For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వైట్ రైస్ తినకపోవడం వల్ల పొందే 8గొప్ప ప్రయోజనాలు

|

ముందుగా నాన్ వెజ్ రెస్టారెంట్స్ మెను చూడగానే అందులో మొదట కనిపించేవి బిర్యానీ. బిర్యానీకి ముఖ్యపదార్థం బియ్యం. !బియ్యం ముఖ్యంగా బరువు తగ్గే ప్లాన్ లో ఉన్నప్పుడు వైట్ రైస్ మీ ఆరోగ్యానికి మంచిదేనా మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి?ఖచ్చితంగా కాదనే ప్రశ్న. బియ్యంతో తయారుచేసే అన్నం ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందివ్వవచ్చు. మీ శరీరాన్ని ఫిట్ గా ఉంచవచ్చు. కానీ, వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది మిమ్మల్ని బరువు పెరిగేలా చేస్తుంది. కాబట్టి, వైట్ రైస్ తినకపోవడం వల్ల మీరు పొందే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలపడం జరిగింది. ఇవి ఖచ్ఛితంగా మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తుంది. బరువు తగ్గించుకొనే ప్లాన్ లో ఉన్నప్పుడు అన్నం తినకపోవడం వల్ల పొందే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు.

వైట్ రైస్ లోని లాభ, నష్టాలను చూసుకుంటే సమతుల్యం చేస్తుంది. కొన్నినియమాల ప్రకారం చూస్తే రోజులో ఒక్క పూట అన్నం ఖచ్ఛితంగా అవసరం అవుతుంది. అయితే, అన్నం అధికంగా తినడం వల్ల మీరు హెవీగా ఫీలవుతారు . కాబట్టి, చాలా మంది ఎక్స్ పర్ట్స్ రాత్రి సమయంలో అన్నంను తినకూడదని సలహాలిస్తుంటారు. కాబట్టి, వైట్ రైస్ తినకపోవడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచుతుంది:

బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంచుతుంది:

వైట్ రైస్ తినకపోవడం వల్ల ముఖ్యంగా రాత్రుల్లో వైట్ రైస్ తీసుకోకపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ట్రాక్ లో ఉంటాయి . వైట్ రైస్ ను అధికంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి.

మలబద్దకం:

మలబద్దకం:

రెగ్యులర్ గా ఎక్కువ వైట్ రైస్ తీసుకోవడం వల్ల అధిక మలబద్దక లేదా జీర్ణ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. వైట్ రైస్ తినడం ఎందుకు ఆరోగ్యకరం కాదు అంటే ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ కు అంతగా సహాకరించదు. దాంతో జీర్ణ సమస్య మొదలవుతాయి.

డయాబెటిస్:

డయాబెటిస్:

వైట్ రైస్ తీసుకోకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ మీ ధరిచేరదు. అందువల్ల, వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ ను తీసుకోవడం ఉత్తమం.

కార్బోహైడ్రేట్స్:

కార్బోహైడ్రేట్స్:

మీ బరువును కంట్రోల్ చేసుకోవాలంటే కనీసం ఒక నెల లేదా రెండు నెలలో వైట్ రైస్ కు దూరంగా ఉండాలి . ఇందులో అధిక శాతంలో కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల మీ బరువును అమాంతం పెంచుతుంది.

న్యూట్రీషియన్స్:

న్యూట్రీషియన్స్:

వైట్ రైస్ తీసుకోకపోవడం వల్ల మీరు తీసుకొనే న్యూట్రీషియన్స్ మీద ప్రభావం చూపించకపోయినా, బ్రౌన్ రైస్ తో పోల్చితే వైట్ రైస్ లో తక్కువ న్యూట్రీషినల్ విలువలు ఉంటాయి.

గంజి ఎక్కువగా ఉంటుంది:

గంజి ఎక్కువగా ఉంటుంది:

హ్యూమన్ బాడీకి గంజి అంత మంచిది కాదు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను అధికంగా పెంచుతుంది. కాబట్టి, అన్నంకు దూరంగా ఉండటం మంచిది.

అలర్జీ:

అలర్జీ:

వైట్ అంటే కొంత మంది అలర్జీ. అందువల్ల వైట్ రైస్ తినకపోవడమే మంచిది . ప్రత్యామ్నాయంగా బ్రౌన్ రైస్ ను తీసుకోవచ్చు.

ఆకలి కోరికలను పెంచుతుంది:

ఆకలి కోరికలను పెంచుతుంది:

బ్రౌన్ రైస్ తో కంపేర్ చేస్తే వైట్ రైస్ తినడం వ్యర్థం. వైట్ రైస్ తిన్న మరికొంత సేపటికి మరింత ఆకలికి గురిచేస్తుంది. అందుకు కారణం బియ్యంలో ఉండే గంజి మరియు అధిక కార్బోహైడ్రేట్స్ వల్లే అని నిపుణుల అభిప్రాయం.

English summary

8 Benefits Of Not Eating White Rice

The first thing you look out for in a menu in a non-vegetarian restaurant is biriyani. The main ingredient for biriyani is rice! Ask yourself - Is rice healthy for me, if I am on a weight loss? Surely not! Rice has health benefits which will keep you fit, but it also has carbohydrates which will make you put on weight.
Story first published: Thursday, June 5, 2014, 16:03 [IST]
Desktop Bottom Promotion