For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పులిపిర్ల నివారణకు ఉత్తమ ఇంటి చిట్కాలు

By Mallikarjuna
|

పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి.

పులిపిర్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కామన్ వార్ట్స్ (చేతివేళ్ళ చుట్టూ వస్తాయి), ప్లాంటార్ వార్ట్స్ (పాదాల మీద వస్తాయి), ఫ్లాట్ వార్ట్స్ (ముఖంమీద, మెడమీద వస్తాయి), జననాంగాలమీద వచ్చేవి జనైటల్ వార్ట్స్. అవి వేరే కోవకు చెందుతాయి. పులిపిర్లు ఒక విధమైన వైరల్ ఇన్ఫెక్షన్ వలన వస్తాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్ సోకిన ప్రతివారిలోనూ వస్తాయని చెప్పలేం. కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి లోనై రోగనిరోధక శక్తి లోపించినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే పులిపిర్లు వస్తాయి. సాధారణంగా పులిపిర్లతో ఏ సమస్య ఉండదు కాని కొన్నిసార్లు నొప్పి, దురద, రక్తం కారటం వంటి ఇబ్బందులు ఉండవచ్చు. పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వలన మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ మెడికేషన్ ద్వారానే పులిపిర్లను పూర్తిగా తగ్గించటం మంచిది.

పులిపిర్లు చర్మంలో ఏ భాగంలోనైనా రావచ్చు. వీటి సంఖ్య, పరిమాణాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. చాలా వరకు పుటిపిర్లు చిన్న చిన్న పొక్కులగా చర్మం రంగులో కలిసి పెరుగుతుంటాయి. ఒక్కోసారి నొప్పి, అసౌకర్యంగా కూడా కలుగుతుంది. వీటికి స్పర్శ కూడా తక్కువే. ఇవి సాధారణంగా ఒరిపిడికి గురయ్యే చోట ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే ఎక్కువ. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు ఇవి ఎక్కువగా ఉంటాయి..రోగనిరోధక శక్తి పెంచి, పులిపుర్లు మాడిపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం....

ఫ్లాక్ సీడ్స్

ఫ్లాక్ సీడ్స్

పులిపిర్ల నివారణ ఫ్లాక్స్ సీడ్స్ బాగా సహపడుతాయి. ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తో పేస్ట్ చేసి ఫ్లాక్స్ సీడ్స్ కు కొొద్దిగా తేనె మిక్స్ చేయాలి. దీన్ని పులిపిర్ల మీద అప్లై చేయాలి తర్వాత బ్యాండేజ్ చుట్టి సాయంత్రం తీసేయాలి. ఇలా ప్రతి రోజూ రెగ్యులర్ కొన్ని రోజుల పాటు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

మరో ఎఫెక్టివ్ హోం రెమడీ వెల్లిల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ చేసి పులిపిర్లు ఉన్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పైనాపిల్

పైనాపిల్

తాజాగా ఉండే పైనాపిల్ ముక్కలను పులిపిరికాయల మీద అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల త్వరగా ఫలితం ఉంటుంది.

అంజుర

అంజుర

అంజుర జ్యూస్ లేదా చెట్టకాండం నుండి వచ్చే రసాన్ని పులిపిర్ల మీద అప్లై చేయాలి. పులిపిర్లను తొలగించడానికి ఇది ఒక మంచి మార్గం.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

వెనిగర్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం ఈ ఉల్లిపాయ ముక్కలు తీసి పులిపిరికాయల మీద అప్లై చేయాలి. కొద్దిపేపు అలాగే ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.

కర్పూరం ఆయిల్

కర్పూరం ఆయిల్

కర్పూరం ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పులిపిరికాయలను నివారిస్తుంది.పులిపిర్లు ఉన్న ప్రదేశంలో కర్పూరం ఆయిల్ ను అప్లై చేయాలి .

ఆముదం నూనె

ఆముదం నూనె

పులిపిర్లు ఉన్న ప్రదేశంలో ఆముదం నూనెతో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆముదం నూనెను రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయాలి. వాటిని సాప్ట్ గా చేసి, రాలిపోయాలా చేస్తాయి.

బంగాళదుంప

బంగాళదుంప

అలాగే బంగాళదుంప ముక్కలతో పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రబ్ చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తే పులిపురికాయలు రాలిపోతాయి.

టీట్రీఆయిల్

టీట్రీఆయిల్

టీట్రీఆయిల్ ను పులిపిర్లున్న చోటా రెగ్యులర్ గా కొద్దిరోజుల పాటు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సైడర్ వెనిగర్

సైడర్ వెనిగర్

గోరువెచ్చని నీటితో పులిపిరికాయలను కొద్దిసేపు నాననివ్వాలి. 15-20నిముషాలు వేడి నీటిలో నానిన తర్వాత సైడర్ వెనిగర్ లో కాటన్ బాల్స్ డిప్ చేసి వాటి మీద ఉంచి, 10నిముషాల తర్వాత తీసి పూర్తిగా ఎండినవ్వాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి.

అరటి పండు తొక్క

అరటి పండు తొక్క

అరటి పండు తొక్క పులిపిరికాయలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రతి 12-24గంటలకొకసారి అప్లై చేయడం వల్ల అరటి పండు తొక్కలోపలి బాగం అప్లై చేస్తేం పులిపిరికాయలు తొలగిపోతాయి.

Desktop Bottom Promotion