For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్సర్ నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

సాధారణంగా కడుపులో ఉండే ఆసిడ్స్ మాత్రమేగాక, ఒక్కోసందర్భంలో కూల్‌డ్రింక్స్ లో ఉండే కెఫిన్ వల్ల కూడా ఈ మ్యూకోజాలోని మూడు పొరలు గాయపడవచ్చు. కొన్నిసార్లు యాస్పిరిన్, నొప్పి తగ్గించుకోవడానికి తీసుకొనే కొన్ని మందులు(అనాల్జిసిక్స్)వల్లకూడా ప్రేగు పొరలు దెబ్బతిని అల్సర్స్ కు కారణంకావచ్చు. వీటన్నింటితో పాటు మరో ప్రధాన కారణం కూడా ఉన్నది హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా! అందువల్ల కూడా అల్సర్ రావచ్చు. కొన్ని సార్లు మానసిక ఒత్తిడి వల్ల కూడా అల్సర్స్ రావచ్చు. సాధారణంగా మ్యూకోజాలో ఉండే మూడు పొరలకు గాయం అయినప్పుడు మనలోని సంరక్షణ శక్తి (డిఫెన్సివ్ ఫ్యాక్టర్) వల్ల అది దానంతట అదే తగ్గిపోతుంది. కాని దానంతట అది తగ్గే శక్తి కంటే గాయపరిచే శక్తుల ప్రభావం ఎక్కువైనప్పుడు అల్సర్స్ ఏర్పడతాయి.

అల్సర్ ను కొన్ని సార్లు స్టొమక్ అల్సర్, పెప్టిక్ అల్సర్, గాస్ట్రిక్ అల్సర్ లేదా డ్యూయోడినల్ అల్సర్, అని పిలుస్తుంటారు. ఇవిన్నీ మీ కడుపు పై బాగంలో వచ్చేటటువంటి అలర్స్ గా భావిస్తారు. అల్సర్ అనేది కడుపులో యాసిడ్ పుడ్స్ జీర్ణం అవ్వడం కానీ లేదా చిన్న పేగు యొక్క గోడలు పాడవుతాయి. ఒక్కోసారి ఒత్తిడి, డయట్ మరియు జీవనశైలిలో మార్పులు ఇవన్ని కూడా అల్సర్ కు కారణం అవుతాయి. పస్తుత సైంటిస్ట్ ల పరిశోధనల ప్రకారం అల్సర్ కు హిలికోబ్యాక్టర్ పైలోరి, లేదా హెచ్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా కారణం కావచ్చు అని కనుగొన్నారు. వీటికి ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టమే, చాలా వరకూ ఈ అల్సర్ అలాగే కొనసాగుతుంది. కొన్ని పద్దతులను పాటించినట్లౌతే అల్సర్ నుండి బయట పడవచ్చు.

How to Treat Ulcers

చికిత్స పద్ధతులు:

1. రెడ్ క్యాబేజ్: క్యాబేజ్ ను అలాగే తినడం కానీ లేదా జ్యూస్ చేసుకొని తాగడం కానీ చేయడం వల్ల అల్సర్ కు ఉపశమనం కలిగించవచ్చు.

2. వైద్య పరిక్షలు: కడుపులో నొప్పి, ఆబ్డోమినల్ పెయిన్, వంటివి ఉన్నాయోమని వైద్యపరిక్షలు చేయించుకోవడం వల్ల అల్సర్ ఉన్నది లేనిది తెలుస్తుంది. ఇది. అల్సర్ కు మొదటి లక్షణం, ఇతర లక్షణాలు జలుబు, వాంతులు, గ్యాస్, కడుపు ఉబ్బరంగా, బరువు తగ్గడం ఇవన్నీ కూడా అల్సర్ కు కారణం అవ్వచ్చు.

3. అల్సర్ కు ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత కూడా అల్సర్ తగ్గనట్టైతే బౌల్ మూమెంట్లో బ్లడ్ ఉన్నా, లేదా వాంతి, లేదా మీ లక్షణాలు ఎక్కువగా ఉండి మాత్రలకు తగ్గనప్పుడు తిరిగి డాక్టర్ ను సంప్రదించాలి. దాంతో డాక్టర్ ఈ క్రింది టెస్ట్ నుల చేయించుకోమని సలహా ఇస్తారు.

అప్పర్ గ్రాస్ట్రోఇన్టెన్సినల్ సీరిస్, ఎండోస్కోపి, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, బ్రీత్ టెస్ట్

4. ఈ టెస్ట్ అన్ని జరిపించిన తర్వాత డాక్టర్ సూచనలు తప్పక పాటించాలి. చాలా వరకూ అల్సర్ కు గల కారణాలు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలా కానీ పక్షంలో ఆపరేషన్ ద్వారా తొలగిస్తారు. యాస్పిరిన్ మరియు యాంటీఇన్ఫ్లమేటర్ డ్రగ్స్ కూడా అల్సర్ కు కారణం అవుతాయి. కాబట్టి అల్సర్ ఉన్నట్లు తెలిసిస్తే యాస్పిరిన్ తీసుకోకపోవడమే మంచిది. యాసిడ్ తగ్గించుకోవడానికి మీరు యాస్పిరిన్ తీసుకోవాలనుకుంటే డాక్టర్ ను సంప్రదించిన అడిగిన తర్వాత తీసుకోవడం మంచిది. అల్సర్ అధికంగా ఉండే భరించలేని సమయంలో సర్జరీ తప్పనిసరి అవుతుంది.

5. డయట్: ఫైబర్ అధికంగా ఉన్నటువంటి తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తరచూ మీ డైయట్ లో చేర్చుకోవడం వల్ల అల్సర్ బారీన పడకుండా మిమ్మల్మి కాపాడుకోవచ్చు.

6. ఫెవనాయిడ్స్ అధికంగా ఉండేటటువంటి ఆహారంను, పానీయాలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్స్, సెలరీ, క్రాన్ బెర్రీస్, వెల్లుల్లి, మరియు ఉల్లిపాయలు, వంటి వీటిలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. కాబట్టీ ఇటువంటి పండ్లను, లేదా కూరగాయాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

7. స్పైసీ ఫుడ్స్: మీరు ప్రతి రోజూ తీసుకొనేటటువంటి ఆహారంలో కారం ఎక్కువగా ఉన్న ఆహారాలకు దూరంగా వుండాలి. లేదంటే అల్సర్ నొప్పి విపరీతంగా మిమ్మల్ని బాధింవచ్చు.

8. కాఫీ, డీకాఫినేటెడ్ డ్రింక్స్ మరియు కార్బొనేటెడ్ బెవరేజస్ వంటి వాటిని పూర్తిగా నిషేధించాలి. ఇవన్నీ కూడా స్టొమక్ ఎసిడిటికి కారణం అవుతాయి దాంతో అల్సర్ కు దారితీస్తుంది.

9. మద్యం: ఆల్కహాల్ తీసుకొనే వారైతే అల్సర్ ఉన్నప్పుడు ఆల్కహాల్ ను పూర్తిగా మానేయడం మంచిది.

10. ఇన్ డైజషన్ లేదా ఛాతీలో మంట వంటి అల్సర్ లక్షణాలను నివారించడానకి యాంటాసిడ్స్ ను ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.

English summary

How to Treat Ulcers | అల్సర్ ను ఇలా కూడా తగ్గించుకోవచ్చు..!

Ulcers, also sometimes called stomach ulcers, peptic ulcers, gastric ulcers or duodenal ulcers, are sores or lesions in your stomach or the upper part of your small intestines. Ulcers develop when the acids that digest foods damage the stomach or intestinal walls.
Story first published: Saturday, February 23, 2013, 13:00 [IST]
Desktop Bottom Promotion