For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మందార ఆకులతో పొందే వైద్య ప్రయోజనాలు

By Super
|

మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ప్రత్యేక అందం కలిగిన ఈ పుష్పాలు అనేక రకాల జాతులను కలిగి ఉన్నాయి. ఇది దక్షిణ కొరియా, మలేషియా మరియు హైతీ రిపబ్లిక్ యొక్క జాతీయ పుష్పంగా ఉన్నది. దీనిని దేవుని యొక్క అనేక ఆచారాలు మరియు సమర్పణలలో ఉపయోగిస్తారు. భారతదేశంలో ఒక పవిత్రమైన పుష్పంగా భావిస్తారు. దీనిని శతాబ్దాలుగా భారతీయ ప్రాచీన ఆయుర్వేద వైద్య వ్యవస్థలో అనేక రుగ్మతల చికిత్స కొరకు ఉపయోగిస్తున్నారు.

మందార ఆకులను మాములుగానే కాకుండా వైద్యపరంగా కూడా ఉపయోగిస్తారు. తోటలు మరియు పార్కులలో వివిధ రూపాలలో అలంకరణ కొరకు ఉపయోగిస్తారు. మందార ఆకులను వేర్వేరు ఉపయోగాల కోసం వివిధ రూపాలలో ప్రాసెస్ చేస్తారు. మెక్సికన్ వంటి వివిధ రకాల వంటకాల్లో ఎండిన మందార ఆకులను గార్నిష్ కొరకు ఉపయోగిస్తారు. వీటి పూలను ఉపయోగించి టీ ని తయారుచేస్తారు. దీనిని అనేక దేశాలలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.

మందార ఆకులలో ఉన్న ఔషధ ఉపయోగాల గురించి వివిధ రకాల పరిశోధనలు ద్వారా శాస్త్రీయంగా నిరూపణ జరిగింది. 2008USDA అధ్యయనం ప్రకారం మందార టీ తీసుకొనుట వలన రక్తపోటును తగ్గిస్తుందని తెలిసింది. ఆయుర్వేదంలో ఎరుపు మరియు తెలుపు మందారాలలో అధిక ఔషధ విలువలు ఉన్నాయని భావిస్తారు. వీటిని వివిధ రూపాలలో ఉపయోగించటం వలన దగ్గు చికిత్సకు,జుట్టు క్షీణత మరియు జుట్టు గ్రే కలర్ లో ఉండుటకు సహాయపడుతుంది. మందారంలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన యాంటీ వృద్ధాప్య ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తారు. మానసిక స్థితి సరిగా ఉండటానికి మందార ఆకు టీ ని వినియోగిస్తారు.

ఇక్కడ మందార ఆకులు వలన అనేక ఔషధ ఉపయోగాలు ఉన్నాయి.

1. జుట్టుకు కండిషనర్

1. జుట్టుకు కండిషనర్

మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది.

2. టీ

2. టీ

వివిధ దేశాలలో మందార ఆకులతో తయారు చేసిన టీ ని ఔషధ ప్రయోజనాల కొరకు వినియోగిస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సహజ మూత్రవిసర్జన ప్రేరకంగా సహాయం కొరకు చక్కెర లేకుండా వినియోగిస్తారు. అంతేకాక డిప్రెషన్ సమయములో మానసిక స్థితి మెరుగుపరుస్తుంది.

 3. చర్మ సంరక్షణ

3. చర్మ సంరక్షణ

దీనిలో కాస్మెటిక్ చర్మ సంరక్షణకు ఉపయోగించే గుణాలను కలిగి ఉంది. సంప్రదాయ చైనీస్ ఔషధాలలో హైబిస్కస్ ఆకులతో అతినీలలోహిత రేడియేషన్ పీల్చుకునే యాంటీ సౌర ఏజెంట్ గా ఉపయోగిస్తారు. ముడుతలు వంటి అనేక చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.

4. రక్తపోటును తగ్గించటానికి సహాయం

4. రక్తపోటును తగ్గించటానికి సహాయం

కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక రక్తపోటుతో బాధపడుతున్న అనేకమంది ప్రజలు మందార ఆకు టీ సేవించడం వలన రక్తపోటు తగ్గిందని నిరూపణ జరిగింది. అందువల్ల దీనిని రక్తపోటు తగ్గించడానికి సాధారణ ఆహార వినియోగం కొరకు సిఫార్సు చేయబడింది.

5. గాయాల చికిత్సకు

5. గాయాల చికిత్సకు

మందార నూనె ఓపెన్ గాయాలు మరియు క్యాన్సర్ కారణంగా వచ్చే గాయాలకు రాయటం కొరకు ఉపయోగిస్తారు.ఇది క్యాన్సర్ ప్రారంభ దశల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఓపెన్ గాయాలను వేగంగా నయం చేయటంలో సహాయపడుతుంది.

6.తక్కువ కొలెస్ట్రాల్

6.తక్కువ కొలెస్ట్రాల్

మందార ఆకు టీ LDL కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దాని కంటెంట్ ధమనుల లోపలి భాగంలో పొరలు ఏర్పడకుండా నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా మీ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

7. జలుబు మరియు దగ్గు

7. జలుబు మరియు దగ్గు

మందార ఆకులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మందార ఆకు టీ మరియు ఇతర పదార్దాల రూపంలో సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు మరియు దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మీకు జలుబు చాల త్వరగా తగ్గటానికి సహాయపడుతుంది.

8. బరువు క్షీణత మరియు జీర్ణక్రియ

8. బరువు క్షీణత మరియు జీర్ణక్రియ

సహజ ఆకలిని తగ్గించి పథ్యసంబంధమైన బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది. మందార ఆకు టీ త్రాగటం వలన మీ శరీరంలో అనవసరమైన కొవ్వును తగ్గుతుంది. అంతేకాక ఆహార జీర్ణక్రియకు మరింత సమర్ధవంతంగా సహాయపడుతుంది.

9.రెగ్యులర్ ఋతు చక్రం

9.రెగ్యులర్ ఋతు చక్రం

మందార ఆకు టీ రెగ్యులర్ గా వినియోగించుట వలన శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గించడంలో మహిళలకు సహాయపడుతుంది.శరీరంలో సరైన ఋతు చక్రం నియంత్రించటంలో సహాయం మరియు సమతుల్య హార్మోన్ల స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

10. యాంటీ వృద్ధాప్యం

10. యాంటీ వృద్ధాప్యం

మందార ఆకులలో అనేక యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించటానికి సహాయం చేయుట వలన వృద్ధాప్య ప్రక్రియ మందగిస్తుంది. అంతేకాక కొన్ని సందర్భాలలో జీవితం కొనసాగింపు జరుగుతుంది.

English summary

Medicinal Uses Of Hibiscus Leaves

Hibiscus is beautiful flowering plant that grows in tropical and warm regions. It has a distinctively pretty flower in its wide variety of species.
Desktop Bottom Promotion