For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రక్తం గడ్డకట్టకుండా గుండెను కాపాడే విటమిన్ కె

|

విటమిన్‌ కె : ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్ కెను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సి ఇక ముఖ్యమైన విటమిన్ ఇది. ఇది కొవ్వులో కరిగే విటమిను. రక్తము గడ్డకట్టుటలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. మరియు విటమిన్ కె వల్ల మరో ప్రధానమైనటువంటి పాత్ర ఎముక మరియు ఇతర కణజాలము లో కొన్ని జీవక్రియలకు సహకరింస్తుంది మరియు ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. మరియు ఇది అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. విటమిన్స్ అనగానే, విటమిన్స్ లో ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యాన్ని ఉపయోగపడేవని గుర్తించాలి.

విటమిన్ కె లో విటమిన్‌ కె1 , విటమిన్‌ కె2 అని రెండు రకాలు. విటమిన్‌ కె1 ని విటమిన్‌ కెజె (ఫిల్లొక్వినోన్‌) అని కూడా పులుస్తారు. విటమిన్‌ కె1 - మొక్కలలో తయారవును. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్‌ లలోను లభించును. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్‌ కె1 ను విటమిన్‌ కె2 గా మార్చుతు ఉండును. విటమిన్‌ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడును. విటమిన్‌-కె కుత్రిమ తయారీ రకాలు లో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. కె1, కె2 విటమిన్లు హానికరము కావు. కుత్రిమ తయారీ విటమిన్లు కె3 (menadione) కొంతవరకు హానికరమని చెప్పబడుతున్నది.

రీసెంట్ గా విటమిన్ కెను విటమిన్ డిగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే విటమిన్ కె మరియు విటమిన్ డి రెండింటిలోనూ ఒకే విధమైన కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. ఆరోగ్యం విషయంలో విటమిన్ డి'ది కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి విటమిన్ డి పొందాలన్నా, విటమిన్ కె ఆహారాలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి విటమిన్ కె మీ ఆరోగ్యానికి ఎంత వరకూ అవసరం, దాని ప్రాముఖ్యత ఏంటని ఇక్కడ బోల్డ్ స్కై మీకు అంధించబోతోంది.

ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వ్రుద్దులు విటమిన్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలకు అధికంగా తీసుకోవాలి. పిల్లలకు విటమిన్ కె చాలా అవసరం ఎందుకంటే విటమిన్ కె పిల్లల యొక్క ఎముకల బలానికి చాలా అవసరం. ఇంకా వారి దంత సంరక్షణకు కూడా చాలా సహాయపడుతుంది. వయస్సు పైబడ్డ వారికి కూడా ఈ విటమిన్ కె చాలా అవసరం. ఎందుకంటే వయస్సు పెరిగేకొద్ది ఆరోగ్య సమస్యలతో పాటు, చూపు మందగిస్తుంది. చూపు బ్లర్ గా కనబడకుండా నిరోధించాలంటే విటమిన్ కె పుష్కలంగా ఉండే ఆహారాలు డైట్ లిస్ట్ లో చేర్చుకోవాలి.

మరి విటమిన్ కె ప్రాధాన్యత మరియు ఆరోగ్యానికి చేకూర్చే లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...

 1. ఎముకలకు:

1. ఎముకలకు:

విటమిన్ కె ఎముకల బలానికి చాలా అవసరం అయినది. మీ శరీరంలోని ఎముకలలో ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం ఒక్కటే కాదు, విటమిన్ కె కూడా మీ శరీరంలో ఎముకలు బలంగా ఉంచడానికి సహాయపడుతుంది.

2. క్యాన్సర్:

2. క్యాన్సర్:

మీరు క్యాన్సర్ తో బాధపడుతున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో ప్రధానంగా చేర్చుకోవల్సింది విటమిన్ కె. ఫ్లెవనాయిడ్స్ (ఫైటో న్యూట్రియంట్స్)లో యాంటీక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా ఉండి క్యాన్సర్ బారీనుండి రక్షణ కల్పిస్తుంది. ఆకు కూరలు మరియు బ్రొకోలీ వంటి ఆహారాల్లో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది.

3. బ్లడ్ ప్రెజర్:

3. బ్లడ్ ప్రెజర్:

హై బ్లడ్ ప్రెజర్ తో ఎవరైతే బాధపడుతున్నారో, వారు విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. విటమిన్ కె ఆహారాలు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ బ్లడ్ ప్రెజర్ ను క్రమబద్దం చేస్తుంది.

 4. కంటి చూపు:

4. కంటి చూపు:

మంచి కంటిచూపు కోసం, క్యారెట్ ఒకటి మాత్రం తింటే సరిపోదు. క్యారెట్ తో పాటు, బ్రొకోలీ, క్యాబేజ్, మరియు ఆకుకూరలు రెగ్యులర్ గా వారంలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిలోని విటమిన్ కె కంటి చూపును మెరుగుపరుస్తుంది.

5. రోగనిరోధక శక్తి:

5. రోగనిరోధక శక్తి:

ప్రస్తుత రోజుల్లో ఎవరైతే రోగనిరోధక శక్తి తక్కువగా కలిగి ఉన్నారో , వారి విటమిన్ కె ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొంధించుకోవచ్చు. ఇది తాజా వెజిటేబుల్ జ్యూసులలో ఉంటుంది.

6. మెదడు:

6. మెదడు:

మీరు ఒత్తిడితో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? అధిక ఒత్తిడి తగ్గించడంలో బ్రెయిన్ ఫుడ్ గా విటమిన్ కె ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి.

7. నెర్వస్ డిజార్డర్:

7. నెర్వస్ డిజార్డర్:

అనియంత్ర ఒత్తిడి కారణంగా నాడీ వ్యవస్థ అల్లకల్లోలము చెందుతుంది. అటువంటప్పుడు విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా అవసరం. నెర్వస్ డిజార్డర్ కంట్రోల్ చేయడానికి విటమిన్ కె ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి.

8. ప్యూరిఫికేషన్:

8. ప్యూరిఫికేషన్:

యవ్వనంలో ఉండే వారు ఎవరైతే మొటిమల సమస్యతో బాధపడుతున్నారో, అటువంటి వారు వారి శరీరంలోని రక్తం శుద్ది చేసుకోవడం చాలా అవసరం. అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్క గ్రీన్ వెజిటేబుల్స్ తినడం ఒక్కటే మార్గం. అందులోనూ విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం.

9. న్యూట్రీషియన్స్:

9. న్యూట్రీషియన్స్:

అధిక న్యూట్రిషియన్స్ కలిగిన ఆహారాల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే క్యాబేజ్ మరియు ఆకుకూరల్లో వంటివి మంచి ఉదాహరణలు.

10. కడుపు నొప్పి:

10. కడుపు నొప్పి:

ఒక్కో సందర్భంలో నొప్పి భరించలేనంత విధంగా కడుపు నొప్పితో బాధపడుతున్నట్లైతే, అటువంటి సమయంలో నొప్పి నివారినిగా విటమిన్ కె ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి. మీకు కడుపు నొప్పి వస్తున్నదిని అనిపించినప్పడు, తాజా వెజిటేబుల్ రసాన్ని త్రాగడానికి ప్రయత్నించండి.

11. తలనొప్పి:

11. తలనొప్పి:

మీరు అనుకోకుండా తలనొప్పికి గురైనప్పుడు మరియు తలనొప్పి తరచూ వేధిస్తుంటే కనుక, విటమిన్ కె ఆహారాలు తీసుకోవడం తప్పనిసరి.

 12. రక్తం గడ్డకట్టడం:

12. రక్తం గడ్డకట్టడం:

ప్రస్తుత రోజుల్లో రక్తం గడ్డకట్టడం అనేది సాధారణంగా మారిన ఒక ఆరోగ్య సమస్య. రక్తం గడ్డకడితే గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాధకరం. కాబట్టి, రక్తం గడ్డకట్టకుండా నిరోధించి వాటిలో విటిమన్ కె కూడా ఒకటి, కాబట్టి, అలా జరగకుండా నివారించాలంటే, విటమిన్ కె పుష్కలంగా ఉన్నఆహారాలు తీసుకోడం మంచిది.

13.గర్భధారణ సమయంలో:

13.గర్భధారణ సమయంలో:

ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాల్షియం మరియు విటమిన్ డి మాత్రమే కాకుండా, అత్యధిక శాతం విటమిన్ కె ఉన్న ఆహారాలు కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. విటమిన్ కె ఫుడ్స్ గర్భధారణ సమయంలో తీసుకోవడం చాలా సురక్షితం.

14. కడుపు ఉబ్బరం:

14. కడుపు ఉబ్బరం:

కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నప్పుడు , విటమిన్ కె తప్పనిసరిగా తీసుకోవాలి. మీలో ఆ భావన కలిగిన వెంటనే తాజాగా ఉన్న కూరగాయ ముక్కలను తినడానికి ప్రయత్నించండి. మీ సమస్యను నివారిస్తుంది.

15. చిరాకు:

15. చిరాకు:

చాలా వరకూ చాలా మంది ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతుంటారు. అటువంటి వారు విటమిన్స్ లోపం కలిగి ఉంటారని ఆరోగ్యనిపుణుల అభిప్రాయం. కాబట్టి, వారంలో ఒకసారి విటమిన్ కె ఆహారాలు తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

English summary

Importance Of Vitamin K For Health


 According to experts, it is said that the most important Vitamin one should add to their daily diet is Vitamin K. It is this vitamin which is fat-soluble in nature and is also well know for the important role it plays in blood clotting.
Story first published: Monday, November 11, 2013, 18:12 [IST]
Desktop Bottom Promotion