For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పికి పరిష్కార మార్గాలు..!

|

ప్రస్తుత కాలంలో తలనొప్పి ఒక సాధారణ ఆరోగ్య సమస్య. దాదాపు ప్రతి ఒక్కరూ తలనొప్పితో ఏదో ఒక సందర్భలో బాధపడతారు, కానీ కొన్ని చాలా అసౌకర్యం కలిగిస్తాయి. చాలా వరకూ ఒక వారంలో ఒకటి లేదా రెండు రోజలు మైగ్రేన్ తలనొప్పితో భాదపడుతుంటారు. ఎప్పుడైతే ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తుందో అప్పుడు ఒక మైగ్రేన్ పిల్స్(టాబ్లెట్)వేసుకొని ప్రస్తుతానికి ఉపశమనం పొందుతారు. ఈ తలనొప్పి వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.

మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారికి ఒక పక్క మొదలై తలమొత్తం వ్యాప్తిస్తుంది. మొదటి కొద్దిగా నొప్పి ఉన్న పోనుపోను తీవ్రత పెరుగుతంది. కొందరిలో కడుపులో వికారం, వాంతులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ నొప్పి వచ్చిన సమయంలో వారు సరిగా వెలుతురు చూడలేకపోవడం వల్ల శబ్దం వల్ల చికాకు కలుగుతుంది.. ఒకసారి తలనొప్పి మెదలైతే ఇది ఎక్కువ సమయం అంటే 12 నుండి 24 వరకు ఉంటుంది. చాలా సందర్భాలో ఈ తలనొప్పికి కారణాలు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు కారణాన్ని గుర్తించడం సాధ్యం కాకపోవచ్చు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

ఐస్ ప్యాక్: ఇది చాలా సింపుల్ హోం రెమడీ. ఐస్ ప్యాక్ ను తలకు పట్టించడం వల్ల రక్త ప్రసరణను పెంచి మెదడు కణాలకు మరియు నరాలకు రక్తాన్ని క్రమంగా సరఫరా చేస్తుంది. దాంతో తలనొప్పి తగ్గుతుంది. కాబట్టి ఐస్ క్యూబ్ తీసుకొని ముఖ్యం, మెడ, తల భాగంలో ఎక్కడ నొప్పి కలిగిస్తోందో అక్కడ స్ర్కబ్ చేయడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

ఓటిసి డ్రగ్స్: మైగ్రేన్ తలనొప్పి అధికంగా ఉన్నప్పుడు కౌంటర్ మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నయం చేస్తుంది. ఆస్పిరిన్ మరియు ఐబప్రోఫిన్ వంటి మందు తలనొప్పికి చాలా సాధారణంగా ఉపయోగించేటటువంటివి. అయితే వీటిని మోతాదుకు మించి ఉపయోగించకూడదు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

కాఫీ: ఇది నిజం ఒక కప్పు వేడి వేడి కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. తరచూ మైగ్రేన్ తో బాధపడుతున్నట్లైతే ఒక కప్పు వేడి కాఫీ తాగాలి. కాఫీలో ఉన్న కెఫిన్ మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

ఆరోమా థెరఫీ: ఆరోమా థెరఫీ మైగ్రేన్ అటాక్ నుండి కాపాడుతుంది. వివిధ రకాల ఆరోమాలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. శరీరాన్నిరిలాక్స్ పొందేలా చేయడంలో ఇవి బాగా సహాయపడుతాయి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు కమోమెలీ, పెప్పర్ మింట్, యూకలిప్టస్ వంటి సాధారణ సువాసనలు కలిగిన నూనెలను ఉపయోగించడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అంతే కాదు వివిధ రకాల హెర్బ్స్ తో కూడా మైగ్రేన్ కు ఉపశమనం పొందవచ్చు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

సుతిమెత్తని మసాజ్: మసాజ్ చాలా జబ్బులను నివారిస్తుంది. మెడ, భుజాల వద్ద ఉన్నకండరాలు మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతాయి. ఆ కండరాలు ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలంటే మంచి సున్నితమైన మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

మెగ్నీషియం పవర్: మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు మెగ్నిషియలోపం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి శరీరానికి కావల్సినంత మెగ్నీషియం అందించే మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ను తినడం వల్ల బ్లడ్ సర్కులేషన్ పెంచి, బ్లడ్ ప్లెజర్ లెవల్స్ ను క్రమం చేస్తుంది. దాంతో పాటు 500mg ల మెగ్నీషియం పిల్స్ ను తీసుకోవడం వల్ల కూడా మైగ్నేన్ నుండి ఉపశమనం పొందవచ్చు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

యోగ: యోగ సర్వ రోగ నివారిణి. మైగ్రేన్ కు బెస్ట్ ఆల్టర్ నేటివ్ హోం రెమడీ.రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల బయోకెమికల్స్ ను శరీరంలో రీస్టోర్ చేయడమే కాకుండా, హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ మరియు ఇతర యోగా ఆసనాలు తరచూ వచ్చే మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

హైడ్రో థెరఫీ: హైడ్రోథెరఫీ చాలా మేలు చేస్తుంది మరియు రక్తాన్ని రెగ్యులేట్ చేయడానికి బాగా సహాయపడుతుంది. రక్త సరఫరాను తలకు బాగా కలిగించడం వల్ల నొప్పి నివారించడం చాలా సులభ తరం అవుతుంది. మీ పాదాలను చల్లని నీటిలో ఉంచాలి. అలాగే అదే సమయంలో హాట్ వాటర్ బాటిల్ ను మీ తల వెనక భాగంలో మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తక్షణ ఉపశమనం కలిగించవచ్చు.

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

డాక్టర్: ఈ చిన్నచిన్న చిట్కాలను ఉపయోగించి మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవాలి. అంతకూ తగ్గక పోతే తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి.

English summary

Migraine Headaches Remedies | మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

Migraine is a severe form of headache which can make leading a normal and healthy life quite difficult. This disorder has symptomatic of nausea, increases photo sensitivity, blind spots, flashes of light and pain in neck.
Desktop Bottom Promotion