ప్రతి దినం వ్యాయామం చేస్తున్నారా..? ఐతే నో టెన్షన్...!

By Super

ఆరోగ్యం అనేది ఆహరం, వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినే దాని గురించి జాగ్రత్త తీసుకుంటాం గానీ, శారీరిక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది, మీ ఆరోగ్యం స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు వున్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరి కొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి.

వ్యాయామాలు చేయడం వల్ల వచ్చే 20 ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ పొందుపరచాము.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మానసికమానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది:

రోజూ 30-45 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం వుంటుంది. అది మీ మూడ్ ను బాగుండేలాగా కూడా చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మీ శరీరంలో కొత్త న్యూరాన్లు పుడతాయి, దానివల్ల అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరి చేరవు. జీవితం తుది దశలో డిమెన్షియా లాంటి వ్యాధుల నివారణకు కూడా వ్యాయామం పనికి వస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

శృంగారం ఆస్వాదించేలా చేస్తుంది:

నిత్యం వ్యాయామం చేయడం వల్ల మీ శక్తి స్థాయి పెరిగి మీ భాగస్వామి ముందు మిమ్మల్ని ఆకర్షణీయంగా నిలబెడుతుంది. నిత్యం శారీరిక వ్యాయామం చేయడం వల్ల స్త్రీలకు కూడా మెరుగైన ప్రేరేపణ వుంటుంది, అలాగే మగవారిలో అంగస్తంభన సమస్యలు లేకుండా చేస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

ఆందోళనను దూరంగా ఉంచుతుంది:

వ్యాయామం చేయడం వల్ల నిత్యం ఆందోళన పడటం తగ్గి, ప్రశాంతత చేకూరుతుంది, దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది - మీ మనసు ఆందోళనలకు దూరంగా వుంటుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

నిత్యం వ్యాయామం చేసే వారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర వుంటే, శారీరక వ్యాయామం మీరు దీర్ఘ కాలం ఆరోగ్యంగా వుండే అవకాశాలను మెరుగు పరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకుని ప్రేరణ పొందండి.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

బరువు నియంత్రించు కోవచ్చు:

మంచి ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలనేది అందరి స్వప్నం, నిత్యం వ్యాయామం చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తో పాటు సరిపడా వ్యాయామం చేస్తే, మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయ పడుతుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

వ్యాయామం చేయడం బరువు తగ్గడానికే కాదు, ఇప్పటికే అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నిత్యం వ్యాయామం చేస్తే రక్తంలో చక్కర నిల్వలు నియంత్రణలో వుండి మధుమేహం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

రక్తపు రక్తపు పోటును నియంత్రిస్తుంది:

అధిక రక్త పోటును ‘నిశ్శబ్ద హంతకుడి'గా చెప్తారు, అధిక రక్త పోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ప్రతి వారు నిత్యం వ్యాయామం చేయాలి. వ్యాయామం కండరాలకు రక్త ప్రసరణను పెంచి, ప్రాణవాయువును సరఫరా చేస్తుంది. దీని వల్ల రక్త నాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడి, రక్త పోతూ తగ్గడానికి పనికివస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మీ శక్తిని పెంచుతుంది:

వ్యాయామం వల్ల మీకు చెమట పట్టి, నీరసం రావచ్చు, కానీ దీర్ఘ కాలంలో చూస్తె, అది మీ శక్తి పెరిగి అలసట తగ్గేలా చేస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మీ రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుంది:

నిత్యం వ్యాయామం చేయడం వల్ల మీ రోగ నిరోధక వ్యవస్థ బలపడి, మీకు వైరస్ ల వల్ల వచ్చే జలుబు, జ్వరం రాకుండా చూస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది:

ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బు, అధిక రక్త పోటు, స్ట్రోక్ లాంటివి రాకుండా మీకు మంచి ఆరోగ్యం ఉండేలా వ్యాయామం దోహదపడుతుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది :

వ్యాయామం మీ శరీరంలో మంచి కొలెస్టరాల్ ను పెంచి, చెడు కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. వ్యాయామం వల్ల మీ ధమనుల్లో మురికి చేరుకోకుండా వుంటుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మీ కండరాలను బలపరుస్తుంది :

వ్యాయామం వల్ల మీ కండరాలు కూడా బలపడతాయి, దాని వల్ల మీరు వయసు మీరినా చురుగ్గా కదలగలుగుతారు.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మూడ్ ను మెరుగు పరుస్తుంది:

మీకు భావోద్వేగభరితమైన ఉత్సాహం కావాలంటే, మీకిష్టమైన ఆహారం మీద ఆధార పడకండి, అలా జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయండి. వ్యాయామం వల్ల మీ మెదడు లోని రసాయనాలు ప్రేరేపితమై, మీ మూడ్ హాయిగా మారుతుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

బలాన్ని కలిగిస్తుంది:

నిత్యం వ్యాయామ౦ చేయడం వల్ల మీ కండరాల బలం పెరిగి, శక్తి, సహనం పెరుగుతాయి. వ్యాయామం వల్ల మీ కణాలకు సరిపడా ప్రాణవాయువు సరఫరా అవుతుంది, తద్వారా వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మంచి నిద్ర :

నిత్యం శారీరిక వ్యాయామం చేస్తే, రోజంతా పని చేసాక మంచం ఎక్కగానే చిన్న పిల్లల్లాగా హాయిగా నిద్ర పోగలుగుతారు. అయితే మంచం ఎక్కే ముందు మాత్రం వ్యాయామం చేయకుండా జాగ్రత్త పడ౦డి.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

మీ ఎముకలు బలంగా వుంటాయి:

నిత్యం వ్యాయామం చేయడం మీ ఎముకల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది, ఒస్టియోపోరాసిస్, ఆర్ధరిటిస్ లాంటి చాలా రకాల ఎముకల క్షీణత రోగాలు రాకుండా నిరోధిస్తుంది.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వ్యాయామం వల్ల కొలోన్ కాన్సర్, రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తుల కాన్సర్ లాంటి చాలా రకాల కాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ జీవితానికి వ్యాయామం జోడించి వివిధ రకాల కాన్సర్ ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

ఆయుర్దాయం పెరుగుతుంది :

నిత్యం వ్యాయామం చేయడం వల్ల మీ ఆయుష్షు పెరుగుతుంది, దీర్ఘ కాలం బతకాలన్న మీ ఆకాంక్షా తీరుతుంది. వ్యాయామం మీ జీవితానికి ఏళ్ళు పెంచడమే కాదు, మీరు ఆరోగ్యకరమైన రీతిలో పెద్ద వారయ్యేలా చేస్తుంది కూడా.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

వెన్ను నెప్పిని తగ్గిస్తుంది:

వెన్ను నెప్పి లేదా అసమ భంగిమ వల్ల బాధ పడేవారు కొద్దిగా సాగదీయడం, వ్యాయమ కదలికలు చేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. వెన్ను నెప్పి తగ్గించుకోవడానికి, నెప్పి లేని మందులు వేసుకోవడానికి వ్యాయామం ఒకటే అత్యుత్తమ మార్గం.

వ్యాయామం వల్ల 20 అత్యుత్తమ ఆరోగ్య లాభాలు !!

అధ్యయన సామర్థ్యం పెరుగుతుంది:

నిత్యం వ్యాయామం చేస్తే మెదడు లో కొత్త కణాల ఉత్పత్తికి కారణమైన రసాయనాల స్థాయి పెరిగి మెదడు కణాల మధ్య సంబంధాలు మెరుగు పడి, కొత్త విషయాలు త్వరగా ఆకళింపు చేసుకుని, నేర్చుకుంటారు. టెన్నిస్, బాస్కెట్ బాల లాంటి క్లిష్టమైన వ్యాయామాలు మీ దైనందిన వ్యాయామంలో చేర్చుకుంటే మీ అధ్యయన, ధారణ సామర్థ్యాలు పెరుగుతాయి.

Story first published: Sunday, June 2, 2013, 12:21 [IST]
Desktop Bottom Promotion