For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొబ్బరి బోండాంలో ఉండే పోషకాంశాలు మీకు తెలుసా...!?

|

వేసవిలో కొబ్బరి బొండం నుండి నేరుగా కొబ్బరి నీళ్ళు తాగడం స్వర్గతుల్యం. దీనివల్ల ఉపశాంతే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ నీళ్ళలో విటమిన్లు, మినరల్సు, ఎలక్ట్రో లైట్స్, ఎంజైమ్ లు, ఎమినో యాసిడ్లు, సైటోకిన్ అధికంగా ఉన్నాయి. ఈ నీళ్ళు ఉపశాంతినిచ్చే వగరు రుచికి, దాని ఆరోగ్య ప్రయోజనాలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.

డయేరియ తగ్గిన తరువాత కొబ్బరినీళ్ళు చాలా ఉపయోగకరం, ఇవి నష్టపోయిన ఫ్ల్యూయిడ్స్ ని భర్తీచేస్తాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, ఎంజైములు, ఆహార ఫైబరు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంది, అదేవిధంగా ఇందులో క్లోరైడ్లు, కొలెస్ట్రాల్ తక్కువ.

కొబ్బరి నీళ్ళు ఎలక్త్రోలైట్ పొటాషియం ఎక్కువగా కలిగిఉండడం వల్ల ఇది శరీర ద్రవాలలో ఎలక్త్రోలైట్ ని తిరిగి భర్తీచేస్తుంది.

కొబ్బరి నీళ్ళు తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా ఉపయోగపడతాయి, ఇవి ప్రపంచంలో వైద్య సదుపాయం అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాలలో ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు పునరుజ్జీవనం అందిస్తాయి.

కొబ్బరినీళ్ళు తాగడం వల్ల బరువు తక్కువ, కొవ్వు తక్కువ ఉన్న వ్యక్తి అవి పూర్తిగా ఉన్నట్లు భావించడానికి సహాయపడుతుంది. ఇది ఆహార౦ ఎక్కువగా తీసుకోవాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి మంచిది, ఇది చక్కర స్థాయిలను నియంత్రింఛి మంచి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

Health Benefits of Coconut Water

ఒక వ్యక్తి శరీరం ఫ్లూ లేదా సలిపి రెండు రకాల వైరస్ ల బారిన పడినపుడు, కొబ్బరి నీళ్ళు వైరల్, బాక్టీరియాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి.

కొబ్బరినీళ్ళలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇది రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

కొబ్బరినీళ్ళ లోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాల లోని రాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా గొప్పగా తగ్గించవచ్చు.

మొటిమలు, మచ్చలు, ముడతలు, సాగిన గుర్తులు, సేల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్ళను రెండుమూడు వారాల పాటు రాసి వదిలివేస్తే, అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

కొబ్బరి నీళ్ళు వృద్ధాప్య నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. కొబ్బరి నీళ్ళలో సెలేనియం, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉన్నాయి, ఇవి కాన్సర్ పై పోరాటం చేస్తాయని ప్రయోగశాలలో రుజువైంది. కొబ్బరి నీళ్ళు కొలెస్ట్రాల్ ను, రక్తపోటును తగ్గిస్తాయని అనేక జంతు సంబంధ అధ్యయనాలు సూచిస్తున్నాయి, కానీ ఈ పరిశోధన దీని గురించిన వాదనలకు చాలా ప్రాధమికమైనది. కానీ ఇతర పానీయలతో పోలిస్తస్తే కొబ్బరినీళ్ళు సరైన ఎంపికగా అంగీకరించవచ్చు.

కొబ్బరి నీళ్ళలో ఆమ్ల ఫాస్ఫటేస్, కాటలేస్, డి-హైడ్రోజినేస్, డయాస్టేస్, పెరాక్సిడేస్, ఆర్ ఎన్ ఏ పాలిమేరాసేస్ లాంటి చాలా జీవ ఎంజైమ్ లు వుంటాయి. మొత్తం మీద ఈ ఎంజైమ్ లు అరుగుదలకు, జీవక్రియకు దోహదం చేస్తాయి.

పెద్దగా స్థిరత్వం లేనప్పటికీ, ఈ నీళ్ళలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్ లాంటి ఖనిజాలు నారింజ లాంటి పళ్ళ లో కన్నా ఎక్కువగా వుంటాయి. (నారింజ లోని ఖనిజ నిష్పత్తిని పోల్చి చూడండి.)

కొబ్బరి నీళ్ళలో రిబో ఫ్లావిన్, థయామిన్, పైరిడాక్సిన్, ఫోలేట్ లు లాంటి బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా దొరుకుతాయి. బయటి వనరుల నుంచి ఈ విటమిన్లు శరీరానికి చాలా అవసరమౌతాయి.

కొబ్బరి నీళ్ళలో ఎలెక్ట్రోలైట్ పొటాషియం పుష్కలంగా వుంటుంది. 100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీళ్ళలో 250 మిల్లీ గ్రాముల పొటాషియం, 105 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. ఈ రెండు ఎలేక్త్రోలైట్లు కలిసి శరీరంలో విరేచనాల వల్ల తగ్గిన ఎలేక్త్రోలైట్లను పునరుత్త్పత్తి చేస్తాయి. పైగా తాజా కొబ్బరి నీళ్ళలో కొంచెం సి విటమిన్ (యాస్కార్బిక్ ఆమ్లం) కూడా వుంటుంది. ఆర్ డి ఏ లో 2.4 మిల్లీగ్రాముల విటమిన్ సి ని ఇది అందిస్తు౦ది. విటమిన్ సి నీటిలో కరిగే యాంటి ఆక్సిడెంట్.

English summary

Health Benefits of Coconut Water | కొబ్బరినీళ్ళ వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు !!

Drinking coconut water straight from a green tender coconut in the summer heat is simply divine. Not only is it refreshing, it also has a number of health benefits. This water is rich in vitamins, minerals, electrolytes, enzymes, amino acids and cytokine. This water is now popular all over the world for its refreshing nutty taste as well as its health benefits.
Story first published: Friday, April 12, 2013, 12:18 [IST]
Desktop Bottom Promotion