For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అపెండిసైటిస్ ప్రారంభ లక్షణాలు : నొప్పి నివారణలు

|

మీ అపెండిక్స్,ఒక పురుగు ఆకారంలో ఉండే సంచీ,పెద్దప్రేగుతో జతపడి,ఎర్రబడిన వెంటనే అపెండిసైటిస్ ఏర్పడుతుంది. ఈ అపెండిసైటిస్ చాలా బాధాకరంగా ఉంటుంది మరియు దీని నవారణకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

ఈ అపెండిక్స్ పగులుతే, ప్రాణాపాయం కూడా కలుగవొచ్చు, కాని వైద్యులు దానికిముందే సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.

అపెండిసైటిస్ ప్రారంభదశలో ఉదరక్రిందిభాగంలో నొప్పి కలుగుతుంది, కాని ఈ అపెండిసైటిస్ వలన అనేక ఇతర లక్షణాలు కూడా కలుగుతుంటాయి. క్రింద ఇచ్చిన లక్షణాలను చూడండి మరియు మీకు ఆ లక్షణాలతో బాధపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

పొట్ట ఉదరంలో నొప్పి

పొట్ట ఉదరంలో నొప్పి

అపెండి సైటిస్ ప్రారంభదశల బెల్లీ బాటమ్ లో నొప్పిగా అనిపిస్తుంది . మరియు ఇతర లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి . ఈ నొప్పి నిధానంగా పొట్ట ఉదర క్రిందిభాగంలోనికి చేరుతుంది.

నొప్పి క్రమంగా పెరుగుతుంది

నొప్పి క్రమంగా పెరుగుతుంది

అపెండిసైటిస్ మొదటి కొద్దిగా నొప్పి తో ప్రారంభమై, తర్వాతర్వాత క్రమంగా నొప్పి పెరుగుతుంది . ఈ నొప్పి అలా కొద్దిసేపు అలాగే ఉంటుంది.

జ్వరం

జ్వరం

అపెండిసైటిస్ లో గ్రేడ్ ఫీవర్ తో మొదలవుతుంది. అది కూడా కడుపునొప్పితో ప్రారంభం అవుతుంది . తర్వాత జ్వరం మరింత ఎక్కువ అవుతుంది.

వికారం మరియు వాంతులు

వికారం మరియు వాంతులు

అపెండిక్స్ కు మరో లక్షణం వికారంతో కూడిన వాంతులు ప్రారంభం అవుతాయి. ఇది సాధరణ కడుపునొప్పికి దారితీస్తుంది. కానీ, పరిస్థితి 12గంటలకు మించి ఉన్నట్లైతే డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలి.

డయోరియా

డయోరియా

ఉదరంలో వచ్చే నొప్పితో పాటు, విరేచనాలు మరియు మరికొందరిల మ్యూకస్ సమస్యలు కూడా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి.

గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం

గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం

కడుపు ఉబ్బరం , గ్యాస్ అందరిలో ఒకేలాగ కనిపించదు, కానీ, ఉదరంలో పొట్టపైభాగంలోనే, క్రింది భాగంలోనా అన్న విషయాన్ని బట్టి తెలుస్తుంది.

పొట్ట ఉదరంలో తిమ్మెర్లు, సలుపు

పొట్ట ఉదరంలో తిమ్మెర్లు, సలుపు

మీకు అపెండిసైటిస్ లక్షణాలున్నట్లు అనుమానం ఉంటే, కుడివైపు, పొట్టఉదరంలో కొంచెం ఒత్తిడిని కలిగించండి .

మూత్ర విసర్జనప్పుడు నొప్పి

మూత్ర విసర్జనప్పుడు నొప్పి

కొంతమంది అపెండిసైటిస్ పేషంట్స్ మూత్రం విసర్జించేటప్పుడు, నొప్పిని కలిగి ఉంటారు. ఈ నొప్పితో అలాగే ఉంటే, అది రప్చర్డ్ అపెండిసైటిస్ గా గుర్తించాలి. ఇది అపెండిసైటిస్ మీద ఒత్తిడివల్ల మూత్రం విసర్జించేటప్పుడు నొప్పి కలుగుతుంది.

బాడీపెయిన్

బాడీపెయిన్

కడుపు ఉదరంలో పైన లేదా క్రింది భాగంలో నొప్పి ఉన్నప్పుడు, వెన్నెముక లేదా రెక్టమ్ నొప్పిని కలిగిస్తుంది.

మలబద్దకం

మలబద్దకం

అపెండిసైటిస్ కు ఇది సాధారణ లక్షణం కాదు, అయితే, కొంత మంది పేషంట్స్ ఈ సమస్యత కూడా బాధపడుతారు.

English summary

Pain management: Early signs of appendicitis

Appendicitis occurs when your appendix, a worm-shaped pouch attached to the large intestine, becomes inflamed. Appendicitis can be very painful and may require surgery.
Story first published: Sunday, March 9, 2014, 14:31 [IST]
Desktop Bottom Promotion