For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉడిపి స్టైల్ సాంబార్ రిసిపి-బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ స్పెషల్

|

సాంబార్ సౌత్ ఇండియన్ స్పెషల్ వెజిటేరియన్ రిసిపి. సౌత్ ఇండియాలో ఈ సాంబార్ రిసిపిని ఒక్కో స్టేట్ లో ఒక్కో రకంగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. రుచికి కూడా వేటికవే సాటి. ఈ క్లాసిక్ డిష్ ను పప్పు, తాజా వెజిటేబుల్స్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ సాంబార్ రిసిపి ఉదయం బ్రేక్ పాస్ట్ ఇడ్లీ, దోస కాంబినేషన్ కు మద్యహ్నానం రైస్ కాంబినేషన్, డిన్నర్ ఇలా ఒక రోజులో అన్ని సమయాలకు బాగా నప్పుతుంది.

టెంపుల్ టౌన్ గా పిలువబడే ఉడిపిలో చాలా ఫేమస్ అయినటువంటి రిసిపి ఉడిపి సాంబార్. ఈ పాపులర్ అయినటువంటి రిసిపిని కర్ణాటకాలో చాలా పేమస్ అయినటువంటి టెంపుల్ టౌన్ ఉడిపిలో దీన్ని ఎక్కువగా సర్వ్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఉడిపి సాంబార్ ఇడ్లీ మరియు దోసలలోకి బెస్ట్ కాంబినేషన్.

ఈ ఉడిపి స్పెషల్ సాంబార్ కు స్పెషల్ సాంబార్ పౌడర్ అవసరం లేదు. కొద్ది పాటి మసాలా దినుసులతోటే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ సాంబార్ ను ప్రత్యేకంగా వివిధ రకాలా కూరగాయలను ఉపయోగించి తయారుచేయవచ్చు. అలాగే ఎటువంటి కూరగాయలు లేకున్నా కూడా సాంబార్ ను తయారుచేయవచ్చు.

Udupi Style Sambar Recipe

కావల్సిన పదార్థాలు:
కందిపప్పు : 1/2 cup
మెంతులు: 1/2 tsp
మినపప్పు : 1tsp
ఎండు మిర్చి : 4

udipi sambar

కావల్సిన పదార్థాలు:
ధనియాలు: 1 1/2tbsp
కరివేపాకు: 5 రెమ్మలు
కొబ్బరి తురుము: /4 cup
చిన్న ఉల్లిపాయలు: (సాంబార్ ఉల్లిపాయలు):25-30 (శుభ్రం ఒలిచి కడిగి పెట్టుకోవాలి)
ఆవాలు: 1/2 tsp

udipi sambar

కావల్సిన పదార్థాలు:
హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు
పచ్చిమిర్చి: 2 (మద్యలోకి చీలికగా కట్ చేసుకోవాలి)
మీకు నచ్చిన కాయగూరల ముక్కలు: (వంకాయ, క్యారెట్లు, గుమ్మడికాయ, యామ్) : 2 cups
చింతపండు గుజ్జు: 1/2 tsp
నూనె: 2tbsp
బెల్లం: 1 1/2tsp
ఉప్పు : రుచికి సరిపడా

udipi sambar

తయారుచేయు విధానం:
1. ముందుగా కందిపప్పును కుక్కర్ లో వేసి కడిగి సరిపడా నీళ్ళు పోసి 3 విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
2. పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ క్రిందికి దింపుకొని, ప్రెజర్ తగ్గిన తర్వాత కుక్కర్ మూత తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత అందులో మెంతులు మరియు ఉద్దిపప్పు వేసి ఒక సెకన్ రోస్ట్ చేయాలి.
4. తర్వాత అందులోనే ఎండు మిర్చి, ధనియాలు, రెండు రెమ్మలు కరివేపాకు, కొబ్బరి తురుము వేసి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకూ అతి తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి.

Udupi Style Sambar Recipe


5. వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సర్ లో వేసి, కొద్దిగా నీళ్ళు జోడించి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
6. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో మరో టేబుల్ స్పూన్ నూనెవ వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, ఇంగువ వేసి ఒక సెకను వేగించుకోవాలి.
7. ఇప్పుడు అందులోనే చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిగిలిన కరివేపాకు వేసి మరో 5నిముషాలు వేగించుకోవాలి.
8. తర్వాత కూరగాయ ముక్కలన్నింటిని వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకొన్న పప్పు మరియు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా పేస్ట్ ను అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
10. మంటను తగ్గించి మరికొన్ని నిముషాలు మొత్తం మిశ్రమాన్ని ఉడికించుకోవాలి . అంతే సర్వ్ చేయడానికి ఉడిపి సాంబార్ రెడీ. ఈ స్పెషల్ సాంబార్ రిసిపిని రైస్ లేదా ఇడ్లీతో తింటే చాలా రుచికరంగా ఉంటుంది.

English summary

Udupi Style Sambar Recipe

Sambar is the signature dish of South India. No meal is ever complete without a bowl of sambar. Idlis, dosas, rice etc. look so incomplete without sambar to accompany them. People often mistake that sambar throughout South India taste the same. But it is not so.
Desktop Bottom Promotion