For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు ఎప్పుడూ అలసటగా అనిపించడానికి 10 ముఖ్య కారణాలు

|

సాధారణంగా కొంత మంది ఎప్పుడూ అలసటగా, నీరసంగా కనబడుతుంటారు. నిద్రలేవడానికి కూడా వీలుపడనంతగా అలసట చెందుతుంటారు. నిద్రలేచినా ఏ పనిచేయాలన్నా మూడ్ ఉండదు. ఏపనిచేయాలన్నా, శరీరంలో ఏమాత్రం శక్తిలేనట్టు ఫీలవుతుంటారు. అంతే కాదు, ఈ అలసట కారణంగా వ్యాయామాలకు దూరంగా ఉంటారు. ఇంకా జిమ్ కు వెళ్ళకుండా వాయిదాలు వేస్తుంటారు. ఇవి అలసట, ఆయాసం, నీరసంకు ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. అయితే ఎప్పుడతే అతిగా ఆటలాడటం, లేదా అతిగా పనిచేయడం, లేదా ఎక్కువ సమయం పనిచేయడం వల్ల అలసటకు గురైవుతుంటారు. ఇది సహజం. ఆటలాడితేనే కాదు, రోజంతా పనిచేసినా అలసిపోతారు. ఎక్కువ దూరం నడిచినా అలసిపోతారు. అలసట అనేది అందరిలో జరుగుతుంది. ఇదొక రసాయనిక చర్యేకాదు, జీవన క్రియకూడా. అయితే ఎటువంటి శారీరక శ్రమలేకుండా, ఎటువంటి శక్తిని ఉపయోగించకుండానే, అనవసరంగా ఎప్పుడూ అలసటకు గురిఅవుతుంటే, అప్పుడు మీలో ఆరోగ్యపరంగా సమస్యలున్నట్లు గుర్తించాలి. మీరు తరచూ ఎందుకు నీరసం, అలసటకు గురౌతున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

అన్ని వేళలా మీరు ఎందుకు అలసట చెందుతున్నారు లేదా శక్తిలేకుండా ఉన్నట్లు భావిస్తున్నారు ? మీరు చాలా హార్ట్ గా ఎక్కువ సమయం పనిచేస్తున్నా లేదా అధిక ఒత్తిడిలో ఉన్నారా? ఆఫీసుల్లో పనిచేసే వారికి ఎటువంటి శారీర శ్రమ లేకుండానే, ఎప్పడూ అలసటకు గురౌతుంటే, డెస్క్ జాబ్ ల వల్ల మీరు చాలా తక్కువ క్యాలరీలను కరిగించుకుంటున్నారు. మరి అయితే మీలో అలసటకు మరియు ఆయాసానికి శక్తిలేకుండుటకు కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు?

అలసట అనేది మనస్సుకు సంబంధించినది. మరి మీ శరీరం శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నది అని తెలుపుతుంది. మీలో ఏవైనా కొన్నిప్రత్యేకమైన ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఉన్నట్లైతే అప్పుడు మీ శరీరం ఆకలి కలిగి ఉంటుంది మరియు క్యాలరీలు కరగడానికి తిరస్కరిస్తుంది. అందువల్ల ఎప్పుడూ అలసటగా భావిస్తుంటారు. అలా కాకుండా మీరు ఎప్పుడూ అలసటకు గురి అవ్వడానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవాలంటే ఈ క్రింది లిస్ట్ ను పూర్తిగా చదవాల్సిందే...

బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం:

బ్రేక్ ఫాస్ట్ దాటవేయడం:

రాత్రి నిద్ర, 8గంట నిద్ర తర్వాత, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ శరీరంలో ఉండే మిగిలని ఎనర్జీ ఉపయోగించకోవడం, దాని తర్వాత మధ్యహ్నానం తీసుకొనే ఆహారం ఎనర్జీగా మార్పు చెందక, ఫ్యాట్ గా మారడం వల్ల శరీరానికి తగిన శక్తి పొందకు అలసటగా భావిస్తుంటారు.

చాలా తక్కువగా నీళ్ళు త్రాగడం:

చాలా తక్కువగా నీళ్ళు త్రాగడం:

మన శరీరంలో అన్ని అవయవాలకు శక్తిని అందివ్వడానికి నీరు ఒక ట్రాన్స్ పోర్ట్ గా పనిచేస్తుంది. తగినన్నీ నీరు త్రాగకపోతే శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయలేవు.కాబట్టి, ఎప్పుడైతే మీరు సరిగా నీరు త్రాగరో అప్పుడు శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయవు. ముఖ్యంగా మెదడు చురుకుగా పనిచేయడానికి తగినంత ఎనర్జీ అందదు.

జంక్ ఫుడ్ తినడం వల్ల:

జంక్ ఫుడ్ తినడం వల్ల:

చాలా మంది ఫ్రైడ్ ఫుడ్స్ లో అధిక క్యాలరీలుంటాయని ఆలోచిస్తారు. మరి వీటిని తీసుకొన్న తర్వాత మీరు ఎందుకు ఎనర్జీగా కనబడరు?జంక్ ఫుడ్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని జీవక్రియలకు అవసరం అయ్యే శక్తిని అందివ్వవు. ఈ ఆహారాలకు ఎప్పుడూ విలువ ఉండదు.

వర్కౌట్ దాటవేయడం:

వర్కౌట్ దాటవేయడం:

వ్యాయామం మిమ్మల్ని మరింత ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. మిమ్మల్ని బయటకు అలసట చెందిన విధంగా అనిపించదు. ఎప్పుడైతే మీరు వ్యాయామం చేస్తారో అప్పుడు బ్లడ్ సర్కులేషన్ మరియు జీవక్రియల రేటు పెరుగుతుంది. ఇది మీ శరీరంలో ప్రతి అవయం తగినంత ఎనర్జీ పొందడానికి సహాయపడుతుంది. కాబట్టి, వ్యాయామం చేయకుండా సాకులు చెప్పడం ఇక నిలపండి.

అధిక నిద్ర:

అధిక నిద్ర:

అధికంగా నిద్రించేస్తాం. వారంలో తగ్గిన నిద్ర గంటలను ఈ సమయంలో వినియోగిస్తాం. ఈ రకమైన భావన మనం చెప్పుకునేదే. దీనికి సైంటిఫిక్ నిరూపణ లేదు. 8 గంటలకు బదులుగా 10 గంటలు నిద్రించినప్పటికి మీకు అధికంగా వచ్చే తాజాదనం ఏమీ లేదు. పైపెచ్చు, మీ సోమరితనం అంటే ఎక్కువ నిద్రించటం మీకు అలసట కలిగిస్తుంది.

డిప్రెషన్:

డిప్రెషన్:

కొన్ని సందర్భాల్లో అలసట అనేది మనస్సుకు సంబంధించినది. మీ మనస్సు ఎలా చెబితే అలా మీరు ఫీలవుతారు. మీరు ఎటువంటి శారీరక శ్రమ లేదా ఏ పనిచేయకుండా డిప్రెషన్ లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ అలసటకు గురైనట్లు అనిపిస్తుంది.

విటమిన్ బి12లోపం:

విటమిన్ బి12లోపం:

మీరు శాఖాహారులైతే, అప్పుడు ఖచ్చితంగా మీరు బి12 లోఫంతో బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే బి12విటమిన్ కేవలం అనిమల్ పుడ్స్ ద్వారానే అందుతుంది. ఈ పోషకాంశాలు నరాల మంచిఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

హార్ట్ డిసీజ్:

హార్ట్ డిసీజ్:

క్రోనిక్ అలసట అనేది ముందుగా గుండె సంబంధిత వ్యాధుల లక్షణాల్లో మొదటిది. గతంలో లాగే మీ శరీరంలో రక్తకణాలకు, కణజాలాలకు సరిగా రక్తం ప్రసరణ జరగకుండా ఉంటే అప్పుడు తగినంత శక్తిని పొందలేరు.

నిద్రలేమి:

నిద్రలేమి:

మీరు ప్రతి రోజూ సమయానికి నిద్రిస్తున్నా, మంచి నిద్రను పొందకపోవడం వల్ల లేదా కలత నిద్రవల్ల ఒత్తిడి లోనవ్వాల్సి వస్తుంది. ఈ నిద్రలేమి అసౌకర్యం వల్ల కూడా అలసటకు గురికావల్సి వస్తుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

మీరు సరైన సమయానికి నిద్రిస్తున్నా లేదా సరిగా భోజనం చేస్తున్నా అలసట చెందుతుంటే అది డయాబెటిక్ లక్షణంగా గుర్తించాలి. ఎందుకైనా మంచిది , ఒక సారి బ్లడ్ షుగర్ ను చెక్ చేయించుకోవాలి.

English summary

10 Reasons You Feel Tired All The Time

Why is it that you feel tired all the time and have no energy? Have you been working very hard lately or are you stressed out? We do not usually lift bricks at our office these days. In fact, you spend very few calories doing a desk job. Then what could be the reasons for feeling tired all the time.
Desktop Bottom Promotion