For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోర్ అలెర్జీలు నివారించడానికి చిట్కాలు

By Mallikajuna
|

అలర్జీ అనేది ఏవిధంగా అయినా ఏర్పడవచ్చు. దుమ్ము, ధూళి, గాలి, నీరు, తినేటువంటి ఆహారం ఇలా ఏవిధంగా అయినే అలర్జీలు సోకవచ్చు, మనశరీరానికి ఇంటర్నల్ గా మరియు ఎక్స్ టర్నల్ గాను అలర్జీలు ఏర్పడుతాయి. ఎటువంటి అలర్జీలనైనా సరే మనం వాటని భారీన పడకుండా మనం మన శరీరాన్ని కాపాడుకవాలి. అలర్జీలు అనేవి భయట మాత్రమే కాదు, మన నివసించే చుట్టుప్రక్కల ప్రదేశాలు, మన నిత్యం ఉండే, లేదా నివశించే మన ఇంట్లో కూడా అలర్జీలకు కారణం అయ్యే కారకాలు పొంచి ఉంటాయి . కొంత మంది ఇంట్లో చేరే దుమ్ముధూళి వల్ల కూడా అలర్జీలకు కారణం అవుతుందనికి రిపోర్ట్ చేస్తుంటారు.

ఇండోర్ అలర్జీలు మన ఇంట్లో కొన్ని ప్రతికూల ప్రదేశాల్లో పడకగది, బాత్ రూమ్ మరియు ప్లేరూమ్ ల నుండి కూడా వస్తుంది. అలర్జీల వల్ల చర్మం మీద దద్దుర్లు, బాయిల్స్, శ్వాససంబంధిత సమస్యలు అంటే తుమ్ములు, దగ్గు, ఆస్తమా మరియు ఇరములు కూడా ఏర్పుడుతాయి . వివిధ రకాలుగా అలర్జీలు వ్యక్తిలో రియాక్షన్ ఇస్తుంది.

ఇండోర్ అలర్జీకు కారణం తెలుసుకునటకు క్రింద కొన్ని సూచనలున్నాయి:

ఇంటిని డిటాక్సిఫై చేయడం:

ఇంటిని డిటాక్సిఫై చేయడం:

ఇంటిలోపల అలెర్జీకి కారణం అయ్యేవి వ్యాప్తి చెందేందుకు అనేక మార్గాలున్నాయి. అలెర్జీకి ఇక సాధారణ కారణం సిగరెట్స్ . సిగరెట్స్ లో అనేక టాక్సిన్స్ ఉంటాయి. సిగరెట్ పొగలో హానికరమైన టాక్సిన్స్ ఉంటాయి. అవి ఇంట్లో అలర్జీలను కలిగిస్తాయి. ఈకెమికల్ టాక్సిన్స్ వల్ల ఏర్పడే అలర్జీలు మన శరీర ఆరోగ్యానికి కూడా చాలా చెడు తలపెడుతాయి . అందువల్ల , ఇండోర్ అలర్జీలను తగ్గించుకోవడానికి , మీ ఇంటిని స్మోకింగ్ జోన్ గా మార్చకండి . ఇంట్లో ఎవరినైనా సరి పొగత్రాగనివ్వకండి.

ఇంట్లో దుమ్మధూళి నివారించాలి:

ఇంట్లో దుమ్మధూళి నివారించాలి:

ఇండోర్ అలర్జీలకు అతి పెద్ద కారణం దమ్ము మరియు ధూళి వలన . డస్ట్ వల్ల చర్మ మీద దద్దుర్లు, శ్వాససంబంధిత సమస్యలు మరియు అసౌకర్యంను కలిగిస్తాయి . కాబట్టి, ఇంట్లోకి వచ్చే దుమ్ము ధూళిని నివారించడానికి కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవే కాకుండ మీ ఇంట్లో ఫర్నీచర్ మరియు ఇతర వస్తువులు ఎప్పుడూ క్లీన్ గా ఉండేలా శుభ్రం చేస్తుండాలి. దిండుకవర్లు, బెడ్ కవర్లు, మరియు బెడ్ షీట్లు రెగ్యులర్ గా శుభ్రం చేస్తుండాలి. ఈ ప్రదేశాల్లో ఎక్కువగా దుమ్ము, ధూళీ పేరుకుపోతుంది. మరియు దుమ్ముధూళి చేరకుండా ఉండాలంటే విండోలను ఎప్పుడూ మూసి ఉంచండి. అలాగే అవసరం అయితే డస్ట్ ట్రాప్స్ ను ఉపయోగించాలి.

మాత్ ఉచ్చులు మరియు దోమ వలలు -

మాత్ ఉచ్చులు మరియు దోమ వలలు -

మాత్ , ఈగలు దోమలు కూడా అలెర్జీలకు కారణం కావచ్చు . ఇండోర్ అలెర్జీలు నిరోధించడానికి ఒక మంచి చిట్కా మాత్ ట్రాస్ లేదా దోమ వలలు ఉపయోగించాలి . ఇంటి మెయిన్ డోర్ కు అవతలి వైపున మరియు విండోలకు ఇటువంటి క్రిమికీటకాలు ఇంట్లోకు రాకుండా వీటిని ఉపయోగించాలి. ఈ ట్రాప్స్ ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ వర్కింగ్ అందుభాటులో ఉంటాయి. అలాగే క్రిమి సంహారక స్ప్రేలను ఉపయోగించవచ్చు.

పెట్ కేర్(పెంపుడు జంతువుల సంరక్షణ):

పెట్ కేర్(పెంపుడు జంతువుల సంరక్షణ):

ఇండోర్ అలర్జీలకు పెట్ కూడా ప్రధానకారణం అవుతాయి. పెట్స్ కుక్కుల మరియు పిల్లులు వంటి పెంపుడు జంతువులు తరచూ జుట్టు రాలుతుంటుంది. ఈ జంతువుల యొక్క జుట్టు లేదా బొచ్చు అలర్జీలకు కారణం అవుతుంది. కాబట్టి, ఇండోర్ అలర్జీలను నివారించడానికి పెంపుడు ఒక మంచి చిట్కా వాటిన నిర్వహణ మరియు సంరక్షణ చాలా అవసరం. ఈ పెంపుడు జంతువులను నిరంతరం శుభ్రం చేయాలి. క్లీన్ గా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు వాటి జుట్టును ట్రిమ్ చేస్తుండాలి. అలాగే కొన్ని మెడిసినల్ షాంపులను, క్రీములను ఉపయోగించడం వల్ల పెంపుడు జంతువుల్లో హెయిర్ ఫాల్ ను నివారిస్తుంది .

 ఘాటైన సుగంధాలను నివారించండి:

ఘాటైన సుగంధాలను నివారించండి:

కొంత మందికి స్ట్రాంగ్ గా ఉండే వాసనలంటే పడవు. స్ట్రాంగ్ గా ఉండే ఫెర్ఫ్యూమ్స్ మరియు రూమ్ రిఫ్రెషనర్ అంటే పడవు. అటువంటి వారిలో మీరు ఒక్కరైతే ఘాటైన వాసన కలిగిన ఫెర్ఫ్యూమ్స్, సుగంధ చెక్కలు, రూమ్ ఫ్రెష్ నర్స్ వాడకాన్ని నివారించండి . గాఢమైన వాసన కొన్ని సమయాల్లో తీవ్రమైన చల్లని, తలనొప్పి మరియు వికారం కలిగిస్తుంది. ఈ అలర్జీలను నివారించడానికి తాజా గాలి వీచే ప్రదేశంలో తిరగాలి. ఫెర్ఫ్యూమ్స్ కు ధూరంగా ఉండాలి.

Story first published: Tuesday, March 11, 2014, 10:49 [IST]
Desktop Bottom Promotion