో ఒకసారి అధిక నిద్ర పొందడం అనేది బ్యాడ్ హ్యాబిట్ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల దీర్ఘకాల జ్ఝాపకశక్తి పెంచుతుంది.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
బెడ్ మీదే బ్రేక్ ఫాస్ట్: కొంత మంది నిద్రలేవగానే, వ్యాయామం, స్నానం ఇటువంటివేవి లేకుండానే బ్రేక్ ఫాస్ట్ చేసేస్తుంటారు. ఇది చెడు అలవాటే అయినా, ఆరోగ్యానికి ఒక రకంగా మంచిది. జీర్ణశక్తిని పెంచుతుంది.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
వ్యాయామాన్ని స్కిప్ చేయడం: అవును, వ్యాయామం మన ఆరోగ్యానికి మంచిది. కానీ, రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారు, ఎప్పుడైన మర్చిపోతే అది ఒక రకంగా ఆరోగ్యానికి మంచిదే కండరాలకు కొంత బ్రేక్ కలిగించి, కండరాలకు కొంత విశ్రాంతి కల్పించినట్లవుతుంది. తర్వాత సెషన్ కు మరింత బలంగా మార్పు చెందుతాయి.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
త్రేనుపు: ఈ చెడు అలవాటు అమర్యాదకరమైనది అయినా, ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. త్రేనుపు వచ్చినప్పుడు త్రేన్చకపోతే అది గుండెల్లో మంటగా మారి తర్వాత ఛాతీ నొప్పికి దారితీస్తుంది. అందువలన, త్రేన్చడం ఆరోగ్యానికి మంచిది భావించి దాన్ని అణచివేయడానికి ప్రయత్నించకూడదు.

ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని చెడు అలవాట్లు..!
చూయింగ్ గమ్: ఎవరైనా చూయింగ్ గమ్ తింటూ మాట్లాడుతుంటే మనకు చిరాగ్గా అనిపించవచ్చు. లేదా ఎదుటి వారికి ఇబ్బందికరంగా అనిపించవ్చు.కానీ ఇది ఆరోగ్యానికి మంచి. ఇది బ్రెయిన్ పవర్ ను పెంచడానికి సహాయపడుతుంది మరియు ఆకలి కోరికను అదుపుచేస్తుంది.



Click it and Unblock the Notifications