For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాళ్ళు, పాదాలు వాపులు-10 ఉత్తమ నివారణోపాయాలు

|

సాధారణంగా పాదాలు వాపులు రావడాన్ని సైంటిఫిక్ గా ఎడిమా అంటారు. నిపుణుల ప్రకారం, పాదాలు, కాళ్ళు మరియు చీలమండము వాపులు శరీరంలో బ్లడ్ ప్రెజర్ పెరిగినప్పుడు వాపులకు ఏర్పడుతాయి. అలాగే ఉప్పు ఎక్కువగా తిన్నా, ఎక్కువ సమయం ప్రయాణం లేదా గర్భధారణ వల్ల కాళ్ళు, పాదాలు వాపులు రావాడం సహజం. అందువల్ల మీరు గర్భిణీ కానట్లైతే మీకు పాదాలు తరచు వాపులు అవుతుంటే, వెంటనే దాని గురించి శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. పాదాలు, కాళ్ళు, మరియు చీలమండము వాపులను నివారించడానికి కొన్ని బెస్ట్ హోం రెమడీస్ ఉన్నాయి.

మీ పాదాలు, కాళ్ళు మరియు చీలమండ మన శరీరంలో చాలా ప్రధానమైనటువంటి వాకింగ్ మెషిన్స్. మనం వీటి సహాయం లేకుండా నడవడం సాధ్యం కాదు, కాబట్టి, వీటికి గురించి తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం. తరచూ పాదాలు, కాళ్ళ వాపులతో బాధపడుతుంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాధం ఉంది. దాంతో ఇతర ఆరోగ్య సమస్యలను దారితీస్తుంది. ఎక్కువ నొప్పి, బాధకు గురిచేస్తుంది. దాంతో మీరు నడవడానికి కష్టం అవుతుంది. కాబట్టి, కాళ్ళు, పాదాల వాపులను నివారించుకోవడానికి ఈక్రింది స్లైడ్ లో ఉత్తమ హోం రెమెడీస్ ఉన్నాయి...

మెగ్నీషియం కంటెంట్ ను పెంచాలి:

మెగ్నీషియం కంటెంట్ ను పెంచాలి:

కాళ్ళు, పాదాలు, మరియు చీలమండ వాపులను నివారించడానికి మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో మెగ్నీషియంను పెంచాలి. మెగ్నీషియం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, నట్స్ మరియు అవొకాడోలో ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల క్రమంగా వాపులు తగ్గుముఖం పడుతాయి.

యోగ:

యోగ:

జెనిటిల్ ఎక్సర్సైజ్ మరియు కొన్ని యోగభంగిమలు కాళ్ళు, పాదాలు మరియు చీలమండము వద్ద బ్లడ్ సర్కులేషన్ కు సహాయపడుతాయి. దాంతో కాళ్ళు, పాదాల వాపులుండవు.

టానిక్ వా3టర్:

టానిక్ వా3టర్:

పాదాలు, కాళ్ళు, చీలమండం వాపులను నివారించాలంటే, ఒక గిన్నెల్లో నిండుకు పోసిన టానిక్ వాటర్ లో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా డిప్ చేసిన పాదాలను కనీసం అరగంటసేపైనా నాననివ్వాలి . వాపులు తగ్గకపోతే, తిరిగి ఇలా మరో నాలుగు గంటల తర్వాత తిరిగి అలాగే చేయాలి.

సాల్ట్ వాటర్:

సాల్ట్ వాటర్:

పాదాల వాపులను సాల్ట్ వాటర్ తగ్గిస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా, గోరువెచ్చని నీటిలో రాళ్ళ ఉప్పు వేసి అందులో మీ పాదాలను ముంచి అరగంట పాటు అలాగే నాననివ్వాలి. ఇలా రోజుకు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నూనెలు:

నూనెలు:

పాదాలు, కాళ్ళు, చీలమండం వాపులను నివారించడానికి మరో ఉత్తమ హోం రెమడీ పుదీనా లేదా యూకలిప్టస్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతాయి. ఈ నూనెలు మర్ధన చేయడం వల్ల పాదాల వాపులతోపాటు, నొప్పికూడా తగ్గుతుంది.

పాదాలను కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి:

పాదాలను కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి:

పడుకొనేటప్పుడు లేదా కూర్చొన్నప్పుడు మీ పాదాలను కొంచెం ఎత్తులో పెట్టుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంతో పాటు, వాపులు తగ్గుతాయి.

తగినంత నీరు తీసుకోవాలి:

తగినంత నీరు తీసుకోవాలి:

రోజంతా ఎక్కువ నీరు తీసుకోవాలి. వాపులు తగ్గించుకోవాలంటే తగినన్ని నీరు త్రాగాలి. మీ శరీరంలో అధిక ఎసిడిక్ కంటెంట్ ఉన్నప్పుడు అది నీరు పూర్తిగా తగ్గించేస్తుంది.

ఎప్సమ్ సాల్ట్:

ఎప్సమ్ సాల్ట్:

స్నానంచేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల పాదాలు, కాళ్ళు, వాపులు తగ్గుతాయి. అలాగే ఇవి నొప్పిని కూడా నివారిస్తాయి.

వేసవిలో స్విమ్మింగ్:

వేసవిలో స్విమ్మింగ్:

స్విమ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ముఖ్యంగా కాళ్ళల్లో రక్తప్రసరణ పెరిగి కాళ్ళు, పాదాల చీలమండ వాపులను నివారిస్తుంది

మసాజ్:

మసాజ్:

కాళ్ళు, పాదాలు, చీలమండం వాపులను నివారించడానికి మరో ఉత్తమ చిట్కా పాదాలను మసాజ్ చేయడం. మసాజ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.

English summary

Ten Simple Home Remedies To Treat Swollen Feet, Legs & Ankle

Swelling in the feet is scientifically called as edema. According to experts, feet, legs and ankles swell due to the increase in blood pressure, a high intake of salt, excess travelling or pregnancy. So, if you are not pregnant and have swollen feet, it is something you should worry about. There are some best home remedies to treat swollen feet, legs and ankles.
Story first published: Wednesday, May 14, 2014, 17:17 [IST]
Desktop Bottom Promotion