For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంగ్యూ నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా..?

|

జీవితంలో నాకిలాంటివి ఎపుడూ జరగకూడదు అనుకునేవి కొన్ని ఉంటాయి, వాటిలో డేంగ్యూ ఒకటి. ఈ వ్యాధి మనిషి రోగనిరోధక వ్యవస్థలోకి ఎంతలా పాకుతుందంటే మనం దాన్ని గుర్తించే లోపే శరీరం దెబ్బ తింటుంది. డేంగ్యూ జ్వరం చాలా సాధారణమైన వ్యాధి. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఏడిస్ ఇజిప్టై అనే దోమ వల్ల ఇది వ్యాపిస్తుంది. అంటే డేంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని ఈ దోమ కుట్టి అదే దోమ మళ్లి ఆరోగ్యవంతమైన వ్యక్తిని కుట్టినపుడు ఈ వ్యాధి ఆవ్యక్తికి కూడా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి ఏడు రోజులలోపు లక్షణాలు కనిపిస్తాయి. డేంగ్యూ ఇన్‌ఫెక్షన్ సాధరణంగా అదే తగ్గిపోతుంది.

డేంగ్యు జ్వరం మూడు రకాలు. అసలు ఏలక్షణం కనిపించని జ్వరం, రక్తవూసావంతో కూడిన జ్వరం, రక్తం స్రావంతో పాటు బీపీ కూడా పడిపోయి షాక్‌లోకి వెళ్లడం.

ఇవీ లక్షణాలు
జ్వరం, తలనొప్పి, కళ్ల నొప్పి, ఒంటినొప్పులు, కీళ్లనొప్పులు, రాష్ రావడం, ఒంటిపై ఎర్రని మచ్చలు రావడం, చిగుళ్ళ నుంచి రక్తం రావడం, రక్తంలో తెల్లకణాలు తగ్గిపోవడం వంటివి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు.

అందుకే ఈ వ్యాధిని ‘బ్రేక్ బోన్' ఫీవర్ అని కూడా అనడంలో అతిశయోక్తి లేదు. మరి దీనిని ఎలా నివారించాలో ఇక్కడ కొన్ని చిట్కాలు ఇవ్వబడ్డాయి.

డేంగ్యూ నివారించడం ఎలా?

మీ పరిసరాలను పొడిగా ఉంచుకో౦డి: డేంగ్యూ వచ్చే ప్రమాదం ఉన్నపుడు, మీరు మీ పరిసరాలను వీలైనంత పొడిగా ఉంచుకోవడం అత్యవసరం. నీరు ఎక్కువగా నిల్వ ఉండడంవల్ల కూడా ఇది సంభవించ వచ్చు. సాధారణంగా డేంగ్యూ దోమలు నీరు నిలిచి ఉన్నచోట గుంపులుగా వృద్ది చెందుతాయి. అందువల్ల, ఇంట్లో ఎక్కడా నీరు నిలవ ఉండకుండా అదనపు శ్రద్ధ తీసుకోవాలి. శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండే ఎక్కువ ఖాళీ స్థలం, ఎండ పడే పరిసరాల ప్రాంతాలని ఎంచుకోవాలి.

డేంగ్యూ నివారించడం ఎలా?

ఇంట్లోని అన్ని వస్తువుల పై మూతలు ఉంచాలి: మూతలేని డబ్బాలకు, నీరు ఉన్న ఆహారానికి మూట వేసి ఉంచడం ముఖ్యం. డేంగ్యూ దోమలు ఇంట్లోని ఏ వస్తువులపై నైనా వాలే అవకాశం ఉంది, మూతలేని ఆహారం పైనే తప్పనిసరిగా చేరతాయి.

డేంగ్యూ నివారించడం ఎలా?

మిమ్మల్ని మీరు రక్షించుకో౦డి: స్వీయ రక్షణ చేసుకుంటే ఎలా ఉంటుంది? నిద్రపోయేటపుడు మీరు ధరించే ఫుల్-స్లీవ్డ్ షర్ట్ లు, పాంట్లు, చుట్టూ చుట్టే షీట్లుతో మొదలుపెట్టండి. అంతేకాకుండా, దోమ నివారణ క్రీములు వాడడం, ఇంటి చుట్టూ వివిధ ప్రదేశాలలో లిక్విడేటర్లు ఉంచడం వల్ల ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా నివారించవచ్చు.

డేంగ్యూ నివారించడం ఎలా?

తలుపులకు తెర వేయడం: మీ ప్రధాన తలుపుకు వైరు జాలీలు లేదా బిగుతైన నెట్ ఉపయోగించి తెర వేయండి. మీ ఇంట్లో కిటికీలకు కూడా ఇలాగే చేయండి. డేంగ్యూ ఆపద నుండి మరింత జాగ్రత్తలు తీసుకోవడానికి, మీరు నిద్రించేటపుడు మీ మంచంపై దోమతెర వేయండి.

డేంగ్యూ నివారించడం ఎలా?

బైటతిరగడం మానేయండి : పార్కులు, తోటలు వంటి తేమ ప్రదేశాలు లేదా చెట్లు ఎక్కువగా ఉన్న చోట డేంగ్యూ దోమలు ఉంటాయి కాబట్టి అలాంటి ప్రదేశాలలో తిరగడం మాన౦డి. మీరుండే చోట దోమలు పెరిగే ప్రాంతాలేవో తెలుసుకుని వాటికి దూరంగా వుండండి.

డేంగ్యూ నివారించడం ఎలా?

శుభ్రం చేయండి: డేంగ్యూ నివారణ చర్యలన్నిటిలోకీ ఇదే అత్యంత ప్రధానమైనది, మీ వ్యక్తిగత పరిశుభ్రతలో భాగం కూడా. వాటర్ కూలర్లు, టాంకులు, వాష్ బేసిన్లు శుభ్రంగా ఉంచితే దోమల పెరుగుదలనివారించ వచ్చు. వారానికి ఒక సారి ఇలా శుభ్రం చేస్తే దోమలు నివారించవచ్చు.

డేంగ్యూ నివారించడం ఎలా?

రసాయనాలు వాడండి : ఇంటి చుట్టూ, డ్రైనేజీ లలోను బ్లీచింగ్ పౌడర్, డి డి టి లాంటివి చల్లితే డేంగ్యూ దోమలు పూర్తిగా నశిస్తాయి, మిమ్మల్ని సురక్షితంగానూ, ఆరోగ్యంగాను ఉంచుతాయి.

డేంగ్యూ ని నివారించడానికి ప్రయత్నించడం పెద్ద కష్టమేమీ కాదు. నిత్యం చేయాల్సిన పనులు చేస్తే ప్రమాదాలనుంచి రక్షించుకోవచ్చు. డేంగ్యూ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వుండి సరైన నివారణ చర్యలు చేపడితే మీరు, మీ కుటుంబం కూడా సురక్షితంగా ఉండడానికి మంచిది.

గుర్తుంచుకోవల్సిన విషయాలు:
1. ఆస్ప్రిన్ లేదా బ్రూఫెన్ వంటి జ్వరం మందులు ఇవ్వకూడదు.
2. ముందు జాగ్రత్తగా షాక్ లేదా రక్తవూసావం లేకుండా ఐవీ ఫ్లూయిడ్లు ఇవ్వకూడదు.
3. అవసరమైతే కానీ రక్తం ఎక్కించకూడదు
4. స్టీరాయిడ్ మందులు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు
5. యాంటి బయాటిక్స్ అవసరం లేదు
6. ఎండోస్కోపి ద్వారా రక్తవూసావం జరుగుతుందేమోనని పరీక్షించకూడదు. ఒకవేళ రక్తవూసావం ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో రక్తవూసావాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు.

English summary

How To Prevent Dengue.. | డేంగ్యూ నివారించడం ఎలా?

There are some things in life that you wish would never happen to you and dengue fever is one of them. The disease itself enters so seamlessly into a human’s immune system that by the time one gets cracking the code, the body comes crashing down.
Desktop Bottom Promotion