For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ సులభ చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా బొజ్జ పెరగదు!

|

ప్రస్తుత జీవన విధానంలో రకరకాలుగా వస్తున్న మార్పులు అందుకు కారణం సరైన ఆరోగ్య నియమాలు పాటించకపోవడం. అంతేకాకుండా పని వేళల్లో తేడాలు అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. దీంతో ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇలాంటప్పుడు సరైన ఆహార నియమాలు పాటించకుండా ఎన్ని వర్కవుట్స్ చేసినా ఫలితం శూన్యం. నలభై ఏళ్లు దాటాక చాలా మంది మహిళలు, పురుషులు లావెక్కుతూ ఉంటారు. కొందరిక పొట్ట వస్తుంది. కారణం వారి శరీరంలో అదనంగా కొవ్వు వచ్చి చేరడమే. ఇలా చేరిన కొవ్వును కరిగించాలంటే వ్యాయామం చేయక తప్పదు. అయితే కేవలం వ్యాయామాల వల్లే కొవ్వు మొత్తం కరిగిపోదు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలను ఈ కొవ్వును కరిగించేందుకు తోడ్పడతాయి.

అధిక బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వీటిలో కొన్ని శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్ని సార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల భారీన పడకుండా క్రొవ్వు కరిగించుకొని పొట్టతగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. కొవ్వును కరిగించే కొన్ని ప్రభావవంతమైన ఆహరాలు కొన్ని ఉన్నాయి. అవి కనుక రెగ్యులర్ డైట్ లో చేర్చుకొన్నట్లైతే తప్పనిసరిగా, మీ శరీరంలో.. మీ నడుం చుట్టూ పేరుకొన్న అధనపు కొవ్వు తగ్గి ఖచ్చితంగా కొన్ని అంగుళాలు నడుము తగ్గడాన్ని మీరు గమనించవచ్చు.

శరీరంలో ఫ్యాట్ కరిగించాలంటే ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. చాలా మంది తీసుకొనే ఆహారం తగ్గించడం వల్ల బరువు తగ్గవచ్చు అనుకుంటారు. అయితే మీ వైయిట్ లాస్ ప్లాన్ లో కొన్ని ఆహారాలను చేర్చుకోవల్సినవి, రెగ్యులర్ డైట్ నుండి కొన్ని ఆహారాలను మినహాయించాల్సినవి కొన్ని ఉన్నాయి. ఉదా: డైటింగ్ లో ఉన్నానంటూ రెండు పకోడాలను తినేయకూడదు. ఫ్రై చేసిన ఆహారాలను తినడానికి బదులు, వాటి స్థానంలో ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్(సిట్రస్ పండ్లు మరియు ఉడికించిన ఆకుకూరాలు)తీసుకోవాలి. ఇవి ఆరోగ్యకరమైనవి మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతాయి. శరీరంలో అధిక కొవ్వు చేరకుండా, అదనపు కొవ్వును కరిగించడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో న్యూట్రిషన్ ఎక్స్‌ పర్ట్స్ చెబుతున్న సలహాలు...

లోకాలరీ ఫుడ్స్:

శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా. లోకాలరీ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గించడంతో పాటు గుండెను సురక్షితంగా ఉంచి, గుండె ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతుంది.

వ్యాయామం:

రెగ్యులర్ గా వ్యాయం చేయడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. శరీర అవయవాల్లో అదనంగా పేరుకొన్న కొవ్వు నిల్వలను కరిగిస్తుంది. ఉదా, తొడలు, బెల్లీ మరియు చేతి కండాల వద్ద ఉన్న అదనపు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

పంచదారను తగ్గించాలి లేదా పూర్తిగా నివారించాలి:

పంచదార పూర్తి శరీర ఆరోగ్యానికి శత్రువు వంటిది. శరీరం నుండి ఫ్యాట్ తగ్గించడంలో ఇంటి చిట్కాలలో ఇది ఒకటి, మీ డైలీ డైట్ నుండి పంచదారను తీసుకోవడం నివారించాలి. పంచదారకు బదులుగా తేనె లేదా బెల్లంను వాడుకోవాలి.

నీళ్ళు: నీరు :

ఇది ఆహారం కాకపోయినా, బరువు తగ్గేటందుకు సహకరిస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది. శరీరం లో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మీకు ఫలితం కనిపిస్తుంది. వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే కూడా బరువు తగ్గటంలో ఫలితాలు వేగంగా వుంటాయి. మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి, శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి నీళ్ళు బాగా సహాయపడుతాయి. భోజనానికి ముందు కొన్ని నీళ్ళు త్రాగడం వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి తక్కువగా తినేలా చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

చాలా మంది డైటీషియన్స్ ప్రకారం, వైయిట్ లాస్ డైట్ లో రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ ను చేర్చుకోవడం వల్ల, శరీరం నుండి కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఉప్పు తగ్గించాలి:

సోడియం శరీరంలో నీటిని తగ్గించేస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఉప్పు తీసుకోవడం తగ్గించండి. సోడియంకు ప్రత్యామ్నాయంగా హెల్తీ హెర్బ్స్ ను, చెక్క వంటి స్పైసీలను ఉపయోగించడం మంచిది.

విటమిన్ సి పెంచాలి:

విటమిన్ సి ఆహారాలు మన శరీరానికి కావల్సిన ఎనర్జీని అంధించడం మాత్రమే కాదు, శరీరం యొక్క జీవక్రియల రేటును పెంచుతుంది. క్యారెట్లు, సిట్రస్ పండ్లలో నిల్వ ఉండే విటమిన్ సి అందుకు బాగా సహకరించడంతో పాటు కొవ్వును కరిగిస్తుంది. మీ ఫ్లాబ్ తగ్గించడం కోసం ఆసక్తి ఉంటే, అందుకు బ్రేక్ ఫాస్ంట్ లో ఆరెంజ్, తాజా నిమ్మరసం, తీసుకోండి. లేదా తాజా పండ్లను నారింజ, నిమ్మ, జామ వంటివి అలాగే తీసుకోవడం వల్ల కూడా కొవ్వు కరిగించుకోవచ్చు. సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజస్ వంటి పండ్లు, కేరట్, కేబేజి, బ్రక్కోలి, యాపిల్, వాటర్ మెలన్ వంటి కూరలు పండ్లు శరీరంలోని కొవ్వును కరగించి, కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి.

తగినంత నిద్ర:

మీరు ప్రతి రోజూ తగినంత నిద్ర పొందుటకు నిర్ధారించుకోండి. నిద్రలేమి లేదా కలత నిద్ర వల్ల కూడా బరువు పెరుగుతారు. కాబట్టి, సరైన నిద్ర చాలా అవసరం.

నిమ్మ మరియు తేనె జ్యూస్:

కొవ్వు తగ్గించాలను కొనే వాళ్ళకు నిమ్మరసం బెస్ట్ అయితే తీపి కలిగిన పానీయాలకంటే మంచినీళ్ళు తాగడమే ఉతమమని నిపుణులు.

కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం పూటీ తీసుకొనే తేనె ఉత్తమమైన మార్గం. తేనెను వేడినీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున సేవించాలి. ఇది ఊబకాయస్తులకు ఒక దివ్వ ఔషదం వంటిది. ఈ పద్దతిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. వేడి నీటిలో తేనె కలిపి తాగితే కొవ్వు కరుగుతుంది. తియ్యనైన తేనెను ఏదీ కలపకుండా కూడా తీసుకోవచ్చు. తేనెలోని కార్బో హైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరచి బ్లడ్ షుగర్ స్ధాయి నియంత్రిస్తాయి. బరువు వేగంగా తగ్గాలంటే, షుగర్ కు బదులు తేనెవాడండి.

విశ్రాంతి:

బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం ఒత్తిడి. కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారు ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.

English summary

Home Tips To Reduce Fat In Body | శరీరంలో ఫ్యాట్ ను కరిగించే సులభ చిట్కాలు.!


 There are en numbers of ways and diets that intend to help you lose weight. However, most of the tips to reduce fat don't show effective results. This is because you might be making some mistake in your weight loss diet, or not following the tips to reduce fat effectively.
Story first published: Friday, July 12, 2013, 12:20 [IST]
Desktop Bottom Promotion