For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిగుళ్ళలో రక్తస్రవానికి గృహ వైద్యం

By Super
|

పుల్లని పండ్లు, పాలు, పచ్చి కూరగాయలు, బేకింగ్ సోడా, లవంగాలు, లవంగా నూనె, సేజ్, పెప్పర్మేంట్ ఆయిల్, కలేన్డుల ఆకుతో టీ, చమోమిల్ టీ, సెలైన్, చిగుళ్ళను మసాజ్ చేయడం, పొగతాగకపోవడం, కొవ్వు ఆహారపదార్ధాలు వంటి గృహ వైద్యాలు చిగుళ్ళ రక్తస్రావాన్ని తగ్గిస్తాయి.

చిగుళ్ళలో రక్తస్రావం, బ్రష్ చేసినపుడు లేదా గట్టి ఆహారాన్ని తినేటపుడు తరచుగా రక్తం కారడం, చిగురు వాయడం కనిపిస్తే దానిని వైద్యపరమైనదిగా గుర్తించాలి. ఇది సాధారణంగా నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల కలుగుతుంది, లేదా కడుపుతో ఉండడం, విటమిన్ లోపం, స్కర్వి, లుకేమియా లేదా ఇతర అంటువ్యాధులు వంటి ఇతర ఆరోగ్య పరిస్థితులలో కూడా కలగవచ్చు. చిగుళ్ళలో రక్తస్రావాన్ని అందుబాటులోని గృహ వైద్యం ద్వారా తేలికగా నిరోధించవచ్చు, వీటిని అనుసరించడ౦ తేలిక, కొద్ది వారాలలోనే పళ్ళ పరిస్థితి మెరుగవడం కనిపిస్తుంది.

సాధారణంగా చిగుళ్ళలో రక్తస్రావం అంటే, ప్రతిరోజూ చిగుళ్ళలో రక్తం కారడం. ఇది సాధారణంగా ప్లేట్లేట్ డిసార్డర్ లేదా లుకేమియా వంటి తీవ్రమైన రోగాలను గుర్తించడానికి సహాయపడుతుంది. సరిగా శ్రద్ధ తీసుకోకపోతే; చిగుళ్ళవాపు, చిగుళ్ళ నొప్పికి దారితీస్తుంది. ఇది సరైన ఆరోగ్య పరిస్థితులను నిర్వహించుకోవడం వల్ల అదేవిధంగా తేలికైన గృహ వైద్యం వల్ల నివారణకు సాధ్యమౌతుంది.

క్రింది లక్షణాల ద్వారా చిగుళ్ళ రక్తస్రావాన్ని గుర్తించవచ్చు-
రక్తస్రావాన్ని బ్రష్ చేసేటపుడు లేదా ఉమ్మేటపుడు ఉమ్మిలో గుర్తించవచ్చు. ఒక రిచ్ ఫైబర్ లేదా ముతక ఆహార పదార్థం అలవాట్లు కూడా రక్త స్రావం దారితీస్తాయి, దుర్వాసనతో కూడిన శ్వాస వస్తుంది.
చిగుళ్ళలో రక్తస్రావాన్ని నిరోధించి అదేవిధంగా చికిత్సకి ప్రతిరోజూ సాధన చేసే అనేకరకాల గృహ వైద్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

పుల్లని పండ్లు:

పుల్లని పండ్లు:

చిగుళ్ళలో రక్తస్రవానికి విటమిన్ C లోపంకూడా ఒక కారణం. ఆరంజ్, నిమ్మ, వంటి పుల్లని పండ్లు, ప్రత్యేకంగా బ్రోకోలి, కాబెజ్ చిగుళ్ళలో రక్తస్రావాన్ని నిరోధించి, తగినంత విటమిన్ C ని తయారుచేస్తాయి.

పాలు:

పాలు:

పాలు కాల్షియాన్ని అధికంగా కలిగిఉంటుంది, ఇది చిగుళ్ళను పటిష్టపరచడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల చిగుళ్ళలో రక్తస్రావాన్ని నిరోధించడానికి ప్రతిరోజూ పాలు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది.

పచ్చి కూరగాయలు:

పచ్చి కూరగాయలు:

పచ్చి కూరగాయలు నమలడం వల్ల పళ్ళు శుభ్రపడతాయి, చిగుళ్ళలో రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది, అందువల్ల ప్రతిరోజూ పచ్చి కూరలు నమలడం అలవాటు చేసుకోండి.

క్రాన్బెర్రీ, గోదుమగడ్డి రసం:

క్రాన్బెర్రీ, గోదుమగడ్డి రసం:

చిగుళ్ళలో రక్త౦కారేవారు క్రాన్బెర్రీ లేదా గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. క్రాన్బెర్రీ రసం చిగుళ్ళను అంటిపెట్టుకుని ఉన్న బాక్టీరియాని తొలగించి అదేవిధంగా యాంటీబాక్టీరియల్ శక్తిని అందిస్తుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా నోటి ఆమ్లాలలో ఇరుకైన ప్రదేశంలో ఏర్పడిన బాక్టీరియాని చంపుతుంది, వేళ్ళ సహాయంతో దీనిని చిగుళ్ళపై పూయవచ్చు.

లవంగాలు:

లవంగాలు:

లవంగాలను నోట్లో పెట్టుకోండి లేదా నిదానంగా చప్పరించండి లేదా చిగుళ్ళపై లవంగాల నూనెను రాయండి. ఇది అన్ని రకాల పళ్ళ సమస్యలకు పురాతన కాలంనాటి తేలికైన గృహ వైద్యం.

సేజ్, పిప్పరమెంట్ ఆయిల్:

సేజ్, పిప్పరమెంట్ ఆయిల్:

సేజ్, పెప్పర్మేంట్ ఆయిల్ ని ఉపయోగించి బ్రష్ చేసినట్లైతే ఇవి నోటిని తాజాగా, శుభ్రంగా ఉంచుతాయి.

కలేన్డులా ఆకు, చమోమిల్ టీ:

కలేన్డులా ఆకు, చమోమిల్ టీ:

కలేన్డుల, చమోమిల్ ఆకులతో తయారుచేసిన టీ చిగుళ్ళలో రక్తస్రావానికి ఉపసమనాన్ని కలిగిస్తుంది.

సెలైన్:

సెలైన్:

పళ్ళు తోముకున్న తరువాత ఒక చిటెకెడు ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో పుక్కిలించండి. చిగుల్ల రక్తస్రావ చికిత్సకు ఇది మంచి గృహ వైద్యం.

మసాజ్:

మసాజ్:

బ్రష్ చేసిన తరువాత వేళ్ళతో చిగుళ్ళను మసాజ్ చేస్తే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఇది చిగుళ్ళను గట్టిపరిచి రక్తస్రావాన్ని నిరోధిస్తుంది.

కొవ్వు పదార్ధాలను మానేయండి:

కొవ్వు పదార్ధాలను మానేయండి:

అధిక కొవ్వు, స్పైసీ, అధిక ఆహరం పళ్ళ కావిటీస్ లో నిల్వ ఉండి, ఆహార వనరులను అందించే సూక్ష్మజీవులు చిగుళ్ళవాపు, చిగుళ్ళలో రక్తస్రావానికి దారితీసేలా చేస్తుంది. అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఈ కొవ్వు పదార్ధాలను మానుకోవాలి.

పొగతాగడం మానేయాలి:

పొగతాగడం మానేయాలి:

ధూమపానం కొన్ని బాక్టీరియాల వల్ల దుర్గంధం పెరిగే నోటి పరిస్థితులను తయారుచేస్తుంది. అందువల్ల మీ నోట్లో బాక్టీరియా పేరుకుపోకుండా ఉండడానికి ధూమపానాన్ని మానుకోవడం మంచిది.

English summary

Home remedies for bleeding gums

Home remedies for bleeding gums include citrus fruits, milk, raw vegetables, baking soda, cloves, clove oil, sage, peppermint oil, calendula leaf tea, chamomile tea, saline, massaging gums; avoid smoking and fatty food etc.
Desktop Bottom Promotion