For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెరకు రసంతో పెద్ద వ్యాధులు సైతం బలాదూర్...

|

చెరకు రసం లేదా చెరకు జ్యూస్ చూడగానే వెంటనే తాగేయాలనిపిస్తుంది. చెరకు పాలకు కొన్ని నిమ్మరసం ఐస్ ముక్కలు వేసి త్రాగితే ఆహా... ఎంత రుచిగా ఉంటుంది. గతంలో చెరకు లేదా చెరకు రసాన్ని పల్లెటూర్లలోనే చూస్తున్నాం. కానీ ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్ కేన్ స్టాల్స్ ఏర్పడ్డాయి. మనం అక్కడ చూస్తుంటాం. చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతుంటారు. మీకు తెలియాల్సిన ఓ ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇందులో ఆరోగ్యనానికి సహాయపడే గుణాలు చాలా ఉన్నాయి.

ఈ సంక్రాంతి రోజుల్లో ప్రతి ఇంటా చెరకు నిల్వ ఉంటుంది. పొంగల్ సెలబ్రేషన్స్ లో చరకు అతి ముఖ్యంగా ఉపయోగిస్తారు. పండుగ తర్వాత ఈ చెరకు గడలను పారవేయడం కంటే వాటిలో నుండి రసం తీసి మీ ఆరోగ్యనాకి కావల్సిన కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ చెరకు రసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినిరల్స్, విటమిన్స్, మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.

చెరకు రసం పిల్లలు, పెద్దల నోరూరించే చెరకు జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. చెరకు రసంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. తక్షణ శక్తినందించడం దీని ప్రత్యేకత. కొద్దిగా నిమ్మరసం, ఉప్పు మేళవించి చేసే చెరకు రసంలో పోషకాలు కూడా అధికంగానే ఉన్నాయి.

శీతల పానీయాలు, కోలాలతో పోలిస్తే ఇది నెమ్మదిగా రక్తంలోకి చేరుతుంది. శరీరంలో నీటిస్థాయి పడిపోకుండా జాగ్రత్తపడుతుంది. మూత్ర సంబంధిత ఇబ్బందులతో బాధపడే వారికి చెరకు రసం చక్కని పరిష్కారం. అంతే కాకుండా కొన్ని ప్రత్యేకమైన జబ్బులను ఇది నివారిస్తుంది. అవేంటో చూద్దాం...

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

కామెర్లకు విరుగుడు: సుగర్ కేన్ జ్యూస్(చెరకు రసం) కామెర్లును సహజంగా నయం చేసే ఒక ఔషధం. రక్తంలోని బిల్లిరుబిన్ కారణంగా కామెర్లు ఏర్పడి చర్మం పొరలుగా పసుపు రంగులోకి మారుతాయి. ఇది కాలేయ పనితీరు సరిగా లేకపోవడం మరియు పిత్తాశయ వాహికలు మూసుకుపోవడం వల్ల కామెర్లకు కారణం అవుతుంది. కాబట్టి దీని నుండి బయట పడటానికి ఒక గ్లాసు చెరకు రసంకి కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ప్రతి రోజూ తీసుకోవాలి.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

ఇన్ఫెక్షన్(వ్యాధులు): అనేక రకాల వ్యాదులు ఉదా: డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, కడుపు(జీర్ణ) లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు ఇటవుంటి వ్యాధులకు చెరకు రసం బాగా నయం చేయవచ్చు.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

కిడ్నీ(మూత్రపిండం)లో రాళ్ళు: చెరకు రసంతో ఇది చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. కాబట్టి ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు విచ్చినం చేయడానికి సహాయం చేస్తుంది. ఎక్కువ ద్రవాలను మరియు చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి చెరకు రసం ఉపయోగపడుతుంది.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

మధుమేహానికి: మధుమేహం ఉన్నవారికి షుగర్ కేన్ బాగా సహాయపడుతుంది . ఇది ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ షుగర్ కేన్ జ్యూస్ చాలా మంచిది. మీరు బరువు తగ్గించే పనిలో ఉన్నా లేదా డయాబెటిక్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

న్యూట్రిషియన్ బెనిఫిట్స్: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ. రుచితో పాటు అందుబాటులో కూడా ఉండే ఈ చెరకు రసంలో కార్బోహైడ్రేట్లు అపారం.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

జలుబు, జ్వరం మరియు గొంతు నొప్పి: మీరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

క్యాన్సర్ నివారిణి: ఇందులో ఆల్కలీన్ కలిగి ఉండటం వల్ల, చెరకు రసం ముఖ్యంగా ప్రొస్టేట్, కోలన్, ఊపిరితిత్తుల లేదా రొమ్మక్యాన్సర్, క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. 8. రీహైడ్రేషన్: సాధారణంగా మనలో చాలా మంది ఎక్కువగా నీరు త్రాగరు. దాంతో డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు. కాబట్టి శరీరంలో నీటిని నిల్వ చేయడానికి చెరకు రసం బాగా సహాయపడుతుంది. ఇంకా వేసవి కాలంలో చెరకు రసం త్రాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

నిర్జలీకరణం: శరీరం నుంచి అధిక మోతాదులో నీరు నష్టపోవడాన్ని నిర్జలీకరణం అంటారు. మన శరీరం లో ఉన్న వ్యవస్థలు పని చేయడానికి నిర్ణీత మోతాదులో నీరు అవసరం. కనీసం 8 గ్లాసుల నీరు రోజుకు అవసరం ఈ అవసరం మనిషి రోజు చేసే పని,వయసును బట్టి మారుతూ వుంటుంది. కాబట్టి నీటికి బదులుగా చెరకు రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తిని పొందవచ్చు.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

దంతక్షయానికి: పిల్లలు, పెద్దలు స్వీట్స్ , ఆహారం తీసుకొన్న తర్వాత చిగుళ్లలో ఉండిపోయి వాటి ద్వారా పళ్ళు సందుల్లో బ్యాక్టీరియా వ్యాపించి, ఈ బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలతో పళ్ళకు రంధ్రాలు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు రసం తీసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి, దంత క్షయాన్ని పోగొడుతుంది.

చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

బాడీ వెయిట్: చెరకు రసం తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత పెంచి, జీవక్రియలు క్రమంగా జరిగి శరీరపు బరువును క్రమబద్దంగా ఉంచుతుంది.

English summary

Health Benefits of Drinking Sugar Cane juice and Eating Sugar Cane | చెరకు రసంలో ఇన్ని మంచి గుణాలా...!

Sugarcane is a rich source of minerals, vitamins and antioxidants. We find many stalls that sell sugarcane juice. You might be amazed to know that the juicy extract of sugarcane sticks has many health benefits.
Desktop Bottom Promotion