For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీఆరోగ్యం కాపాడుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆహారాలు

By Super
|

నిరంతరం రక్తంలోని వ్యర్ధాలను వడకడుతూ.. కిడ్నీలు(మూత్ర పిండాలు) మన శరీరంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ప్రాణావసరం. ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి అది విఫలమవటం ఆరంభమైందంటే దాన్ని పూర్తిగా నయం చేయటం కష్టం. పైగా చికిత్సకు ఎంతో ఖర్చు అవుతుంది. మూత్రపిండం పూర్తిగా విఫలమైతే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండక తప్పదు. ఈ ‘డయాలసిస్‌' కోసం నెలకు సుమారు రూ.4-5వేలు ఖర్చు అవుతాయి. అంతేకాకుండా ఇతరత్రా సమస్యలు ఏర్పడతాయి. చికిత్స తీసుకున్నా కిడ్నీ తిరిగి సమర్ధంగా మారదు.

శరీరం మొత్తాన్నీ శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. అవి ఒక్కసారి పనిచేయమని మొరాయిస్తే.. ఆరోగ్యం అస్తవ్యస్తం అయిపోతుంది. అంతటి ప్రాముఖ్యం ఉన్న కిడ్నీలను కాపాడుకోవాలంటే ముందు జీవనశైలి ఆరోగ్యంగా ఉండాలి. జీవన శైలి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మంచి ఆహారం తీసుకోవాలి. కిడ్నీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల కడ్నీ సమస్యలను అరకట్టవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం, కిడ్నీ ఇన్ఫెక్షన్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు. కిడ్నీని పదిలంగా ఉంచే కొన్ని ఆహారాలు మీ కోసం...

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో పొటాషియం మరియు విటమిన్ కె అధికంగా ఉంటుంది. క్యాబేజ్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. సాధారణంగా క్యాబేజ్ ను మూత్రపిండాల డ్యామేజ్ ను అరికట్టడానికి మరియు మూత్రపిండాల పోషణకు ఒక మంచి సహజ ఔషధంగా ఉపయోగిస్తారు.

 కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

కిడ్నీలకు ఆరోగ్యకరమైన ఆహారం కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ లో విటమిన్ సి పుష్కలం మరియు లో పొటాషియం కలిగి ఉంటుంది. అందువల్లే ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కిడ్నీలను శుభ్రం చేసి, డిటాక్సిఫై చేస్తుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి సూపర్ ఫుడ్ గా పేరొందింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీక్లోటింగ్ లక్షణాలు అంటే గుండె సంబంధిత వ్యాధులను పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి శరీరం మొత్తాన్ని శోధిస్తుంది.

ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతాయి. మరియు అతి సులభంగా జీర్ణం అవుతాయి. వీటిలో ఫైబర్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మూత్రపిండాలు నిర్విషీకరణం మరియు శుభ్రపరచడానికి బాగా సహాయపడుతాయి. మీరు డాక్టర్ కు దూరంగా ఉండాలంటే ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మంచిది!

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు, కిడ్నీలోని రాళ్ళను సహజంగా తొలగించడానికి సహాయపడుతాయి. అంతే కాదు, మూత్రపిండాలను నిర్విషీకరణం మరియు మూత్ర పిండాల శుభ్రతలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్ రక్తప్రసరణను పెంచడంలో ఎలా సహాయపడుతుందో మనందరికీ తెలిసిన విషయమే. మరియు మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను నిర్వహిస్తుంది. ఇంకా వీటిలో విటమిన్ బి6 మరియు విటమిన్ కె లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కూడా కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతాయి.

బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్:

కిడ్నీలను శుభ్రపరిచి మరియు శుద్ధి చేయు యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంథోసైయనీడిన్స్ (Anthocyanidins)పుష్కలంగా ఉన్నాయి. బ్లూ బెర్రీస్ లో సిట్రస్ ఆమ్లం మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి.

 బ్లాక్ బెర్రీ లేదా రాస్బెర్రీస్:

బ్లాక్ బెర్రీ లేదా రాస్బెర్రీస్:

రాస్బెర్రీస్ లో అలెర్జిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. రాస్బెర్రీస్ -బెర్రీ ఫామిలికీ చెందినవే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులను నిరోధించడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడానికి బాగా సహాయపడుతుంది.

గ్రేప్:

గ్రేప్:

ఇది కిడ్నీ హెల్తీ ఫుడ్. అందువల్లే దీన్ని మీ డైలీ డైయట్ లో ఖచ్చింతా చేర్చుకోవాలి. రెడ్ గ్రేప్స్ లో అధికంగా ఫ్లవనాయిడ్స్ కలిగి ఉండి, బ్లడ్ కాట్స్ ను తగ్గిస్తాయి. రెడ్ గ్రేప్స్ తరచూ తీసుకోవడం వల్ల గుండె మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించే అవకాశాలు ఎక్కువ. రెడ్ గ్రేప్ శరీరాన్ని డిటాక్స్ చేయడానికి మరియు క్లీన్ చేయడానికి బాగా సహాయపడుతాయి.

 బీఫ్:

బీఫ్:

బీఫ్ లో ప్రోటీనులు మరియు ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఆరోగ్యకరమైన కిడ్నీలకోసం చాలా అవసరం.

 క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్:

చెర్రీస్ లో అధికంగా విటమిన్స్ మరియు లోప్రోటీన్స్ కలిగి ఉంటాయి. చెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల శరీరంలోని పొటాషియం లెవల్స్ ను తగ్గించేదుకు సహాయపడుతుంది. దాంతో కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది.

గుడ్లు:

గుడ్లు:

గుడ్లులో ప్రోటీనులు మరియు విటమిన్ బి6 మరియు విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయి. ఎగ్ వైట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి మరియు అమినో ఆసిడ్స్ కూడా పుష్కలంగా ఉండి కిడ్నీ ఆరోగ్యానికి మాత్రమే కాదు మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

పాలు:

పాలు:

పాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా పనిచేయాలంటే, ఇది చాలా ముఖ్యమైన మరియు అవసరం అయినటువంటి ఆహారం. పాలు కిడ్నీ ఆరోగ్యానికి చాలా అవసరం మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

వివిధ రకాల ఆయిల్స్ లో ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి మరియు గుండెకు ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసిన విషయమే. ఆలివ్ ఆయిల్ లో యాంటీఇన్ ఫ్లమేటరీ ఫాటీ యాసిడ్స్ కలిగి ఉండి కిడ్నీ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.

నీళ్ళు:

నీళ్ళు:

కిడ్నీ వ్యాధులను నివారించుకోవాలంటే, నీరు తాగటం అవసరం. నీరు బాగా తాగితే బ్లాడర్, మూత్రకోశ వ్యాధులు కూడా నయం చేసుకోవచ్చు. నీరు శరీరంలోని ఉప్పు, యాసిడ్ స్ధాయిలను సమన్వయపరచి అన్నిరకాల నొప్పులు, మంటలు తగ్గిస్తుంది. నీరు వ్యాధి కలిగించే బాక్టీరియాను బయటకు పంపేస్తుంది.

Desktop Bottom Promotion