For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం హానికరమా..? కాదా..?

|

ఈ మద్య కాలంలో ఈ సిగరెంట్ గురించి వినే ఉంటారు. ఈ సిగరెట్ అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ ఇది మామూలు సిగరెట్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి దూమపాన ప్రియులకు కోసం సృష్టించబడింది. ఇ- సిగరెట్లు అనేవి సిగరెట్ వలెనే ఉంటాయి. కాని ఎలక్ట్రానిక్ సహాయంగా తయారు చేయబడ్డాయి. అవి ఖచ్చితంగా సిగరెట్ లానే ఉంటాయి. కాని వాటిలో పొగాకు బదులుగా ఒక హీటర్ మరియు నీటితో నింపిన ఒక చిన్న పైప్ ఉంటుంది. సిగరెట్ వేడి ఎక్కే కొలది అందులోని నీరు ఆవిరిగా మారుతుంది. దానిలోని కొద్దిపాటి నికోటిన్ ఆవిరిలో కలసి బయటకు వస్తూంటుంది. దానితో సిగరెట్ తాగేవారికి ఆ వాసన వచ్చి తాగాలనే ధ్యాస కలిగించుకుంటారు.

సిగరెట్లు తాగే అలవాటును మానుకునే క్రమంలో వినియోగిస్తున్న ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లను అదే పనిగా ఉపయోగించటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారీతీసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో బ్రిటన్ ప్రభుత్వం వాటిని రద్చు చేసే యోచనలో పడింది. వివరాల్లోకి వెళితే.. నికోటిన్‌తో కూడిన నీటి ఆవిరిని పీలుస్తూ సిగరెట్ వ్యసనపరులు ఎలక్ట్రానిక్ సిగరెట్ ద్వారా ఉపశమనం పొందుతున్నారు. సిగరెట్లను వదిలిపెట్టే పేరుతో వీటిని అదే పనిగా వాడడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉందని వార్తలు వస్తుండడంతో వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ వైద్యాధికారులు భావిస్తున్నారు. ఇరవై లక్షల మంది ఎలక్ట్రానిక్ సిగరెట్లను వినియోగిస్తున్నట్లు అంచనా. వారిలో ఆరున్నర లక్షల మంది నిత్యం వాడుతున్నారని సమాచారం. దీంతో ఇకపై వైద్యులు సూచిస్తే తప్ప వీటిని విక్రయించరాదని అక్కడి అధికారులు ఆంక్షలు విధించారు.

చాలా చీఫ్ గా దొరికే ఈ చీపర్ సిగరెంట్ ఆరోగ్యానికి మంచిదని మరియు ఎటువంటి చెడు వాసనా ఉండదని, సెకెండ్ స్మోక్ అని మరియు క్యాన్సర్ కు దారితీసే కెమికల్స్ లేవని అంటారు. కానీ ఇది ఎంత వరకూ నిజం? ఈ సిగరెట్' పరికరంతో పొగ తాగడం వలన ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని సైంటిస్టులు తేల్చేశారు. 'ఈ సిగరెట్' పరికరాలు పొగ కాకుండా.. ఆవిరి రూపంలో నికోటిన్ ను విడుదల చేస్తాయి. ఈ సిగరెట్ లో వాడే పొగాకులో కాల్చని నికొటిన్ ఉండటం వలన ఆరోగ్యానికి హనికరమని సాక్ష్యాలను సేకరించారు. మరి ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ బల్ల శరీరానికి కలిగే సైడ్ ఎఫెక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

టైంపాస్ గా మొదలైన సిగరెట్టు వ్యాపకం.. మితీమీరి పోతుంది. అంతేకాక ఆరంభంలో నేను రెండు పెట్టెల సిగరెట్ ప్యాకెట్లను లాగిస్తానోయో అంటూ అదేదో గొప్పలా చెప్పుకుంటారు.. అలా మొదలైన అలవాటు 'సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరలు తాగె సిగరెట్టు..', సిగరెట్ చివరి దమ్ము.. ప్రియురాలితో మొదటి.. అంటూ ధూమపాన ప్రియులు రింగు రింగులా చేసి గాల్లోకి వదులుతూ...ప్రపంచాన్ని జయించినంత ఆనందపడిపోతుంటారు.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఆరంభంలో సిగరెట్టును కాల్చేస్తున్నామన్న భ్రమల్లో ఉంటారు. కాని సిగరెట్టు నీ జీవితాన్ని కాల్చేసిందని.. డాక్టరు గారు సెలవిచ్చేదాకా ఎవ్వరూ గ్రహించలేకపోతారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ వల్ల నికోటిన్ శరీరంలోనికి చేరదు.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతాయి. ఈ సిగరెట్' పరికరంతో పొగ తాగడం వలన ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని సైంటిస్టులు తేల్చేచారు. 'ఈ సిగరెట్' పరికరాలు పొగ కాకుండా.. ఆవిరి రూపంలో నికోటిన్ ను విడుదల చేస్తాయి. ఈ సిగరెట్ లో వాడే పొగాకులో కాల్చని నికొటిన్ ఉండటం వలన ఊపిరిత్తులకు చాలా హాని కలిగిస్తుంది.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ లో ఎంత నికోటిన్ ఉంటుంది తెలియదు. ఇ సిగరెట్ వినియోగదారులు ఇ సిగరెట్లు సురక్షితమా లేదా కాదా అని తెలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదు. అయితే, ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఉపయోగించే సిగరెట్లు కంటే ఇందులో ఎటువంటి హానికరమైన రసాయనాలు ఉన్నవాలేవా అని ఖచ్ఛితం తెలుసుకోవాలి .

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ వల్ల శరీరానికి ఇతర చెడు ప్రభావాలు, ఈ సిగరెట్లో ఉండే యాంటీ ఫ్రీజ్ కాంపోనెంట్ దీన్నే డైఈథలిన్ గ్లైకోల్ అంటారు. ఇవి శరీరంలో టాక్సిన్స్ కు కారణం అయ్యి, అది పీల్చడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. ఇది ఎలక్ట్రానిక్ సిగరెట్ వల్ల అతి పెద్ద మరియు ప్రముఖ చెడు ప్రభావాల్లో ఒకటి.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్ ను కలిగించదు. కానీ, ఎలక్ట్రానిక్ సిగరెట్ వల్ల, సాధారణ సిగరెట్ గుండె ఆరోగ్యం మీద ఏలా ప్రభావం చూపిస్తోందో..అదే విధంగా ఈ సిగరెట్ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ సిగరెట్ లో క్యాన్సర్ కారక సమ్మేళనాలు నైట్రోసెమినేస్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ బ్రేక్ అయితే ఈ హానికరమైన సమ్మేళనాలు బహిర్గతం అవుతాయి.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ లో టెట్రామీథైల్పైరోజిన్ కలిగి ఉంటుంది. టెట్రామీథైల్పైరోజిన్ ఒక దీర్ఘకాలం పాటు తాగడం వల్ల వ్యక్తి యొక్క మెదడు మీద ప్రభావం చూపెడుతుంది. అందువల్ల ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ వినియోగాన్ని నివారించడం ఉత్తమమైన మార్గం.

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

ఎలక్ట్రానిక్ సిగరెట్ తాగితే అపాయం లేదా?

పొగతాగడం ఆరోగ్యానికి హనికరం అనే సిగరెట్ పెట్టెపై ఉన్నా.. మానలేక తాగుతున్నారంటే.. సిగరెట్ ప్రియుల ఎంతటి బలహీనత లోనయ్యారో తెలుసుకోవచ్చు. సిగరెట్ తాగని వారు వచ్చే జన్మలో దున్నపోతై పుడుతారని బయపడి సిగరెట్ ను అలవాటు చేసుకుంటే.. ఈ జన్మలో దున్నపోతు కంటే హీనంగా జన్మను ముగించాల్సి వస్తుందని గ్రహించాలి.. గ్రహించగలిగితే... చక్కగా సిగరెట్ ను మానేస్తారు.. 'ఈ సిగరెట్'.. ఆ సిగరెట్ అంటూ.. చూడకుండా.. నికొటిన్ చాక్లెట్ తినకుండా దూరంగా ఉండటానికి, కోర్కెలను జయిస్తామనే మనోధైర్యం మనిషిలో ఉంటే చాలు.. ఈ జన్మకు బాగుపడటానికి..

English summary

Effects Of Electronic Cigarette For Health

Have you heard of the well known and 'safe to use' electronic cigarettes? This electronic cigarettes which is considered a healthy option for smokers is now considered to be a threat! This electronic cigarettes has grabbed the attention of countless tobacco users from around the world.
Story first published: Tuesday, July 30, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion