For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మునగ ఆకులోని అత్యుత్తమ ఆరోగ్యప్రయోజనాలు

|

వంటలకు ఘుమఘమలను అందించి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం కలిగించడంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాటిలో చెప్పుకోతగ్గది మునగ, మునగకాడల్ని చారు, సాంబారు, కూర, పచ్చడి సూప్ వంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ కాడలతోటే కాకుండా మునగ ఆకును వంటు చేసుకుని తినడం వలన శరీర ఆరోగ్యానికి మరింత దోహదం చేస్తుంది. అయితే, ఇప్పుడు కాడలు వాడినంతగా ఆకును వాడటం లేదనే చెప్పాలి. దీని లేత ఆకులు కూరగాను, పువ్వును మామూలు ఆకుకూర వండిన మాదిరిగానే వండవచ్చును. మునగాకు కాలేయంలో చేరిన విష పధార్థాలను హరిస్తుంది. ఇంకా మూత్రాశయంలో రాళ్లను కరిగిస్తుంది.

ములగకాయల గురించి మనకందరికీ తెలుసు. ములగ కాయల పులుసు ఎంత సువాసన భరితమో తెలియనిదెవరికి. అయినా ములగ ఆకు గురించి ఈ తరం వారిలో చాలామందికి తెలియకపోవటం ఆశ్చర్యకరమే. గృహవైద్యంలో ములగ ఆకు ఎంత ప్రధానమైనదో మన బామ్మలకు, అమ్మమ్మలకు, గ్రామీణ ప్రజానీకానికి బాగా తెలుసు. నిజానికి ములక్కాయల వలన ఉపయోగం తక్కువ. ములగ ఆకు వైద్య సంబంధమైన ఒక గొప్ప ఔషధి. అందువలన ములగ ఆకు గురించి తెలుసుకోవటం ఎంతో అవసరం.

మునగఆకులో ఉన్నంతగా ఎ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరలోను లేవు. సున్నము, భాస్వరము, ఇనుము తగినంతగా ఉన్నాయి. 100గ్రా ములగ ఆకులలో పోషకవిలువలు ఈ విధంగా ఉంటాయి. పిండిపదార్థాలు-13.4గ్రా, క్రొవ్వు పదార్థాలు 1.7గ్రా, మాంసకృత్తులు-6.7గ్రా, సున్నం-440మి.గ్రా, భాస్వరం-70మి.గ్రా, ఇనుము-7మి.గ్రా, పీచుపదార్థం 0.9మి.గ్రా. ఇన్ని గుణాలున్న మునగాకు అనేక ఆరోగ్య సమస్యలకు ఒక దివ్య ఔషదంగానే చెప్పవచ్చు. ముఖ్యంగా మునగాకు స్టొమక్ ఇన్ఫెక్షన్స్ తో బాధపడే వారికి అద్భుతంగా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మధుమేహగ్రస్తులకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇంతే కాదు, మరెన్నో అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేసే ఈ మునగాకులోని ఆరోగ్యప్రయోజనాలను తెలుసుకుందాం...

వ్యాధినిరోధకత పెంచడానికి:

వ్యాధినిరోధకత పెంచడానికి:

వివిధ రకాల వ్యాధులతో పోరడటానికి మీకు తగినంత వ్యాధినిరోధకత అవసరం అవుతుంది. కాబట్టి, మీ రోగనిరోధకతను బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒకటి లేదా రెండు సార్లు మునగాకు తీసుకోవడం మంచిది.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిక్ పేషంట్స్ కొరకు ఇది ఒక ఉత్తమ రెమెడీ. మీరు మధుమేహంతో బాధపడుతున్నట్లైతే, మీ రెగ్యులర్ డైట్ లో మునగాకును చేర్చుకోవాలి.

హై బ్లడ్ ప్రెజర్:

హై బ్లడ్ ప్రెజర్:

అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి మునగాకు అద్బుతంగా సహాయపడుతుంది. అందుకు ఒక గుప్పెడు మునగాకును వేడినీళ్ళలో నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత, ఈ నీటిని త్రాగాలి. ఇది మీ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది:

ఎముకలను బలోపేతం చేస్తుంది:

మునగాకు యొక్క మరో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం, ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది . మునగాకులో క్యాల్షియం మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉండి మీ ఎముకలను బలోపేతం చేస్తుంది మరియు కీళ్ళ నొప్పులను నివారిస్తుంది.

లైంగిక వాంఛ పెంచుతుంది :

లైంగిక వాంఛ పెంచుతుంది :

మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్, ఇది లైంగిక వాంఛను పెంచుతుంది. ఇది నపుంసకత్వాన్నిపోగొట్టుటలో ఒక నేచురల్ మెడిసిన్.

పాల ఉత్పత్తి:

పాల ఉత్పత్తి:

గర్భిణీ స్త్రీలలో ఇది చాలా సాధారణ సమస్య. అయితే, మునగాకును రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ను పెంచుతుంది.

రక్తహీనత:

రక్తహీనత:

మునగాకులోని మరో గొప్ప ఆరోగ్యప్రయోజనం, మన శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. ఈ ఆకుల్లో ఎక్కువగా ఐరన్ పుష్కలంగా ఉండి, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది.

జీర్ణశక్తికి:

జీర్ణశక్తికి:

ఇందులో అధికంగా యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి అద్భుతంగా పనిచేస్తాయి. అదే విధంగా పెరిగే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్ మెంట్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతుంది:

మునగాకులోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గొంతు, ఛాతీ మరియు స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుండి మనల్ని రక్షిస్తుంది.

లూజ్ మోషన్:

లూజ్ మోషన్:

మునగాకు రసంలో కొద్దిగా తేనె మరియు కొబ్బరి నీళ్ళు మిక్స్ చేసి తీసుకుంటే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

English summary

Health Benefits Of Eating Drumstick Leaves

If you have a drumstick tree growing in your garden, it is said you have a doctor at home! A drumstick tree is beneficial in so many ways when it comes to your health. The health benefits of drumstick leaves will help you get rid of many medical problems. It is not only good for your skin but is also helpful for your tummy too.
Story first published: Thursday, February 27, 2014, 17:26 [IST]
Desktop Bottom Promotion