For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరంలోని ఈ నొప్పులను అశ్రద్ద చేయకండి

By Mallikarjuna D
|

మనలో చాలా మంది అప్పుడప్పుడు ఉన్నపలంగా ఆనారోగ్యపాలవుతుంటారు. ముఖ్యంగా ఉన్నట్లుండి నొప్పులు మరియు నొప్పి యొక్క లక్షణాలు శరీరంలో మొదలవుతుంటాయి. ఇవి ప్రతి ఒక్కరికీ సర్వ సాధరణంగా ఉంటాయి. అయితే కొన్ని లక్షణాలు మాత్రం అవి ఎందుకు వస్తుంటాయో తెలియదు. కొన్ని నొప్పులకు మాత్రం ఫిజికల్ స్ట్రెస్ మరియు స్ట్రెయిన్, అనారోగ్యరంగా తినడం మరియు జీవనశైలి మరియు అపక్రమ వ్యాయామాలు ఇలా చాలా కారణాలుంటాయి.మనకు తెలియకుండా, మరియు మనం కనిపెట్టలేనటువంటి లక్షణాలు ఏవైనా మనలో కనిపించినప్పుడు మన శరీరంలో ఏదో జరకూడనిది జరుగుతోందని పసిగట్టాలి.

బాడీ పెయిన్స్ అనేవి సహజమైనా, వాటిని తేలికగా తీసుకోకూడదు. తరచూ మరియు పదేపదే వచ్చే బాడీపెయిన్స్ మన శరీర జీవక్రియల్లో కొన్ని సమస్యల తెలియజేస్తాయి . ఆరోగ్యపరంగా తలనొప్పి, కీళ్ళనొప్పులు, బాడీపెయిన్స్ అనేటివి సాధారణంగా వచ్చినా కూడా, ఇవి దీర్ఘకాలం పాటు కొనసాగినా లేదా ఎక్కువ నొప్పి బాధిస్తున్నా వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇటువంటి లక్షణాలు, మైగ్రేన్ లేదా మెదడుకు సంబంధించ ఆరోగ్య సమస్యలు అయుండవచ్చు. అవి ప్రాణానికి ముప్పు తీసుకొస్తాయి. కాబట్టి అటువంటి వాటిల్లో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని కొన్నిఆరోగ్య లక్షణాలు మీకోసం వివరించబడింది..

ఛాతీ నొప్పి:

ఛాతీ నొప్పి:

కొన్ని రకాల ఆహారాలు గుండెల్లో మంటను లేదా అజీర్తిని కలిగిస్తాయి. అయితే వాటి మద్య తేడాను ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. వీటిలో దేవి వల్ల అధికంగా నొప్పి కలిగిస్తుందో తెలుసుకోవడం వల్ల ప్రమాదంను అరికట్టవచ్చు . ఛాతీ నొప్పి ఏ రకంగాను విస్మరించకుండా వెంటనే డాక్టర్ ను సందర్శించడం మంచిది. మీ గుండె కొంచెం బరువుగా అనిపించడం, లేదా నొప్పి, వంటివి గుండె పోటుతో ఉన్న అనేక చిహ్నాలలో ఒకటి కావచ్చు.

తలనొప్పి:

తలనొప్పి:

అకస్మికంగా మీ మెదడులో ఒక వ్రణము రక్తనాళలు చిట్లడం వల్ల సడెన్ గా ఒక బాధాకరమైన తలనొప్పి గురిచేస్తుంది. దీన్నే అరిగిన ఎన్యూరిజం అని, దీనికి తక్షణ శ్రద్ద తీసుకోవడా చాలా అవసరం. ఇలా జరిగినప్పుడు అదనపు లక్షణాలుఛాతీ నొప్పి, అలసట మరియు క్షీణిస్తున్న దృష్టి, కలిగి ఉంటాయి., గుండె మెదడులో పొడిచినట్లుగా పోటు లేదా నాడీ మండల పుటలను సూచిస్తుంది. ఏమి చేయాలి: మీరు ఎటువంటి లక్షణాలతో తలనొప్పి కారణం అవుతుందో విశ్లేషించి, పరీక్షలు చెయ్యాల్సి ఉంటుంది మీ GP అడగండి.

ఆబ్డామినల్ పెయిన్ :

ఆబ్డామినల్ పెయిన్ :

నివారించలేని కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, పురుషుల్లో కంటే మహిళల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకు కారణం రుతుక్రమం వల్ల అలా జరవచ్చు. కానీ అంతే కంటే ఎక్కువ సార్లు మీరు కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతన్నట్లైతే అందుకు గల కారణాన్ని ముఖ్యంగా తెలుసుకోవాలి. తర్వాత పొట్టలో గ్యాస్ ను వదిలించుకోవాలి. కడుపు ఉదర బాగం నొప్పిగా ఉన్నప్పుడు లేదా తినడానికి అసౌకర్యం కలిగించవచ్చు. ఇది ఒక అంతర్లీన స్త్రీ జననేందియ సమస్య కారణంగా కావచ్చు. దీన్ని పరీక్షించవల్సి ఉంటుంది. అందుకు మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి.

కాళ్ళనొప్పులు:

కాళ్ళనొప్పులు:

కాళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులు ఒత్తిడి, అపక్రమ ఆహార నియమాలు మరియు పోషక లోపాలు వల్ల కాళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులకు కారణం కావచ్చు. కొన్ని సార్లు, స్త్రీలలో రుతుక్రమ సమయంలో కూడా కాళ్ళ నొప్పులకు కారణం కావచ్చు. కాలి నొప్పితో కాళ్ళు వాపు ఉన్నట్లైతే రక్తం గూడుకట్టడం వల్ల జరగవచ్చు, ఆర్థరైటిస్,మొదలగునవి. రెగ్యులర్ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ బొప్పి మరియు స్నాయువు సమస్యలు సంబంధించినది. మన శరీరంలో కాళ్ళు చాలా ముఖ్యమైన బాగం. కాబట్టి, కాళ్లు నొప్పులు సంబంధించిన నొప్పులను పట్టించుకోకుండా ఉండకండి .

బ్యాక్ పెయిన్

బ్యాక్ పెయిన్

బ్యాక్ పెయిన్ - సరిగా కూర్చొకపోవడం లేదా పడుకొన్నప్పుడు సరైన భంగిమలో పడుకోకపోవడం వల్ల, ఫ్యాట్ లేయర్స్ నిర్మింపబడుటం వల్ల లేదా మరియు ఇతర కారణాల వల్ల కూడా వెన్ను నొప్పి రావచ్చు. కానీ , ఈ నొప్పి తరచుగా బాధిస్తుంటే, అప్పుడు, మీరు spondalysis మరియు వెన్నెముక వ్యాధులతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. వెన్నునొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి, ఈ నిప్పిని నిర్లక్ష్యం చేయకండి.

నిర్లక్ష్యం

నిర్లక్ష్యం

మన శరీరంలో ఈ నొప్పులు చాలా ముఖ్యమైనవి మరియు వీటిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. మరియు ఇతర నొప్పులు పంటి , కళ్ళు , ఎముక కీళ్ళు మరియు కండరములు యొక్క ఇతర నొప్పులు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి మరియు మీ శరీరంలో నొప్పి దీర్ఘకాలికంగా బాధిస్తుంటే డాక్టర్ ను తప్పనిసరిగా వెళ్ళాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

English summary

Pains in your body you should not ignore

Body pains are very common occurring sickness to a lot of individuals. There could be many reasons for such pains, like physical stress and strain, unhealthy eating and living habits and irregular exercising.
Story first published: Friday, November 29, 2013, 18:02 [IST]
Desktop Bottom Promotion