For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోకాళ్ళకీళ్ళ నొప్పులను నయం చేసే బెస్ట్ హోం రెమడీస్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మోకాళ్ళ నొప్పులత బాధపడుతున్నారు. ముఖ్యంగా వయస్సైన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. అయితే ప్రస్తుత రోజుల్లో 30వయస్సులో ఉన్న యవ్వనస్తులు, మద్యవయస్కులు కూడా ఈ సమస్యకు భాద్యులవుతున్నారు.

ఈ మోకాళ్ళ నొప్పులకు ప్రధానకారణం జీవనశైలి, అలవాట్లు, వ్యాయామం లేకపోవడం. అయినప్పటికీ ప్రారంభంలో చాలా తక్కువ గా ఉన్నప్పటికీ సమయంను బట్టి పెరుగుతుంటుంది మరియు ఈ సమస్యను పరిష్కరించేందుకు కష్టం అవుతుంది. వయస్సు, మోకాలి గాయం మరియు కీళ్ళనొప్పులకు మరియు మోకాలి నొప్పులకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

బాడీపెయిన్స్ ను తగ్గించే మంచి ఆహారాల గురించి తెలుసుకోండి...

అందుకు మీరు ప్రత్యేకమైన వ్యాయామాలు చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ ను నివారించుకోవచ్చు. మరియు బ్లడ్ సర్కులేషన్ ను కూడా శరీరంలో మెరుగుపరుచుకోవచ్చు. సరైన డైట్ ను అనుసరించడం, మరియు కొన్ని వంటింటి చిట్కాలను అనుసరించడం వల్ల నేచురల్ గానే జాయింట్ పెయిన్స్ ను నివారించుకోవచ్చు.

ఉదాహరణకు, మీ రెగ్యులర్ డైట్ లో క్యారెట్, ఉల్లిపాయ మరియు మెంతులు వంటివి చేర్చుకోవడం వల్ల మోకాళ్ళ, కీళ్ళ నొప్పులును నివారించవచ్చు. సరైన పోషకాహారం తీసుకోవడం మీద శ్రద్ద పెడితే కీళ్ళ నొప్పులను నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమడీ. అదే విధంగా మోకాళ్ళ నొప్పులున్నప్పుడు, ఇతర కీళ్ళ నొప్పులున్నప్పుడు, డాక్టర్ సలహా తీసుకొని సున్నితమైన మసాజ్ చేసుకోవడం లేదా పెయిన్ రిలీఫ్ జెల్స్ వంటి అప్లై చేయడం వల్ల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఆర్థరైటిస్ చేతి నొప్పులు తగ్గించే సులభ చిట్కాలు

జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలిగించేటటువంటి వివిధ రకాల యోగాసనాలు కూడా ఉన్నాయి. వెయిట్ లిప్టింగ్ వ్యాయామాలు మరియు వెయిట్ గెయిన్ వ్యాయామం మోకాళ్ళ నొప్పులను మరింత ఎక్కువగా చేస్తాయి. మోకాళ్ళు నొప్పులను నేచురల్ గా తగ్గించుకొనేందుకు కొన్ని బెస్ట్ హోం రెమడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

మెంతులు

మెంతులు

మెంతులను రాత్రంతా నీళ్ళలో నానబెట్టి, ఉదయం వాటిని నమిలి తినాలి. మోకాళ్ళ నొప్పులను నివారించడానికి ఇది ఒక సింపుల్ హోం రెమడీ జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం పొందడానికి మెంతుల పేస్ట్ ను కూడా అప్లై చేసుకోవచ్చు.

ఉల్లిపాయలు తినాలి

ఉల్లిపాయలు తినాలి

ఉల్లిపాయల్లో సల్ఫర్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఉల్లిపాయలో ఉండే ఎంజైమ్స్ నొప్పులకు కారణం అవుతుంది. అయితే ఉల్లిపాయలు జీర్ణక్రియకు చాలా మంచిది మరియు బౌల్ మూమెంట్ మెరుగ్గా ఉంటుంది.

క్యారెట్స్

క్యారెట్స్

మోకాళ్ళలో నొప్పులను నివారించడానికి క్యారెట్స్ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్. క్యారెట్ లో లిగ్నెంట్స్ మరియు కీళ్ళనొప్పల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జాయింట్ పెయిన్స్ నివారించడానికి ఉడికించిన లేదా పచ్చి క్యారెట్స్ ను తీసుకోవచ్చు.

బరువు తగ్గించుకోవాలి

బరువు తగ్గించుకోవాలి

మోకాళ్ళలో జాయింట్ పెయిన్ కు ప్రధాన కారణం అధిక బరువు. శరీరం యొక్క బరువు మోకాళ్ళ మీద ఒత్తిడి పడుతుంది. దాంతో మోకాళ్ళ నొప్పులకు దారితీస్తుంది . కాబట్టి, బరువు తగ్గడం చాలా అవసరం.

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనెను గోరువెచ్చగా కాచి, జాయింట్ పెయిన్ ఉన్న చోట వేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తే చాలు.

హెర్బల్ మసాజ్

హెర్బల్ మసాజ్

కొన్ని మూలికల యొక్క ఆకులను నీళ్ళలో వేసి, బాగా మరిగించి తర్వాత పెయిన్ ఉన్న చోట అప్లై చేయాలి . ఈ హెర్బల్ వాటర్ ను తాగితే కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది.

పసుపు మిక్స్ చేసిన పాలు

పసుపు మిక్స్ చేసిన పాలు

ఇది ఒక బెస్ట్ హోం రెమడీ . ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది . ఈ యాంటీసెప్టిక్ , యాంటీఇన్ల్ఫమేటరి పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

యోగ

యోగ

జాయింట్ పెయిన్ నివారించుకోవడానికి అందుకు కరెక్ట్ అయిన యోగాసనాలను ప్రతి రోజూ ప్రాక్టీస్ చేయాలి.అంతకు ముందు యోగా నిపుణులను లేదా డాక్టర్ ను సంప్రదించాలి .

English summary

Home Remedies To Reduce Joint Knee Pain

Knee joint pain is the most common health problems of many people. Although older people suffer from it the most, these days young men in their late 30s are also becoming victims to knee joint pain.
Desktop Bottom Promotion