For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎయిడ్స్ -హెచ్ఐవి మీద కొన్ని అపోహలు..!

By Derangula Mallikarjuna
|

భారతదేశంలో చాప కింద నీరులా ఎయిడ్స్ వ్యాపిస్తోందని గత దశాబ్దంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. అప్పట్లో ఎయిడ్స్ గురించ అనేక అపోహలు ప్రజలలో ఏర్పడినా అదంతా మంచికే జరిగినట్టయ్యింది. ప్రభుత్వ ప్రచారం వల్ల కూడా ఎయిడ్స్ గురించి అవగాహన మరీ పెరిగింది. అయినా కొన్ని వదంతులు మాత్రం ఇంకా ప్రచారంలో ఉంటూనే ఉన్నాయి. అందులో మరీ ప్రముఖంగా పేర్కొనవలసింది... హేర్ఫిస్ వంటి సుఖవ్యాధులు ఎయిడ్స్ గా రూపాంతరం చెందుతాయనేది. నిజానికి ఏ సుఖవ్యాధీ కూడా ఎయిడ్స్ గా రూపాంతరం చెందడమనేది జరగదు.

ఎయిడ్స్ కారక వైరస్ వేరు, మిగిలిన సుఖ వ్యాధులకు కారణమైన వైరస్ వేరు. ఇతర వైరస్ లు ఎయిడ్స్ వైరస్ గా మారడమనేది జరగదు. కాకపొతే ఎయిడ్స్ వైరస్ లోనే గుణగణాల రీత్యా కొన్ని తేడాలుండడం, వైరస్ కొన్ని మార్పులకు తరచూ లోను కావడం వల్ల వ్యాక్సిన్ రూపొందించడం కష్టంగా మారిందన్నది నిజమే. ఇటీవల ఎయిడ్స్ వ్యాక్సిన్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించినా అది పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇవ్వగలదా అనే విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. ఒకవేళ మంచి ఫలితాలను ఇవ్వగలిగినట్లయితే ఒక మహమ్మారి వ్యాధి నుంచి మానవాళికి విముక్తి కలిగినట్ట్టే.

AIDS

ఎయిడ్స్ -హెచ్ఐవి మీద కొన్ని అపోహలు

1. పటైటిస్‌ బి రాకుండా ఏమైనా చేయొచ్చా?

హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి, రెండూ, ఎయిడ్స్‌ ఎలా వ్యాప్తి చెందుతుందో, అలాగే వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఎయిడ్ప్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవే జాగ్రత్తలు, వీటికి కూడా వర్తిస్తాయి. అవి సురక్షితమైన సెక్స్‌లోనే పాల్గొనటం, ఒకేభాగస్వామితో జీవించటం, కలుషితమైన సూదులు వాడకుండా ఉండటం, క్షురకర్మ, ఆక్యు పంక్చర్‌ మొ|| వాటికి వెళ్ళేటప్పుడు మన సామాన్లే తసుకెళ్ళటం, టీకా వేయించుకోవటం మొ||వి.

2. హెపటైటిస్‌ 'బి' ఎయిడ్స్‌ కంటే ప్రమాదమా?

దురదృష్టవశాత్తు కొన్ని మందుల కంపెనీల, టీకా తయారీదారుల ప్రచారంతో, హెపటైటిస్‌, ఎయిడ్స్‌ కంటే ప్రమాదమని ప్రచారం జరిగింది. ఇది ఎంతమాత్రం నిజం కాదు. అయితే ఎయిడ్స్‌ కంటే హెపటైటిస్‌ త్వరగా వ్యాప్తి చెందుతుంది. హెపటైటిస్‌ వ్యాప్తిచెందకుండా టీకాలు ఉన్నాయి. ఎయిడ్స్‌కి టీకాలేదు. హెపటైటిస్‌ 'సి'కి కూడా టీకాలేదు. అయితే ఈ ప్రచారం వల్ల కొంత మంచి జరిగింది. ఎందు కంటే దీని వలన ప్రజలలో హెపటైటిస్‌ గురించి అవగాహన కలిగింది. చాలాసార్లు ఎంతో భయపడితే తప్ప ఎవరూ ఇలాంటి వ్యాక్సిన్‌లు తీసుకోరు. ఈ ప్రచారం వలన ఈ రోజు అనేక మంది వాక్సిన్‌ తీసుకుంటున్నారు.

3. వ్యాక్సిన్‌ ఎవరు వేయించుకోవాలి?

థారులాండ్‌లో, అప్పుడే పుట్టిన పిల్లలందరికీ వ్యాక్సిన్‌ వేడయం ద్వారా చాలా వరకు హెపటైటిస్‌ ను అరికట్టగలగారు. మనదేశంలో కూడా బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా ఇప్పుడు పుట్టిన పిల్లలందరికీ హెపటైటిస్‌ బి కి టీకాలు వేస్తున్నారు. దీని ఫలితా లు మరికొద్దికాలంలో అందుబాటులోకి వస్తాయి.

ఇంతేకాక హెపటైటిస్‌ 'బి' కొంతమందిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ల్యాబ్‌లో పనిచేసే వాళ్ళలో, రక్తపరీక్ష చేసేవాళ్ళలో, డాక్టర్లలో, నర్సులలో ఈ వ్యాప్తి ఎక్కువ. అందుచేత వీళ్లంతా తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. అలాగే, భాగస్వామికి హెపటైటిస్‌ ఉంటే కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. హెపటైటిస్‌ సోకిన రోగికి రక్త విరోచనాలు, రక్తపు వాంతులు అవుతుంటే గ్లవ్స్‌ వేసుకుని నర్సింగ్‌ చేయాలి. ఇలా చేసేవాళ్ళు, చేయాల్సి అవసరం ఉండే వాళ్ళు కూడా చేయించు కోవాలి. అంతేకానీ ఎవరు పడితే వాళ్ళు అందరూ వేయించుకోవాల్సిన అవసరంలేదు.

4. హెపటైటిస్‌ ఉంటే మరణమేనా?

పుట్టిన ప్రతి జీవి చావకతప్పదు. ఇది వరకే చర్చించాం. అనేక మందిలో హెపటైటిస్‌ అంతగా హాని చేయదు. కొద్దిమందిలో ఇది ప్రమాదకరమైన సిర్రోసిస్‌కు దారితీయవచ్చు. అంతకంటే ప్రమాద కరమైన, అతితేలిగ్గా వ్యాప్తి చెందే అనేక జబ్బులు మన మధ్య ఉన్నాయి. అతిసారవ్యాధులు, మలేరియాలు, చికెన్‌గున్యాలు, డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే, దోమల వ్యాప్తిని అరికడితే, నీరు, ఆహారం, కలుషితం కాకుండా చూసుకుంటే ఇలాంటి వ్యాధులన్నిటినీ అరికట్టవచ్చు. వీటిల్లో హెపటైటిస్‌ ఎ, హైపటైటిస్‌ ఇ కూడా ఉన్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు నోటి ద్వారా, ఆహారం ద్వారా వ్యాప్తి చెందగల హెపటైటిస్‌ ఇ సోకితే మరింత ప్రమాదం.

5. ఎయిడ్స్ రావడానికి అవకాశాలేమిటి?

సెక్స్ సంబంధాలు, రక్తమార్పిడి, కొన్ని సందర్భాలలో బ్లేడ్స్ వంటివి వాడడం వల్ల ఇవేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెబుతున్నారు డాక్టర్లు. అంగ చూషణం వల్ల, ఆ సమయంలో వీర్యాన్ని సేవించినా ఎయిడ్స్ వచ్చే అవకాశాలను బొత్తిగా తీసిపారేయలేమని వారు అంటున్నారు. ముఖ్యంగా నోటిలో పుండ్లు ఉన్నవారు, నోటి పూట వంటివి ఉన్నవారు ఇలా చేస్తే ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారు అన్గాచూషణ చేస్తే ఎయిడ్స్ మాత్రమే కాకుండా ఎదుటి వారికి ఏ సుఖ వ్యాధులున్నా అవి సోకే ప్రమాదమున్నదని స్పష్టంగా తెలిసింది. భారత దేశంలో ఎయిడ్స్ వ్యాపించే వేగం ఇటీవల తగ్గుముఖం పట్టిందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

6.తల్లి నుండి బిడ్డకు హెచ్ఐవి సోకుతుందా?

తల్లిపాలలోని సుగర్ మిశ్రమాలు శిశువులకు హెచ్ఐవి సోకడాన్ని తగ్గిస్తాయని ఓ ప్రయోగశాల అధ్యయనం సూచిస్తున్నది. అలా అని హెచ్ఐవి పాజిటివ్ తల్లులు, తమ పిల్లలకు రొమ్ము పాలు పట్టవచ్చని ఈ అధ్యయనం చెప్పడం లేదు. తల్లిపాల ద్వారా శిశువులకు వైరస్ సోకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణీ సమయంలో, ప్రసవ సమయంలో, పాలిచ్చే దశలో ఎప్పుడైనా బిడ్డకు వైరస్ సంక్రమించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో హెచ్ఐవి వున్న తల్లినుంచి బిడ్డకు వైరస్ సోకే అవకాశాలు 25 నుంచి 45 శాతం వరకు వున్నాయి. హెచ్ఐవి వున్న తల్లి బిడ్డకు ఇచ్చే స్తన్యం ద్వారా వైరస్ సంక్రమించే అవకాశాలు 15 శాతం పెరుగుతాయి. తల్లి ఎంతకాలం బిడ్డకు పాలిస్తుందనే అంశం సైతం వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేసుంది గానీ దీనిపై శాస్త్రజ్ఞులు మరింత లోతుగా పరిశోధన చేస్తున్నారు.

English summary

Common myths about AIDS

There are many myths associated with HIV (Human Immunodeficiency Virus). Most people don't have the right knowledge about it. People think that they can get infected with HIV even if they spend time with other HIV positive people. Myths like mosquito bites and touching HIV positive people can transmit HIV still exist.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more