Latest Updates
-
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్! -
మన దేశం మధ్యలో ఉండి భారతీయులే వెళ్లలేని వింత గ్రామం..ఎక్కడుంది? ఆ కథేంటి? -
చలికాలంలో పచ్చి బఠానీ ఎందుకు తినాలో తెలుసా?
దోమల కాటు నుండి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు
దోమ కాటు వేసినచోట గోకడం మానుకోండి. దోమ కాటును గోకడం వలన శరీరం దెబ్బతింటుంది, ముఖ్యంగా మీ వేళ్ళు మురికిగా ఉంటాయి, అందువలన సూక్ష్మక్రిముల దాడి శరీరంపైన పెరుగుతుంది. ఇలా గోకడం వలన మంట ఎక్కువవుతుంది, ఇంకాఇంకా గోకాలనే కోరిక పెరుగుతుంది మరియు దానివలన తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.
దోమ కాటు వలన మన శరీరం దురదగా అవుతుంది మరియు శరీరం పైన దద్దురులు వొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. దీనివల్ల ఇబ్బంది ఏమిటంటే ఈ కాటు కనపడుతుంది ఉదాహరణకు చేతులు, ముఖం లేదా పాదాలు. దీని గురించి ఏమి చింతించక్కరలెదు. దోమ కాటు నుండి కాపాడుకోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాము.
దోమల కాట్లను నివారించటానికి కొన్ని చిట్కాలు:

ఐస్: ఆశ్చర్యకరంగా కోల్డ్ థెరపీ దురద నుండి ఉపశమనము ఇస్తుంది మరియు వాపును కూడా నిరోధిస్తుంది. ఒక పేపర్ టవల్ లో ఒక చిన్న ఐస్ ముక్కను చుట్టండి మరియు ఎక్కడ దోమ కాటు ఉన్నదో, అక్కడ దీనిని పెట్టండి. ఇలా చేయడం వలన వాపు మరియు శరీర దురద తగ్గుతుంది.

ఎసెన్సియల్ ఆయిల్స్ (ముఖ్యమైన నూనెలు): తేయాకు చెట్టు నూనెకు వాపు తగ్గించే గుణము ఉన్నది, అందువలన ఈ నూనె వాపు, దురద మరియు నొప్పి మొదలైనవాటితో పోరాడగలదు. మనం చూసే నూనెలో కూడా యాంటీబాక్టీరియల్ మరియు యాంటివైరల్ గుణాలు ఉన్నాయి, ఇది కూడా దోమ కాటు వలన ఏర్పడే అంటువ్యాధులను నిరోధించడానికి సహాయపడుతుంది.

లావెండర్ తైలం కూడా సహాయపడుతుంది: ముఖ్యమైన నూనె రకాలలో లావెండర్ నూనె ప్రసిద్ధ బహుముఖశాలి, దీనిని మీరు శరీరం మీద రాసుకున్నట్లయితే, అది దురద మరియు నొప్పిని తగ్గిస్తుంది మరియు అంటువ్యాధులు రాకుండ చేస్తుంది.

తేనె: ఈ సహజ స్వీటెనర్ వలన చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి, దీనికి వాపు తగ్గించే గుణము మరియు యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి కావున, ఇది దోమకాటును తగ్గిస్తుంది అని అనటంలో అతిశయోక్తి లేదు.

టీ బ్యాగ్: కళ్ళ కింద ఉబ్బులు తగ్గించడంతో పాటు, టీ బ్యాగు దోమల కాటు వల్ల ఏర్పడే వాపును కూడా తగ్గిస్తుంది. టీ లో ఉన్న'టన్నిన్' కంటెంట్ ఒక రక్తస్రావ నివారిణి గా పనిచేయటంవలన, దోమకాటు వలన ఏర్పడిన ద్రవాన్ని బయటకు లాగివేస్తుంది.

వంట సోడా: స్నానం చేసే గోరువెచ్చని నీటిలో దీనిని కలపండి మరియు 30 నిముషాలు నానండి లేదా దీనిని కొద్ది నీటిలో కలిపి, దీనిని ఎక్కడ కాటు ఉన్నదో అక్కడ రాయండి.

బెసిల్లస్(తులసి): ఈ సహజ సువాసనభరిత ఆకులలో ఉన్న కర్పూరం మరియు త్యమోల్, అనే ఈ రెండు మిశ్రమాలు దురదను తగ్గిస్తాయి. మీరు కొన్ని ఆకులను తీసుకొని నలిపి మరియు కాటు మీద రుద్దండి లేదా ఈ నూనెను కొనండి.

నిమ్మకాయలు మరియు నిమ్మరసం: నిపుణులు చెప్పిన ప్రకారం, ఈ పండు దురదకు వ్యతిరేకంగా, యాంటీబాక్టీరియల్ మరియు యాంటీమైక్రోబయాల్ గా పనిచేస్తుంది. రసం లేదా పండు తొనలు, రెండూ అన్ని రకాలా బాక్టీరియాను చంపుతుంది.

పెప్పర్మెంట్: బహుశా మీరు టూత్ పేస్టు దురద నుండి ఉపశమనం ఇస్తుందని వినే ఉంటారు, దీనిలో ఉన్న పూదినా వాసన కారణంగా పని చేస్తుంది. మీకు టూత్ పేస్టును ఉపయోగించటం ఇష్టం లేకపోతే, నలిపిన పూదినా ఆకుల ముద్దనుకాని లేదా ఎస్సెన్షియాల్ ఆయిల్ ని కాని ప్రయత్నించండి.

అలో వెరా: అలో వేరాను సాధారణంగా సూర్యరశ్మివల్ల ఏర్పడే స్థితి నుండి ఉపశమనానికి ఉపయోగిస్తారు, కాని దీనిని కాట్ల చికిత్సకు కూడా ఉపయోగించవొచ్చని మర్చిపోకూడదు. ఈ మొక్క దురద మరియు వాపులకు నిరోధకంగా బాగా పని చేస్తుంది, ఇది నిజంగా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది.

గేరనియం నూనె మరియు నేరోలి నూనె మిశ్రమం: 5 చుక్కల గేరనియం నూనె, 3 చుక్కల నేరోలి నూనె మరియు మీరు సాధారణంగా ఉపయోగించే 3 స్పూన్ల పేస్ క్రీం ను కలపండి. గేరనియం ఒక క్రిమినాశకకారి అందువలన శరీరం మీద మంటను తగ్గిస్తుంది. ఇది ఇతర పదార్థాలతో కలవటం వలన శరీరాన్ని మెత్తగా మరియు మచ్చలు ఏర్పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనిని దోమకాట్ల మీద రాయటంవలన దురద మరియు వాపు తగ్గుతుంది.

కొబ్బరి పీచు: మొట్టమొదటి నుండి ఎండబెట్టిన కొబ్బరి ఊకను ఒక దోమ నివారిణిగా ఉపయోగిస్తున్నారు. ఎండబెట్టిన కొబ్బరి పొత్తులను కాల్చి, దానివల్ల వొచ్చే పొగ పోవటానికి 5-6 నిముషాలు అలానే ఉంచేవారు.దోమలు గది నుండి బయటకు వెళ్ళేవి. పొగ ఉన్నప్పటికీ, కొబ్బరి పీచు స్పష్టంగా అధిక సహజమైనది మరియు మీ ఆరోగ్యానికి సురక్షితం.

కర్పూరం గంధకం: ఇది దోమలకు ముఖ్యమైన శత్రువు. ఇటువంటి పదార్థాలు కర్పూరంలో ఉన్నాయి. కర్పూరాన్ని మీ గదిలో వెలిగించి, కొన్ని నిముషాలు వేచి ఉండండి మరియు మీ ఇంట్లోని దోమలన్ని మాయమై మీరు చాలా సుఖంగా అనుభూతి చెందుతారు.

కిరోసిన్ మరియు కర్పూరం: కిరోసిన్ వాసన లేదా కేరోసిన్ బాగుండదు. అందువలన దీనిని కర్పూరంతో కలిపి, గదిలో చల్లండి. సహజంగా దోమలు గదిని విడిచిపెట్టి వెళతాయి మరియు మీకు ఈ కాట్ల బాధ ఉండదు.



Click it and Unblock the Notifications
