For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పని వేళల్లో బద్దకాన్ని వదిలించుకోవటానికి ఉపాయాలు

|

ఉదయం నుంచి అప్పటివరకు పనిచేసి మధ్యాహ్న భోజనం కొంచెం హెవీగా తీసుకొంటే వెంటనే అలసట,బద్ధకం ప్రవేశిస్తాయి. దీనిని ప్రతి ఉద్యోగస్తుడు సాదారణంగా ఎదుర్కొనే సమస్యగా చెప్పవచ్చు. ఉదయం అంతా పనిలో శ్రమించిన తర్వాత మధ్యాహ్న భోజనం హెవీగా తీసుకొంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి శరీరం తొందరగా అలసిపోతుంది.

మీకు ఆ సమయంలో బద్ధకం అనుభూతి కలిగి కొంచెం నిద్ర పట్టవచ్చు. సాధారణంగా సోమరి మధ్యాహ్నాలు మీకు తలనొప్పి ఉండేటట్లుగా చెయ్యవచ్చు. అందువలన మీ శరీరం చాలా అలసటతో ఉండుట వలన నిద్ర అవసరం అవుతుంది. అందువలన ఈ మధ్యాహ్న బద్ధకంను ఓడించడం చాలా కఠినమైనదిగా చెప్పవచ్చు. అయితే మీరు ఒక హేవీ మధ్యాహ్న భోజనం తర్వాత శక్తిని పొందే అనుభూతి కొరకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి.

ఉదాహరణకు మీరు భోజనం తరువాత ఒక చిన్న నడక కోసం బయటకు వెళ్లితే శక్తిని పొందే అనుభూతికి సహాయపడుతుంది. మీరు కొన్ని నిమిషాలు మీ సహోద్యోగితో మాట్లాడవచ్చు. ఇది మీ మెదడును ఉత్సాహంగా ఉంచి మీరు కార్యాలయంలో పని చేయడానికి కావలసిన శక్తిని పొందటానికి సహాయపడుతుంది.

మధ్యాహ్న బద్దకాన్ని తొలగించాలంటే మీరు తినే ఆహారాన్ని తప్పనిసరిగా గమనించాలి. ఉదాహరణకు రిచ్ ఆహారాలు తక్కువ జీర్ణశక్తి కలిగి ఉంటాయి. శరీరంలోని శక్తి ఆహార అణువులను విడగొట్టి మరియు జీర్ణంనకు సహాయం చేస్తుంది. దానికి బదులుగా మిమ్మల్ని మధ్యాహ్నం బద్ధకం అనుభూతికి గురిచేస్తుంది. మధ్యాహ్నం శక్తిని పొందాలంటే తేలికపాటి అలవాట్లు ఉండాలి.

పని వేళలలో మధ్యాహ్న బద్దకాన్ని వదిలించుకోవటానికి ఉపాయాలు

తేలికపాటి భోజనం

తేలికపాటి భోజనం

మధ్యాహ్న బద్దకాన్ని వదిలించుకోవటానికి ఒక తేలికపాటి భోజనం తీసుకోవాలి. ఉదాహరణకు సులభంగా జీర్ణమయ్యే సలాడ్లు మరియు పుష్టికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి.

సంగీతం వినండి

సంగీతం వినండి

ఒక హేవీ భోజనం తర్వాత మిమ్మల్ని ఉత్తేజపరిచేందుకు మరియు నిద్ర వచ్చే ఫీలింగ్ నుండి నిరోదించటానికి సంగీతం వినండి. ఫాస్ట్ సంగీతం బద్దకాన్ని తగ్గించటానికి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

స్ట్రెచ్

స్ట్రెచ్

స్ట్రేచింగ్ లేదా కొన్ని సమాన కొలతలు గల వ్యాయామాలు చేయడం అనేది మధ్యాహ్న బద్దకాన్ని నివారించేందుకు ఉన్న ఉపాయాలలో ఒకటిగా చెప్పవచ్చు. స్ట్రేచింగ్ చేయుట వలన అలసిపోయిన కండరములు తెరుచుకోవడంతో మీ శరీరం మరియు మనస్సు రిఫ్రెష్ అవుతాయి.

పుదీనా తినండి

పుదీనా తినండి

పుదీనా మంచి సువాసనతో ఉండి మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. మీకు ఒక హేవీ భోజనం తిన్నతర్వాత నిద్ర ఫీలింగ్ ఉంటే కొన్ని పుదీనా ఆకులను నమలండి.

మీ సిస్టమ్ వదిలి బయటకు వెళ్ళండి

మీ సిస్టమ్ వదిలి బయటకు వెళ్ళండి

బయటకు వెళ్ళటం అనేది మధ్యాహ్న బద్దకాన్ని వదిలించుకోవటానికి మరొక ఉపాయంగా చెప్పవచ్చు. మీరు ఒక హేవీ భోజనం చేసినట్లైతే చిన్న నడక కోసం తప్పనిసరిగా బయటకు వెళ్ళాలి. ఇది జీర్ణక్రియ సులభం చేయుట మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.

మీ సహ ఉద్యోగితో చర్చ

మీ సహ ఉద్యోగితో చర్చ

మీకు పని మరియు భారీ భోజనం తర్వాత నిద్ర వచ్చినట్లైతే వెళ్ళి మీ సహోద్యోగితో మాట్లాడటానికి ప్రయత్నించండి. సిస్టమ్ ముందు కూర్చొని అదే పనిగా పని చేయడం వలన మీకు ఎక్కువ మందకొడి అనుభూతి కలుగుతుంది.

కాఫీ

కాఫీ

ఒక కప్పు కాఫీ ఖచ్చితంగా మీకు మధ్యాహ్న బద్దకాన్ని నివారించేందుకు సహాయం చేస్తుంది. మీకు కావాలంటే అలసిపోయి మీ మూడ్ నుండి తాజాగా ఉండుటకు ఒక కప్పు టీ కూడా త్రాగవచ్చు.

ఫోన్ చేయండి

ఫోన్ చేయండి

మీరు ఒక హేవీ భోజనం తరువాత నిద్ర మరియు అలసిన ఫీలింగ్ ఉంటే మీ సెల్ ఫోన్ తో ఎవరికైనా కాల్ చేయండి. అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. అంతేకాక ఇది పూర్తిగా మీ మానసిక స్థితిని మారుస్తుంది.

డార్క్ చాక్లెట్ తినండి

డార్క్ చాక్లెట్ తినండి

డార్క్ చాక్లెట్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అందువలన మీరు ఒక హేవీ భోజనం తరువాత మీరు డార్క్ చాక్లెట్ తింటే అలసట,బద్ధకం దూరం అవుతాయి.

నీరు త్రాగండి

నీరు త్రాగండి

నీరు త్రాగటం వలన హైడ్రేటెడ్ మరియు మీ శరీరం యొక్క జీవక్రియ పెరుగుతుంది. శరీరంలో నీరు నిలుపుదల మిమ్మల్ని మరింత అలసిపోయిన అనుభూతికి గురి చేస్తుంది.

English summary

Tricks To Avoid Afternoon Slump At Work

After a work filled morning which is followed by heavy lunch, you tend to feel tired and slump in the afternoon. This is a common problems working professionals face on a regular basis. 
Story first published: Friday, November 1, 2013, 15:30 [IST]
Desktop Bottom Promotion