For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

|

ప్రతి రోజూ తగు మోతాదులో నీరు త్రాగడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయనే విషయం అందరికీ తెలిసిన విషయమే..! అదే తక్కువ నీరు త్రాగడం వల్ల కలిగే అనారోగ్యాలు అజీర్ణం, మలబద్దకం, తలనొప్పి, కిడ్నీలో రాళ్ళు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించాలంటే ప్రతి రోజూ తగుమోతాదులో నీరు సేవించాలి.

అన్నింటి కి దివ్య ఔషధం నీరు. శరీరములో జరిగే మెటబాలిక్ చర్యల్కు నీరు అతిముఖ్యము. చాలా మందికి తెలియకునా నీరు, నీటి శాతం ఎక్కువగా ఉన్న పానీయాలు సేవించడం వల్ల ఎన్నో జబ్బులు దరి చేరవు. శరీరము లొ రక్తంకి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉన్నది. మానవ శరీరములోని ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలము సరఫరా చేయడంలో నీరు భూమిక వహిస్తుంది.

వాతావరణంలోని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ల కలయిక వల్ల నీరు ఏర్పడు తుంది. ఈ రెండు వాయు పదార్ధాలు కలిస్తే ద్రవ రూపమైన నీరు ఏర్పడును. నిత్యజీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాం. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను తగ్గించే అవకాశం ఉంది. అవి ఏమిటంటే.

చర్మం కాలితే :

చర్మం కాలితే :

వెంటనే చల్లటి నీటితో కాలిన ప్రదేశం తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింతగా చర్మం కాలి పోకుండా ఉంటుంది.

దంతాల నొప్పి :

దంతాల నొప్పి :

గోరువెచ్చని నీటిలొ ఉప్పువేసి పుక్కిలించాలి.

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ :

మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ :

ఎక్కువనీరు త్రాగితే ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సూక్ష్మజీవులు వేగంగా, మూత్రం ద్వారా ఎక్కువగా విసర్జింపబడి ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

జ్వరం :

జ్వరం :

తడిగుడ్డతో/ మంచు ముక్కలతో శరీరం ముఖ్యంగా పాదాలు, ఆరిచేతులు తుడవాలి. దీనివల్ల 1-2 డిగ్రీల జ్వరం తగ్గుతుంది. గంటకు కనీసం ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది. శరీరం నుండి బయటికిపోయే నీరు భర్తీ అవుతుంది. నీరు ఆవిరి అవడంవల్ల చర్మం చల్లబడు తుంది. మలినాలు ఎక్కువగా విసర్జింప బడతాయి. ఇన్‌ఫెక్షన్‌ త్వరగా తగ్గుతాయి.

తలనొప్పి :

తలనొప్పి :

ఐస్‌ ముక్కలు నుదుటిపై రుద్దాలి.

గొంతునొప్పి, టాన్సిల్స్‌ :

గొంతునొప్పి, టాన్సిల్స్‌ :

నీరు వేడిచేయాలి. దానిలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిట పట్టాలి. ఉపశమనం కలుగుతుంది.

నిద్రపట్టకపోతుంటే :

నిద్రపట్టకపోతుంటే :

చల్లటి/ గోరువెచ్చటి నీటితో స్నానం చెయ్యాలి. పాదాలు వేడినీటి తో తడుపుకోవడం మంచిది.

ఒళ్ళు నొప్పులు :

ఒళ్ళు నొప్పులు :

వేడినీటిలో ఉప్పువేసి కాపడం కాయాలి. శరీరంలోనొప్పులు : వేడినీటి కాపడం, వేడినీటి ఆవిరి.

విరోచనాలు, వాంతులు :

విరోచనాలు, వాంతులు :

శరీరంలో నుండి ఎంతనీరు బయటికిపోతుందో అంతే పరిమాణంలో నీరు త్రాగితే నిర్జలీకరణం అరికట్టబడుతుంది.

మలబద్దకం :

మలబద్దకం :

ఎక్కువగా నీరు త్రాగాలి. రాత్రి రాగి చెంబులో నీరుపోయాలి. అది పరగడుపున త్రాగాలి. దీనివల్ల మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగును.

దగ్గు :

దగ్గు :

వేడినీరు త్రాగితే కఫం కరుగు తుంది. పసుపును మరిగే నీటిలో వేసి ఆవిరి పట్టాలి.

ఎక్కిళ్ళు :

ఎక్కిళ్ళు :

గోరువెచ్చని గ్లాసుడు నీరు నెమ్మదిగా సిప్‌ చేస్తూ త్రాగాలి.

మూత్ర పిండాలలో రాళ్ళు :

మూత్ర పిండాలలో రాళ్ళు :

ఎక్కువగా నీరు త్రాగాలి. చిన్న రాళ్ళు మూత్రం ద్వారా విసర్జింపబడతాయి. మూత్రం పలచబడడం వల్ల యూరిన్‌ యాసిక్‌ రాళ్ళు ఏర్పడవు. మూత్రకేశ సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉండే అవకాశం ఉంది.

ముక్కులోంచి రక్తం పడుతుంటే :

ముక్కులోంచి రక్తం పడుతుంటే :

చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వెయ్యాలి.

జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ :

జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ :

నీటిని మరి గించాలి. దానిలో కొద్దిగా పసుపు లేక యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండుచుక్కలు వేయాలి. ఆ నీటిఆవిరిపడితే మంచి రిలీఫ్‌.

రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

కేలరీల నియంత్రణ నీరు అండర్ రేటెడ్ బరువు కోల్పోవడం కొరకు ఒక ద్రవం అని చెప్పవచ్చు. దీనిని బరువు కోల్పోవడం కొరకు సహాయంగా అనేక సంవత్సరాలుగా డైటర్స్ ఉపయోగిస్తున్నారు. జీర్ణక్రియ సహాయం మరియు పరోక్షంగా ఆకలి అణచివేయడానికి సహాయపడి సున్నా కెలొరీలుగా చూపుతుంది.

రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

రెగ్యులర్ గా నీరు త్రాగడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్

హ్యాంగోవర్ నివారిణి మీరు చాలా సార్లు క్రమం తప్పకుండా మద్యం నుండి హ్యాంగోవర్ అనే ఒక సమస్యను ఎదుర్కొంటారు. మద్యం వలన అదనపు నిర్జలీకరణ జరుగుతుంది. మీరు హ్యాంగోవర్ ను జయించటానికి మీ శరీరంనకు నీరు చాలా అవసరం.

ఎనర్జీ:

ఎనర్జీ:

నీటిలో పోషక విలువలు సాధారణం అయినప్పటికీ మీకు నీరసం మరియు బలహీనముగా లేకుండా చేస్తుంది. మీరు నీటితో అలసట మరియు నిద్రమత్తుగా ఉండటాన్ని తగ్గించుకోవచ్చు. చల్లని నీరు తీసుకోవటం వలన శరీరంలో వేడిని తగ్గించటానికి అదనపు కెలొరీలు ఖర్చు అవుతాయి.

కుక్క కరిస్తే :

కుక్క కరిస్తే :

సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. గాయాన్ని కడగాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కల్గించే సూక్ష్మజీవులు, చొంగపోతాయి. తిరిగి సబ్బు నీటితో కడిగి కట్టుకట్టాలి.

చిన్న చిన్న గాయాలు :

చిన్న చిన్న గాయాలు :

చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకట్టి రక్తం కారడం తగ్గుతుంది.

English summary

20 Health benefits of Drinking Water

The world is abundantly covered in water amounting to 75% of the planet. Though, just about 2.5% of it is fresh water which can be used by humans. More than half our body, 60% of it, is composed of water.
Story first published: Saturday, March 22, 2014, 17:03 [IST]
Desktop Bottom Promotion