Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
ఎలా జీవిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా బతకగలం...?
మీరు ఆరోగ్యవంతమైన వ్యక్తి గా ఉండాలని అనుకొంటున్నారా ? అయితే అలా ఉండటానికి చేయవలసిన మార్పులను సహజమైన పద్దతుల్లో నిదానంగా తెలుసుకొని పాటించండి. ఈ వ్యాసంలోని చిట్కాలను పాటించి మీరు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో రకాల క్యాన్సర్లు మరియు వ్యాధుల నుండి తక్కువ ప్రమాదాన్ని, మరియు సాధ్యమైనంత వరకు దీర్ఘ కాలం సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది.
పెరిగే వయసుని ఆపటం ఎవరితరమూ కాదుకానీ, ఎలా జీవిస్తే ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా బతకగలం?అనే అంశం మీద ఎంతోకాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రకరకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మరీ ఆనందంగా, టేకిటీజీగా బతికేయాలంటే కుదరదని, దీర్ఘకాలం బతకాలంటే కొద్దొ, గొప్పో అయినా టెన్షన్ పడాలని, ఆందోళన చెందాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. శ్రద్ధగా, కష్టపడి పని చేసి, ఒడిదుడుకులకు గురయినా, తరువాత వచ్చే ఫలితాన్ని చూసుకుని మురిసిపోతూ సంతోషపడుతున్నవారే ఎక్కువకాలం జీవించినట్టు పరిశోధనల్లో తేలిందట.
ఆరోగ్య సంరక్షణ అన్నది అందిరికీ వర్తించినా, నలభైకి చేరువ అవుతుంటే మాత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఆ వయసులో డయాబెటిస్, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు, ఆస్టియోపోరోసిస్ వంటివి కనిపిస్తాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం మంచి జీవన శైలి అంటే మంచి ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లను విసర్జించడం వంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరం. కాబట్టి వయస్సుతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకొంటే ఖచ్చితంగా ఈ క్రింది పద్దతులను పాటించాలి.

నిద్ర : మన శరీరానికి మంచి నిద్ర అవసరం. ప్రతి రోజు 8 నుండి10 గంటల వరకు నిద్ర లభిస్తే మన శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. కాబట్టి నిద్రను దూరం చేసే కెఫిన్ మరియు చక్కెర ఉన్న శక్తి పానీయాలను తాగకూడదు. ఒక వేళ మీరు స్కూల్ విద్యార్ది అయితే స్కూల్ కి ఉదయం తొందరగా వెళ్ళాలంటే రాత్రులు తొందరగా పడుకోవాలి.

నవ్వు మరియు చిరునవ్వు : నవ్వు అనేది మన ముఖాన్ని కాంతివంతము మరియు యవ్వనంగా కనబడేలా చేస్తుంది. ఈవిధంగా నవ్వు ను జీవితంలో భాగంగా చేసుకోవటం ఆరోగ్యంగానికి మంచిదని శాస్త్రీయంగా నిరుపితమైనది.

ఏమీ చేయకుండా ఉండటం : చీకటి మరియు ప్రశాంతమైన గదిలో పది నిమిషాలు ఎటువంటి ఒత్తిడితో కూడిన ఆలోచనలు లేకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే మీకు మానసికంగా రిఫ్రెష్ అయిన అనుభూతి కలుగుతుంది. మీరు ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజు మొత్తం ప్రశాంతంగా ఉంటారు.ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేయండి.

ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినండి : ఆరోగ్యకరమైన ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు ముఖ్యమైన భాగంగా చేసుకోండి. ప్రతి రోజు 5 నుండి 9 సార్లు తీసుకోవటానికి ప్రయత్నించండి.

నీటిని త్రాగండి : ప్రతి రోజు మీరు ఎనిమిది-ఔన్స్ గ్లాసుల నీటిని తప్పనిసరిగా త్రాగాలి. ఈ విధంగా త్రాగటం వలన మిమ్మల్ని మళ్ళీ ఉత్తేజపరిచేందుకు సహాయం చేస్తుంది. తగినంత మంచి నీరు త్రాగక పొతే మొటిమలు ,తలనొప్పి మరియు డిహైడ్రేషన్ కు దారితీస్తుంది. మీరు మంచి స్థితిలో ఉండడానికి నీరు దోహదం చేస్తుంది.

వ్యాయామం : మీరు ప్రతి రోజు ఉదయాన్నే మేల్కొని జిమ్ క్లాస్ కు వెళ్లి కండరాల వ్యాయామం చేసి వార్మ్ అప్ అయితే అది మిమ్మల్ని మరింత సౌకర్యవంతముగాను,సరళమైన చురుకైన జీవితాన్ని మనకు అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేయటం జీవితంలో భాగం కావాలి. ప్రతి రోజు వ్యాయామం చేయండి. మీకు మంచి అనుభూతిని,మీరు మెరుగ్గా కనపడటానికి దోహదం చేస్తుంది.

రన్నింగ్ మరియు జాగింగ్ : ప్రతి రోజు ఉదయం పది నిముషాలు సౌకర్యవంతముగా,సులభమైన వేగంతో జాగింగ్ చేస్తే తీరువైన శరీరాన్ని పొందవచ్చు. దీని వల్ల మన కండరాలు బలంగా,గట్టిగా ఉంటాయి. అయితే జాగింగ్ అనేది ఒకేసారి వేగంగా మొదలు పెట్టకుండా నెమ్మదిగా మొదలుపెట్టి సౌకర్యవంతంగా ఉండే వేగం పొంది,అలాగే జాగింగ్ ఆపే ముందు సడన్ గా ఆపకుండా నెమ్మదిగా వేగం తగ్గించి ఆపాలి.

మీకు మీరే సవాలు : మీరు గరిష్టంగా 10 పుష్ అప్ లు చేస్తూ ఉంటే, 12 చేయటానికి మాత్రమే ప్రయత్నించండి. ఇటువంటి చిన్న సవాళ్లు మీ శరీరాన్ని నైస్ గా మరియు దృఢంగా ఉంచుతాయి.

మీకు నచ్చింది చేయండి : మీరు ఒక పెంపుడు జంతువులతో ఆడుకోండి. స్విమ్మింగ్ కు వెళ్లండి లేదా ట్రామ్పోలిన్ మీద దూకండి. ఈ విధంగా మీకు నచ్చిన పనులు చేయటం వల్ల మంచి మూడ్ తో పాటు సంతోషం కలుగుతుంది. ఒక వేళ అనుకోని సంఘటన జరిగి మీకు చిరాకు కలిగి కోపం వస్తే తగ్గటానికి బైక్ రైడ్ చేయండి. ఇది సరదాకే కాకుండా,మిమల్ని మీరుగా ఉంచుకోవటానికి ఉపయోగపడుతుంది.

ప్రతిభ/ మీ గురించి మంచి ఫీల్ : మీరు పని చేస్తున్న పరిదిలో మీకన్నా బెటర్ గా పని చేసేవారు ఉంటె వాళ్లతో మిమ్మల్ని పోల్చవద్దు. ఏ విషయంలో మీకు సామర్ద్యం ఉందో దానిని గమనించి వెలికితీసి మీ ప్రతిభను ఉపయోగించాలి.

ఏదైనా సాధించడానికి : ఏదైనా కొత్త పని చేయండి. అది మీకు విజయానుభుతిని ఇస్తుంది. అది ఆట కావచ్చు, పాట కావచ్చు. మీలోని ఈ ప్రతిభ ద్వారా ఎదుటివారిని ఆశ్చర్యపరచటం మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

ప్రశాంతంగా ఉండండి- ఏ విషయాన్నీ తీవ్రంగా తీసుకోకండి. ఓపెన్ మైండెడ్ గా ఉండి కొత్త విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications