For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగానే హై బిపి తగ్గించుకోవడానికి బెస్ట్ హోం రెమెడీస్

By Mallikarjuna
|

బిపి లేదా రక్తపోటు అనేది మన శరీరంలో రక్త వ్యవస్థాగతమైన ప్రసరణ ఒత్తిడితో ఉంటుంది. బ్లడ్ ప్రెజర్ కొన్ని సందర్భాల్లో సాధారణంగా ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన దాని కంటె అధికంగా ఉంటుంది. మన శరీరంలో బ్లడ్ ప్రెజర్ వల్ల మన శరీరంలో పనితీరు మీద ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మన శరీరంలో అధిక బ్లడ్ ప్రెజర్ లేదా అతి తక్కువ బ్లడ్ ప్రెజ్ వల్ల శరీరంపై భయంకరమైన ప్రభావాలు కారణం కావచ్చు .

లోబ్లడ్ ప్రెజర్ (తక్కువ రక్తపోటు)లేదా తక్కువ బిపి, మైకము, కళ్ళు తిరగడం, వికారం మరియు కొన్ని సందర్భాల్లో షాక్స్ వంటివాటికి కూడా కారణం కావచ్చు. హైబ్లడ్ ప్రెజర్(అధిక రక్తపోటు)లేదా హైబీపి వల్ల టెన్షన్స్, స్ట్రెస్ మరియు అశాంతికి దారితీస్తుంది, హైపర్ టెన్షన్ మరియు కొన్ని వరస్ట్ కేసుల్లో సినీరియో హార్ట్ అటాక్ కు గురిచేస్తుంది. అందువలన, రక్తపోటుతో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అది క్రమంగా తనిఖీ చేయించుకోవాలి .

లోబిపి కంటే హైబిపి మరింత ప్రమాదకరమైనదని మనందరికి తెలిసిన విషయమే. హైబిపి తీవ్రమైన ప్రాణాంతకమైనదిగా మారవచ్చు. మరియు ఇది సాధారణంగా స్ట్రెస్ మరియు స్ట్రెయిన్ పెరుగడం వల్ల కూడా కారణం అవ్వొచ్చు.

రక్తపోటును తగ్గించడానికి అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు మన శరీరంలో వివిధ రకాల ఒత్తిడుల కు మంచి ప్రభావాన్ని కలిగి ఉంటాయి, కానీ, వాటని రెగ్యులర్ గా తీసుకోవాలి. ఒక డోస్ మందు తీసుకోకపోయినా, పరిస్థితి మరింత తీవ్రంగా చేస్తుంది.

హైబిపితో బాధపడుతన్న వారికి, బిపిని తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ బాగా సహాయపడుతాయి . ఈ హోం రెమెడీస్ చాలా సురక్షితం మరియు ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండవు. హైబిపిని కంట్రోల్ చేసే కొన్ని హోం రెమెడీలను క్రింది విధంగా ఇవ్వబడ్డాయి : -

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

క్రమం తప్పకుండా వ్యాయామం: రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి, బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. మంచి భావనలు కలిగి ఉండటానికి అవసరం అయ్యే హార్మోనులను కూడా వ్యాయామం ద్వారా పొందవచ్చు. దాంతో టెన్షన్స్ తగ్గించుకొని, హైబిపిని తగ్గించుకోవచ్చు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ శరీరానికి తగ్గ బరువును మెయింటైన్ చేయాలి. అధిక బరువు కూడా బ్లడ్ ప్రెజర్ ను పెచుతుంది. అందువల్ల, హైబిపిని తగ్గించుకోవడానికి రెగ్యులర్ వ్యాయమం తప్పకుండా చేయడం చాలా అవసరం.

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

ఆరోగ్యకరంగా తినాలి: హై బిపి ఉన్న వ్యక్తి హైకొలెస్ట్రాల్ ఆహారాలు మరియు హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. బ్లడ్ ప్రెజర్ ను పెంచే ఆహారాలను తీసుకోవడం నివారించండి. కొన్ని ప్రత్యేకమైన పండ్లు, ధాన్యాలు మరియు కూరగాయలు తీసుకుంటే 2-5mm oh మెర్యురిని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో సలాడ్స్, బ్రౌన్ బ్రెడ్, పండ్లు, సూప్స్, మొ..ఆహారాలను చేర్చుకొని, రెగ్యులర్ గా తినాలి. ఒక మంచి డైట్ ప్లాన్, అనుసరించడం వల్ల హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు . హోం మేడ్ రెమెడీస్ ఉపయోగించి అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

చెడు అలవాట్లు మానుకోవాలి: సిగరెట్స్, టుబాకో మరియు ఆల్కహాల్ వంటి అలవాట్లు ఆరోగ్యానికి చాలా హానికరం. మద్యం కూడా శరీరం మీద చాలా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కానీ రెడ్ వైన్ వంటివి అరుదుగా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు కానీ, మోతాదు మించితే మాత్రం క్రమంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. మద్యం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ 5-10mm మెర్య్కురికి పెరుగుతుంది . అదే విధంగా టుబాకో, మరియు సిగరెట్లలో కనుగొనబడింది. కెఫిన్ వల్ల కూడా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కెఫిన్ వాడకాన్ని తగ్గించాలి.

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

ఉప్పును తగ్గించాలి: ఉప్పులో సోడియం కలిగి ఉంటుంది. సోడియం బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది అది సమస్యలకు దారితీస్తుంది. ఉప్పు ద్వారా మన శరీరంలోనిక అధిక మొత్తంలో సోడియం చేరుతుంది. అందువల్ల, బిపి తగ్గించుకోవడానికి ఉప్పును ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. అలాగే సోడియం మూలకం ఉన్న ఆహారాలను కూడా నివారించాలి.

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

సహజంగానే బిపి తగ్గించుకోవడం ఎలా

బిపిని రెగ్యులర్ గా తనిఖీ చేయాలి: బ్లడ్ ప్రెజర్ ను చాలా తేలికగా తీసుకోకూడదు. రెగ్యులర్ చెకప్స్ వల్ల శరీరంలో బ్లడ్ ప్రెజెర్ యొక్క పరిస్థితులకు తెలుసుకోవచ్చు. దాంతో ఏదైనా తీవ్ర పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే చికిత్స తీసుకోవచ్చు. అదేవిధంగా, రెగ్యులర్ చెకప్స్ మీరు అనుసరించే హోం రెమెడీస్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈచిట్కాలను ఉపయోగించి, బ్లడ్ ప్రెజర్ తగ్గించుకొని, ఎల్లప్పుడు సంతోషంగా ఒత్తిడి లేని జీవితాన్ని పొందండి.

Story first published: Friday, January 3, 2014, 20:49 [IST]
Desktop Bottom Promotion