For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీ డీహైడ్రేషన్ కు గురికాకుండా నీరు తీసుకోవడమెలా

|

సాధారణంగా చాలా మంది రోజంతా మన శరీరానికి సరిపడా నీరు తీసుకోరు. సరిపడా నీరు మన శరీరానికి అందకపోతే మనలో వచ్చే ప్రధాన సమస్య డీహైడ్రేషన్. మన శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఉదా: శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, మూత్రంలో మంట మొదటి సమస్య. మన శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు, మూత్రం పసుపుపచ్చ వర్ణంలోనికి మారుతుంది. దాంతో మూత్ర విసర్జన చేసిన తర్వత మంట పుడుతుంది. డీహైడ్రేషన్ తో ఇది ఒక ప్రధాన సమస్యగా భావించవచ్చు.

కిడ్నీ స్టోన్స్, ఇది మరో అనారోగ్య సమస్య, ఈ సమయంలో వచ్చే సమస్య. కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం శరీరంలో తగినంత నీరు లేకపోవడం. శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం వల్ల చర్మం మరియు జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. రోజులో శరీరానికి తగింత నీరు అందేలా నీరు త్రాగడం ఖచ్చితంగా కాకపోయినా, ఇది చాలా అవసరం.

రోజంతా నీటితో ఏవిధంగా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే, మీకు కొన్నిమార్గాలను ఇక్కడ అందిస్తున్నాము. ఎక్కువగా నీరు తీసుకోవడానికి బదులుగా, నీటిశాతం అధికంగా కలిగిన పండ్లు, మరియు వెజిటేబుల్స్ ను మీ రెగ్యురల్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీరు శరీరాన్ని హైడ్రేషన్ లో మరియు హెల్తీగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకు: సిట్రస్ పండ్లు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ముఖ్యంగా ఆకుకూరల్లో నీటిశాతం అధికంగా ఉంటుంది.

మీ ఆరోగ్యకరమైన శరీరానికి నీటిశాతం అధికంగా అంధించాలన్నా, చర్మం కాంతివంతంగా మరియు జుట్టు బలంగా ఉండాలన్నా..ఈ క్రింది చిట్కాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి.....

ఎప్పుడు మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి:

ఎప్పుడు మీ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లండి:

మీరు షాఫింగ్, ప్రయాణం, జిమ్ ఇలా ఎక్కడికి వెళ్ళిన మీ వెంట తప్పని సరిగా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది సమస్య కాదు, వాటర్ బాటిల్ మీతో తీసుకెళ్ళడం ప్రధానం. మీకు దాహం వేసిన వెంటనే నీరు త్రాగవచ్చు.

ప్రతి రోజూ టార్గెట్ చేయాలి:

ప్రతి రోజూ టార్గెట్ చేయాలి:

రోజులో మీరు ఎంత మోతాదులో నీరు తీసుకుంటున్నారో ఎటువంటి క్రమపద్దతి అనుసరించకుండా మీరు నీరు త్రాగడం, అప్పుడు అది మిస్టేక్ అవుతుంది. కాబట్టి, మీరు తక్కువ సమయం లేదా ఎక్కువ సమయం గ్యాప్ ఇచ్చి నీరు త్రాగినా మంచిదే. సాయంత్రం సమయంలో నీరు తక్కువగా త్రాగేవారి కోసం రెండు గంటలకు ఒక బాటిల్ నీరు లేదా ఒక గంటకు ఒక గ్లాస్ ను తీసుకోవడం మంచిది.

జ్యూస్ లు:

జ్యూస్ లు:

అధిక నీరు తీసుకోవడానికి ఒక హెల్తీ మార్గం అధికంగా జ్యూసులు తీసుకోవడం . నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇది ఒక సింపుల్ చిట్కా . కాబట్టి, హెల్తీ ఫ్రూట్స్ జ్యూసులు మరియు వెజిటేబుల్ జ్యూసులు రెగ్యులర్ గా తీసుకోవడం ఉత్తమం.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల ఇది మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది మరియు ఆరోగ్యానికి మంచిది కూడా . మఖ్యంగా డీహైడ్రేషన్, యూటిఐ ఇన్ ఫెక్షన్, యూరిన్ తగ్గించుకోవడానికి కోకనట్ వాటర్ ఒక సులభమైన పరిష్కారం.

పండ్లు మరియు వెజిటేబుల్స్:

పండ్లు మరియు వెజిటేబుల్స్:

పండ్లు మరియ వెజిటేబుల్స్ నీటిశాతం అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి ఫర్ ఫెక్ట్ గా ఉంటాయి. పుచ్చకాయ, ఆరెంజ్, టమోటో, స్వీట్ లైమ్ మరియు స్ట్రాబెర్రీ అధిక శాతం నీరు కలిగి ఉండం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

కెఫిన్ కు చెక్ పెట్టండి:

కెఫిన్ కు చెక్ పెట్టండి:

కెఫిన్ కు అలవాటు పడిన వారు చాలా మందే ఉంటారు . కెఫిన్ డీ హైడ్రేషన్ కు దారితీస్తుంది. అందువల్ల నీటి శాతాన్ని పెంచి, కేఫినేటెడ్ డ్రింక్స్ ను తగ్గించడం వల్ల డీహైడ్రేషన్ ను తగ్గించుకోవచ్చు.

English summary

Tips To Increase Water Intake

It is always advised to drink lots of water. Dehydration is one of the worst health conditions which can lead to problems.
Story first published: Monday, January 6, 2014, 13:02 [IST]
Desktop Bottom Promotion