For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో డీహైడ్రేషన్ నివారణకు ఉత్తమ చిట్కాలు

By Super
|

మన శరీరం నీరు, తేమ తగినంత లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. సాధారణంగా ఈ పరిస్థితి వేసవి కాలంలో వస్తుంది, అప్పుడు అత్యధిక వాతావరణ పరిస్థితుల వల్ల చర్మంపై పొర కింద నీరు ఇంకిపోతుంది. శరీరంలో ద్రవాలు లేకపోవడం మంచిది కాదు. మీరు కోల్పోయిన ద్రవాలను పొందడానికి తగినంత నీరు తీసుకోవడం అవసరం. అధిక వేసవి కారణంగా, మీ శరీరానికి కావలసిన ఫ్లూయిడ్స్ కంటే అధికంగా వినియోగించవలసి వస్తుంది. అందువల్ల, ప్రతి ఒక్కరూ శరీరానికి కావలసిన నీటికంటే ముఖ్యంగా వేసవి సమయంలో అధిక మోతాదులో నీరు తీసుకోవడం అవసరం.

మనిషి ప్రతిరోజూ శరీరం నుండి నీటిని ఆవిరి రూపంలో కోల్పోవడం సహజ౦. ఇది శరీరం నుండి చమట, మూత్రం రూపంలో బైటికి వెళ్తుంది. చెమటతోపాటు అధిక మోతాదులో మన శరీరంలోని లవణాలను కూడా కోల్పోతాము. ఆ లవణాలను తిరిగి పొందడానికి మీ శరీరాన్ని ఆర్ద్రీకరణ లో ఉంచుకోవడం అవసరం.

డీహైడ్రేషన్ శరీరానికి ఒక వ్యక్తీ తీసుకోవాల్సిన చికిత్సలు

ఉప్పు, పంచదార నీళ్ళు

ఉప్పు, పంచదార నీళ్ళు

కొన్ని సంవత్సరాలుగా మనుషులు ఉప్పు, పంచదార నీటిని వారి శరీరంలో డీహైడ్రేషన్ కి ఒక చక్కటి పరిష్కారంగా నిరూపించుకున్నారు. ఈ మిశ్రమాన్ని తయారుచేయడానికి ఒక పద్ధతి ఉంది. ఒక గ్లాసు నీటిలో అర చెంచా ఉప్పు, ఒక చెంచా పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాతో బాగా కలపండి; పంచదార కరిగే వరకు ఆ మిశ్రమాన్ని కలపండి. ఆ మిశ్రమంలో ఒక్క పంచదార గుళిక కూడా కనిపించకూడదు.

 పండ్ల రసాలు

పండ్ల రసాలు

మీరు మార్కెట్ లో అనేక రకాల పండ్ల రసాలను చూసే ఉంటారు. మీరు ఆరంజ్, నిమ్మ వంటి రసం గల పండ్లను కొన్నిటిని తీసుకుని వాటితో అద్భుతమైన రసాలను చేయవచ్చు. జ్యూసర్ ని ఉపయోగించి పండ్ల రసాలను తయారుచేయండి. మీరు ఒక పండును తీసుకుని సాధారణ పండ్ల రసాన్ని తయారుచేయవచ్చు లేదా అన్ని రకాల పండ్ల మిశ్రమంతో కలబోత పండ్ల రసాన్ని చక్కగా తయారుచేయవచ్చు. మీరు కొద్దిపాటి ఉప్పు, పంచదార ఆ పండ్ల రసాలలో కలిపితే దాని రుచి మరింత పెరుగుతుంది.

గొడుగు

గొడుగు

సూర్యరస్మి అధికంగా ఉన్న ప్రదేశానికి మీరు వెళ్ళేటపుడు, గొడుగును తీసుకు వెళ్ళడం చాలా ముఖ్యం, దీనివల్ల మీ చర్మం టాన్ కాకుండా, అలసిపోకుండా చేస్తుంది. సూర్య కిరణాలూ నేరుగా మీమీద పాడడం వల్ల చర్మం రంగుమారి నల్లగా తయారవడం, వికృతంగా కాకుండా ఉంటుంది. మీ శరీరానికి అధికంగా కాకుండా కొద్ది మోతాదులో విటమిన్ D కూడా అవసరం. అందువల్ల, మీరు గొడుగు లేకుండా వెళ్లడాన్ని నివారించడం అవసరం.

సురక్షిత మంచినీరు

సురక్షిత మంచినీరు

ప్రతిరోజూ నీటిని తీసుకోవడం, అదీ ఎక్కువ మోతాదులో డీహైడ్రేషన్ ని నివారించడానికి చాలా అవసరం. మీరు ప్రతిరోజూ తప్పనిసరిగా 8 గ్లాసుల నీటిని తీసుకోవాలి, దీనివల్ల వేసవి కాలంలోని అధిక వేడిని కూడా తట్టుకోగాలుగుతారు.

నిమ్మకాయ నీళ్ళు

నిమ్మకాయ నీళ్ళు

నిమ్మకాయ అద్భుతమైన సహజ పదార్ధాలలో ఒకటి, ఇది డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని కాపాడటమే కాకుండా, మీరు తాజాగా, ఉత్సాహంగా కూడా ఉండేట్లు చేస్తుంది. మీరు డీహైడ్రేషన్ ని నిర్మూలించడానికి రోజులో ఒకసారి మధ్యాహ్న సమయంలో నిమ్మరసం తాగడం అవసరం.

English summary

How to treat men with dehydrated body?

Our body gets dehydrated due to lack of water and moisture content. This takes place generally during the summer season when the extreme weather condition dries up everything along with the water content under the skin layers.
Desktop Bottom Promotion