For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్ఞానదంతాల నొప్పికి ఉపశమనం కలిగించే స్మూత్ ఫుడ్స్

|

జ్ఞానదంతం వచ్చే సమయంలో కొన్ని సమస్యలు వస్తాయి. సాధారణంగా ఇవి 18 నుంచి 24 ఏళ్ల వయసులో అంటే జ్ఞానం వచ్చాక వస్తాయి. అందుకే వీటిని జ్ఞానదంతాలు అంటారు. ఇలా ఇవి వచ్చే సమయంలో పన్ను అమరడానికి తగినంత చోటు లేక ఒక్కోసారి ఇది సగమే రావచ్చు. దాన్ని ఇంపాక్టెడ్ విజ్‌డమ్ టీత్ అంటారు. సగమే బయటకు వచ్చిన ఈ పంటి చుట్టూ ఆహార కణాలు చేరుతాయి. ఈ సమస్య ఉన్నప్పుడు జ్ఞానదంతం ప్రాంతంలో భరించరాని నొప్పి, వాపు రావడం, నోరు తెరవలేకపోవడం, నోటి నొప్పి చెవి, మెడకు వ్యాపించడం, తలనొప్పి, పక్కపళ్లకూ నొప్పి వ్యాపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

అలాంటి సమయంలో ఏదైనా ఆహారం తిన్నా భరించలేని నొప్పి?అలాంటప్పుడు మనం ఏం చేయాలి?సున్నితంగా మ్యానేజ్ చేయాలి? లేదా కడుపు నింపుకోవడనానికి, అదే సమయంలో నిప్పిని నివారించేటటువంటి మృదువైన ఆహారాలు తీసుకోవాలి. జ్ఞానదంతం వచ్చేసమయంలో భరించలేని నొప్పి ఉన్నప్పుడు , ఫైబర్ , విత్తనాలు కలిగి ఆహారాలు తీసుకోకూడదని చాలా మంది సూచిస్తుంటారు. అందుకు ముఖ్య కారణం ఇటువంటి ఆహారాలు పళ్ళలో ఇరుక్కుపోతాయి, తర్వాత పరిస్థితి తీవ్రతను పెచి నొప్పి మరింత ఎక్కువచేస్తాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని సాఫ్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జ్ఞానదంతం నొప్పినుండి కొంత ఉపశమనం కలుగుతుంది. మరియు మంచి పోషకాలను మరియు క్యాల్షియంను అంధిస్తాయి. ఈ సాప్ట్ ఫుడ్స్ ఇటువంటి సమయంలో తీసుకోవడానికి కొన్ని సాఫ్ట్ ఫుడ్ మీకోసం అంధిస్తున్నాయి. ముఖ్యంగా గుర్తించుకోవాల్సి నొప్పి అధికంగా ఉండి బాధపడేటప్పుడు కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి జ్ఞానదంతం నొప్పి నివారణకు ఉపశనం కలిగించే ఆహారాలేంటో క్రింది విధంగా ఉన్నాయి. ఒక సారి పరిశీలించండి....

సూప్స్:

సూప్స్:

మీరు మాంసాహార ప్రియులైతే వేడి వేడి చికెన్ సూప్ లేదా కార్న్ సూప్ లను తీసుకోవచ్చు . ఈ సూపులు తయారు చేసేటప్పుడు వీటిలో గుడ్డును కూడా చేర్చడం వల్ల ఈ సమయంలో మీకు కావల్సినంత క్యాల్షియంను అంధిస్తుంది.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు:

నాలుగు బంగాళదుంపలను ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి, చిదిమి, మిరియాలపొడి చల్లి తీసుకోవచ్చు. పంటి నొప్పి నుండి ఉపశనమం కలిగించే ఐరన్ మరియు జింక్ బంగాలదుంపలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే మిరయాల్లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతాయి.

గుడ్డు:

గుడ్డు:

జ్ఞానదంతం నొప్పితో బాదపడేటప్పుటు పచ్చి గుడ్డును పగొలగొట్టి అలాగే తాగవచ్చు. ఈ సాఫ్ట్ ఫుడ్ నొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది .

ఓట్స్:

ఓట్స్:

జ్ఞానదంతాల నొప్పి నివారణకు ఓట్ మీల్ ఒక బెస్ట్ ఫుడ్. ఒక కప్పు ఓట్ మీల్ ను, బాగా మెత్తగా ఉడికించి చిదిమి, అందులో అరటి పండు వేసి తినవచ్చు.

పెరుగు:

పెరుగు:

జ్ఞానదంతాల నొప్పి నివారణకు మరో మృదువైన ఆహారం పెరుగు. పంటినొప్పి ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు బాగా చల్లగా ఉండే చిక్కటి పెరుగును తీసుకోవడం వల్ల నొప్పి నివారిస్తుంది.

జెల్లీ:

జెల్లీ:

జెల్లీలో వివిధ రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినది మీకు సౌకర్యవంతమైనది తినొచ్చు. ఆరెంజ్ మరియు స్ట్రాబెర్రీ జెల్లీ తినడం వల్ల పుష్కలమైన విటమిన్ సి అందుతుంది. ఇది పంటినొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

వెజ్ జ్యూస్:

వెజ్ జ్యూస్:

జ్ఞానదంతాల నొప్పితో బాధపడుతున్నప్పుడు వెజిటేబుల్ జ్యూస్ చాలా ఉత్తం. క్యారెట్ జ్యూస్ మరియు నిమ్మరసం వంటివి తీసుకోవడం వల్ల తక్షణ ఉపశనమనం కలిగిస్తాయి.

పండ్ల రసాలు:

పండ్ల రసాలు:

జ్ఞానదంతాల నొప్పితో మీ నోరు బాగా వాచినప్పుడు, మీకు అనుకూలమైన ఆహారం పండ్లతో తయారు చేసిన స్మూతీస్. గ్రేప్ మరియు స్ట్రాబెరీ జ్యూలు బెస్ట్ .

ఐస్ క్రీమ్:

ఐస్ క్రీమ్:

జ్ఞానదంతాల నొప్పితో బాధపడుతున్నప్పుడు డెంటిస్ట్ చల్లని ఐస్ క్రీమ్ తినమని సలహా ఇస్తుంటారు. ఇది జ్ఞానదంతాల నొప్పిని నివారిస్తుందంటారు? ఎందుకంటే ఇది డైరీ ప్రొడక్ట్ మరియు ఇందులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది.

పోరిడ్జ్:

పోరిడ్జ్:

మీకు జ్ఞానదంతాల నొప్పి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి ఆహారాలు నొప్పినివారించడానికి బాగా సహాయపడుతాయి.

చీజ్ కేక్:

చీజ్ కేక్:

చీజ్ కేక్ చాలా అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది. ఇటువంటి సాఫ్ట్ ఫుడ్స్ జ్ఞానదంతాల నొప్పితో బాధపడేవారి ఉపయోగకరంగా ఉంటాయి . బ్లూ బెర్రీ, మ్యాంగ్ చీజ్ కేక్ ఉత్తమం.

పండ్లు:

పండ్లు:

సాఫ్ట్ గా ఉండే పండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. నోట్లో పెంటుకోగానే కరిగిపోయే పండ్లు అరటి, మెలోన్ మరియు బ్లూ బెర్రీలు జ్ఞానదంతాల నొప్పి నివారించడానికి ఉత్తమమైన పండ్లు.

English summary

Soft Foods To Ease Wisdom Tooth Pain

Suffering from wisdom tooth pain and just not able to eat a nice meal? What should you do? Starve and manage the pain? Or eat soft foods which will fill your tummy and at the same time relieve your pain too.
Desktop Bottom Promotion