For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హస్తప్రయోగం మీద అపోహలు తొలగించుకోండి...

By Super
|

హస్త ప్రయోగం సరైనదేనా ? అది నా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ జనం తరచుగా అడిగేవే. చాలా మంది హస్త ప్రయోగం చేస్తారు, కానీ తమ ఆరోగ్యం దెబ్బ తింటుందని భయపడుతూ ఉంటారు. కొంత మంది ఇది అనారోగ్యకరమని విని వుండడం వల్ల యుక్త వయసంతా దీనికి దూరంగానే వుంటారు. అందుకే హస్తప్రయోగం గురించిన కొన్ని అపోహలను ఇక్కడ పటాపంచలు చేస్తున్నాం, ఈ సారి మీరు బిడియపడకుండా హస్త ప్రయోగ చేయవచ్చు.

అపోహ 1 : ఆడపిల్లలు హస్త ప్రయోగం చేయరు

అపోహ 1 : ఆడపిల్లలు హస్త ప్రయోగం చేయరు

హస్తప్రయోగం మగవారిలో సాధారణంగా జరుగుతుంది, మరి ఆడపిల్లల మాట ఏమిటి? ఆడవారు హస్తప్రయోగం చేయరని చాలా మంది గట్టిగా చెప్తారు, ఆ అలవాటున్న ఆడపిల్లలు కూడా దీని గురించి మాట్లాడక పోవడం వల్ల ఈ అపోహ మరింత బలపడుతుంది. కానీ ఆడపిల్లలు కూడా హస్త ప్రయోగం చేస్తారు, వాళ్ళు చేయకపోవడానికి కారణాలు కూడా ఏమీ లేవు. నిజానికి ఒక అధ్యయనం ప్రకారం హస్త ప్రయోగం చేసుకునే ఆడవారిలో ఆత్మ గౌరవం చేయని వారిలో కన్నా ఎక్కువగా వుంటుంది.

 అపోహ 2 ; రుతుకాల౦లొ హస్తప్రయోగం చేయరు.

అపోహ 2 ; రుతుకాల౦లొ హస్తప్రయోగం చేయరు.

రుతుకాలంలో ఆడపిల్లలు సాధారణంగా హస్త ప్రయోగం చేయరు, ఎందుకంటే అది చాలా తప్పని వారికి చిన్నప్పటి నుంఛీ నేర్పించారు. కానీ నిజం ఏమిటంటే రుతుకాలంలో హస్తప్రయోగం (లేదా ఇతర రూపాలలో సెక్స్) చేయడం సురక్షితం, ఆరోగ్యకరం కూడా. కొంత మంది ఆడవారు ఋతు కాలంలో కలిగే శూల నుంచి ఉపశమనం పొందడానికి కూడా హస్తప్రయోగం చేస్తుంటారు.

అపోహ 3 : ఈడేరక ముందే హస్తప్రయోగం మంచిది కాదు

అపోహ 3 : ఈడేరక ముందే హస్తప్రయోగం మంచిది కాదు

యుక్త వయసుకు రాక ముందే హస్త ప్రయోగం చేయడం వల్ల ఎదుగుదల ఉండదని, జుట్టు రాలడం, నీరసం రావడం జరుగుతుందని పెద్దవారు చెప్పడం వల్ల పిల్లలు భయపడతారు. కానీ ఇది చాలా పిచ్చి నమ్మకం. ఎదిగే పిల్లలు తమ శరీర అవసరాలను కనుగొంటూ వుంటారు, హస్తప్రయోగం అలాంటి వాటిలో ఒకటి కనుక ఏ వయసులో చేసినా పూర్తిగా ఆరోగ్యకరమే. నిజానికి తమ మర్మావయవాలను తాకడం సహజైనదేనని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలని నిపుణులు అంటారు - అయితే పూర్తీ మరుగులోనే సుమా !

అపోహ 4 : అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల శృంగారేచ్చ నశిస్తుంది

అపోహ 4 : అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల శృంగారేచ్చ నశిస్తుంది

ఎక్కువగా హస్తప్రయోగం చేస్తే, అది మీకు వ్యసనంగా మారి నిజంగా శృంగారంలో పాల్గొనడం అంతగా మజా ఇవ్వదని అంటుంటారు. అందుకు విరుద్ధంగా నిత్య౦ హస్త ప్రయోగం చేయడం వల్ల మీరు శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొంటారు, పైగా శీఘ్ర స్ఖలనం సమస్య కూడా దూరం అవుతుంది. స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ ఉపయోగించి చూడండి.

 అపోహ 5 : హస్తప్రయోగం వల్ల గర్భం వస్తుంది

అపోహ 5 : హస్తప్రయోగం వల్ల గర్భం వస్తుంది

అన్నిటికన్నా పిచ్చి ఊహ ఏమిటంటే హస్తప్రయోగం వల్ల గర్భం వస్తుందనేది. కానీ అప్పుడే యుక్తవయసుకు వచ్చిన వారికి ఇది చాలా భయం కలిగించే అంశం. హస్తప్రయోగం వల్ల గర్భం ఎన్నటికీ రాదనేది నిజం. గర్భం రావాలంటే వీర్యం యోనిలోకి వెళ్ళాలి. ఒక స్త్రీ సాంగత్యంలో హస్తపర్యోగం చేసే పురుషుడు తన వీర్యం ఆమె యోనిలోకి పోకుండా చూసుకోవాలి.

English summary

Debunking Masturbation Myths

Is it okay to Masturbate? Will it affect my health? All these questions are an earful among people. A major chunk of people masturbate but are still worried that doing so might be playing with their health.
Story first published: Wednesday, November 12, 2014, 17:59 [IST]
Desktop Bottom Promotion